ఆది.. పాన్ ఇండియా సినిమా

సాయికుమార్ త‌న‌యుడిగా ఇండ్ర‌స్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆది. ప్రేమ కావాలి, లవ్లీ సినిమాల‌తో మంచి విజ‌యాలు ద‌క్కాయి. ఆ త‌ర‌వాతే ట్రాక్ త‌ప్పాడు. ప్ర‌తిభ ఉన్నా, అవ‌కాశాలు వ‌స్తున్నా స‌ద్వినియోగం చేసుకోవ‌డం లేదు. ఇప్పుడు స‌రైన క‌థ కోసం, స‌రైన ప్రాజెక్టు కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ క్ర‌మంలో ఓ ఛాన్స్ వ‌చ్చింది ఆది. ఈసారి ఏకంగా పాన్ ఇండియా ప్రాజెక్టుపైనే గురి పెట్టాడు.

బాల‌వీర్ అనే ఓ యువ ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ ఆదికి బాగా న‌చ్చింది. తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇదో ఇన్వెస్టిగేటీవ్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌. చిన్న కామిక్ ట‌చ్ కూడా ఉంటుంద‌ట‌. క్ష‌ణం, గూఢ‌చారి, బ్రోచేవారెవ‌రురా, ఏజెంట్ సాయిశ్రీ‌నివాస ఆత్రేయ సినిమాలు చిన్న బ‌డ్జెట్‌లో తెర‌కెక్కినా, మంచి ఇంపాక్ట్ చూపించాయి. ఇదే కోవ‌లో ఈచిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. కాక‌పోతే పాన్ ఇండియా స్థాయిలో. ఈ ప్రాజెక్టుపై రెండేళ్ల నుంచీ ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయ‌ట‌. సౌత్ ఇండియాలోని కీల‌క న‌టులు ఈ సినిమాలో క‌నిపిస్తార‌ని స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీటీడీ ఆన్ లైన్ పూజల బాట..!

కరోనా కొట్టిన దెబ్బ కారణంగా.. ఆదాయం కోసం టీటీడీ అధికారులు ఆన్ లైన్ బాట పడుతున్నారు. ఆర్జిత సేవల్ని ఆన్ లైన్‌లో పాల్గొనే విధంగా చేయబోతున్నారు. ఆన్ లైన్ లో శ్రీవారి...

తెలంగాణం కోటి ఎకరాల మాగాణం..!

తెలంగాణలను కోటి ఎకరాల మాగాణం చేయాలనే లక్ష్యాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ సాధించారు. ఈ ఏడాది... కోటికి ఎకరాల్లో...మాగాణి పంటలను రైతులు పండిస్తున్నారు. వానా కాలం సీజన్‌లో.. కోటి ఇరవై లక్షల...

హైదరాబాద్‌లో స్థానికులకే ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికీకరణ లేదు. కొత్త ప్రభుత్వం పరిశ్రమలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. అయినా సరే.. అందరికీ హైదరాబాద్ ఉందనే భరోసా ఉంది. డిగ్రీ అయిపోగానే.. హైదరాబాద్ బస్సో... రైలో ఎక్కేస్తే.. అక్కడ...

మద్యం ధరలు తగ్గించబోతున్న ఏపీ సర్కార్..?

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం విధానం దారుణంగా విఫలమయిందని ప్రభుత్వమే అంగీకరించే పరిస్థితి ఏర్పడింది. రేపో మాపో.. ప్రస్తుతం ఉన్న ధరలను 40 శాతం వరకూ తగ్గించే నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ మద్య...

HOT NEWS

[X] Close
[X] Close