ప్రసాదాలు, విగ్రహాలతో కేంద్రం నుంచి నిధులు రాలతాయా..!?

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి …కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. జీతాలు ఇవ్వడానికి ఎనిమిదో తేదీ వరకూ ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చిన సందర్భంలో .. తక్షణం రాష్ట్రానికి కొంత ఆర్థిక సాయం అవసరం అని గుర్తించి హుటాహుటిన అయన ప్రత్యేక బృందంతో ఢిల్లీకి వెళ్లారు. ఆర్థిక మంత్రిని ప్రసన్నం చేసుకునేందుకు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి… ప్రత్యేక పంథా ఎంచుకుంటున్నారు. ఎప్పుడూ లేని విధంగా పెద్ద బుట్ట తీసుకెళ్లి.. అందులో శ్రీవారి విగ్రహం.. ప్రసాదాలు.. ఇతర శ్రీవారి పవిత్రమైన వస్తువులు ఉంచారు. ఎప్పుడూ లేని విధంగా.. అనేక వస్తువులు.. ఆ బుట్టలో ఉండటంతో.. నిర్మలా సీతారామన్ కూడా.. వాటిని ఆసక్తిగా చూడటం.. మీడియాకు విడుదల చేసిన ఫోటోల్లో కనిపించింది. ఆ మాత్రం బుట్టకే కేంద్ర ఆర్థిక మంత్రి బుట్టలో పడిపోయి.. నిధులు ఇచ్చేస్తారా అన్న చర్చ ఢిల్లీలో ప్రారంభమయింది.

ఏపీ ప్రభుత్వానికి ఆర్థిక ప్రణాళిక లోపించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదాయంతో సంబందం లేకుండా.. ఎక్కడ అవకాశం ఉంటే.. అక్కడ అప్పులు సేకరించి.. పథకాల పేరుతో పంపిణీ చేస్తున్నారు. ఆదాయం పెంచుకునే మార్గాలపై దృష్టి పెట్టడం లేదు. అదే సమయంలో… తీసుకుంటున్న అప్పులకు సంబంధించి… చెల్లించాల్సిన వాయిదాల మొత్తం కూడా అంతకంతకూ పెరిగిపోతోంది. ఎఫ్‌ఆర్బీఎం పరిమితి పెంచడంతో… ఎలా చెల్లించాలన్న ఆలోచన కూడా లేకుండా ప్రభుత్వం… ఆ ఆప్పును వరుసగా తీసుకుంటోంది. రాష్ట్ర విభజన నాటితో పోలిస్తే.. ఇప్పుడు లోటు మరింత పెరిగినట్లుగా ప్రచారం జరుగుతోంది. నెలాఖరుకు అప్పులు తీసుకోకపోతే.. జీతాలు సైతం ఇవ్వలేని పరిస్థితి ఏర్పడినట్లు.. ఈ నెల తేలిపోయింది. దీంతో.. తక్షణం ప్రభుత్వం నడవడానికి ఎంతో కొంత సాయం కావాల్సిన పరిస్థితి ఉంది.

నిజానికి ఏపీకి.. నెల వారీగా కేంద్రం నుంచి దండిగా నిధులు అందుతున్నాయి. లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రంగా.. ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు.. పన్నుల వాటా కాకుండా.. నెలకు రూ. ఐదు వందల కోట్లు వస్తున్నాయి. అలాగే స్థానిక సంస్థల కోసం… ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన నిధులు వస్తున్నాయి. కోవిడ్ నియంత్రమ కోసం.. కేంద్రం ఇస్తున్న నిధులూ వస్తున్నాయి. పొరుగు రాష్ట్రం తెలంగాణకు.. ఏపీకి వస్తున్న నిధుల్లో.. 30 శాతం కూడా రావడం లేదు. అయినప్పటికీ.. ఏపీ సర్కార్ అనుత్పాదక వ్యయం ఎక్కువ చేస్తూండటంతో.. ఆర్థిక సమస్యలు వస్తున్నాయి. వీటన్నింటినీ… ప్రసాదం బుట్టతో అధిగమించాలని.. బుగ్గన ప్రయత్నిస్తున్నారనే సెటైర్లు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం అవసరం  : రామ్మాధవ్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉందని..  దాన్ని భర్తీ చేయాలని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి రామ్‌మాధవ్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోము వీర్రాజు.. ఏపీ  బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు...

చిరు మాస్టర్ ప్లాన్

ఆచార్య త‌ర‌వాత‌.. భారీ లైన‌ప్ అట్టి పెట్టుకున్నాడు చిరంజీవి. ఓ వైపు బాబీకి ఓకే చెప్పిన చిరు, మ‌రోవైపు మెహ‌ర్ ర‌మేష్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఇంకోవైపు వినాయ‌క్ తో సినిమా చేయ‌డానికి...

అఖిల్ – సురేంద‌ర్ రెడ్డి ఫిక్స్

`సైరా` త‌ర‌వాత సురేంద‌ర్ రెడ్డి ప్రాజెక్టు ఎవ‌రితో అన్న విష‌యంలో గంద‌ర‌గోళం నెల‌కొంది. అగ్ర హీరోలంతా బిజీ బిజీగా ఉండ‌డంతో.. సురేంద‌ర్ రెడ్డికి అనుకోని విరామం తీసుకోవాల్సివ‌చ్చింది. కొంత‌మంది కోసం క‌థ‌లు సిద్ధం...

సచివాలయం గాయబ్..!

దశాబ్దాల పాటు ఉమ్మడి రాష్ట్ర పాలనా కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌ హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న భవనాలు నేలమట్టం అయ్యాయి. మొత్తం పదకొండు భవనాలను నామరూపాల్లేకుండా తొలగించేశారు. శరవేగంగా ఇరవై ఐదు...

HOT NEWS

[X] Close
[X] Close