అడుసు తొక్కనేల కాలు కడుగనేలయా అమీర్ ఖాన్

కాంగ్రెస్ పార్టీ కనిపెట్టిన ‘మత అసహనం’ అనే మాట భలే క్లిక్ అయిందనే చెప్పాలి. అదేదో భగవన్నామస్మరణ అన్నట్లు ఇప్పుడు దేశంలో అన్ని మతాలు, ప్రాంతాలవారు, మేధావులు,కళాకారులు, పామరులు అందరూ నిత్యం జపిస్తున్నారు. దానిని కనిపెట్టి జనల మీదకు వదిలిన కాంగ్రెస్ పార్టీ దాని వలన రాజకీయంగా చాలా ప్రయోజనం పొందుతుంటే, దానిని పట్టుకొని వ్రేలాడుతున్న అమీర్ ఖాన్ వంటి కొందరు మేధావులు ఎదురుదెబ్బలు తింటున్నారు. నలుగురితో నారాయణ అన్నట్లుగా అయన కూడా దేశంలో మత అసహనం పెరిగిపోయిందని, దేశం విడిచిపెట్టి వెళ్ళిపోదామా? అని తన భార్య అడిగిందని చెప్పుకొని విమర్శలు మూటగట్టుకొన్నారు. నిజానికి అమీర్ ఖాన్ దేశభక్తిని శంఖించడానికి లేదు. ఆ విషయం ఆయన తీస్తున్న సినిమాలను చూస్తే అర్ధమవుతుంది. అయితే మనిషన్నాక ఎప్పుడో ఒకప్పుడు నోరు జారకుండా ఉండడు. అందుకు ఎదురుదెబ్బలు తినకుండా ఉండడు. అమీర్ ఖాన్ కూడా అలాగే మత అసహనం గురించి తనకు తోచినది మాట్లాడి చిక్కులో పడ్డారని భావించవచ్చును. అందుకు ఆయన సంజాయిషీలు ఇచ్చుకొన్నారు కూడా. కనుక ఈ విషయం ఇంతటితో వదిలిపెట్టడమే మంచిది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దేశంలో ఎన్నికల సందడి..! ఉపఎన్నికల తేదీల కోసం వెయిటింగే..!

నాగార్జున సాగర్, తిరుపతి ఉపఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయలేదు. ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇస్తామని సునీల్ అరోరా ప్రకటించారు. ఉపఎన్నిలకు షెడ్యూల్ ప్రకటించకపోయినా... మొత్తంగా ఎనిమిది విడతలుగా జరగనున్న ఎన్నికల్లో...

ఎస్ఈసీ పిలిచారు..! ఇప్పుడు విపక్షాలొస్తాయా..?

మున్సిపల్ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ కోసం న్యాయపోరాటం చేసిన విపక్షాలకు ఎదురుదెబ్బ తగిలిగింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్లన్నింటినీ హైకోర్టు తోసి పుచ్చింది. ఎస్ఈసీ నోటిఫికేషన్‌ ప్రకారమే మున్సిపల్‌ ఎన్నికలని హైకోర్టు తేల్చేసింది....

ఎవరికీ తెలియని కేసీఆర్ సీక్రెట్ బండి సంజయ్‌కు దొరికిందట..!

బండి సంజయ్ కేసీఆర్‌ను ఉత్కంఠలో ముంచెత్తాలనుకుంటున్నారు. అదీ కూడా భయంతో వచ్చే ఉత్కంఠను ఆయనకు కల్పించాలని అనుకుంటున్నట్లుగా ఉన్నారు. గ్రేటర్ ఎన్నికల వరకూ కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని నమ్మకంగా చెప్పేవారు....

శ్రీవారికి రూ. 10 కోట్ల విరాళం ఇచ్చింది పోస్కో కాదు.. పాస్కో..!

శ్రీవారికి పోస్కో గ్రూప్ భారీ విరాళం ఇచ్చిందంటూ కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాతోపాటు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఏపీలో స్టీల్ ప్లాంట్ అంశంలో పోస్కో గ్రూప్ గురించి విస్తృతంగా ప్రచారం...

HOT NEWS

[X] Close
[X] Close