రిస్కుకి రెడీ అయిన బ‌న్నీ వాస్‌!

ఆగ‌స్టు 15న బాక్సాఫీసు ద‌గ్గ‌ర భీక‌ర‌మైన పోటీ ఉంది. ఓ వైపు డ‌బుల్ ఇస్మార్ట్, మ‌రోవైపు మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ విడుద‌ల‌కు రెడీ అయ్యాయి. వాటితో పాటు త‌మిళం నుంచి ‘తంగ‌లాన్‌’ వ‌స్తోంది. మూడూ పెద్ద సినిమాలే. వీటి మ‌ధ్య ‘ఆయ్‌’ కూడా 15నే వ‌స్తున్నామంటూ ప్ర‌క‌టించుకొంది. బ‌న్నీ వాసు నిర్మాణంలో తెర‌కెక్కిన సినిమా ఆయ్‌. హీరోకి ఒక‌ట్రెండు సినిమాల అనుభ‌వం ఉందంతే. హీరోయిన్ కొత్త‌. ద‌ర్శ‌కుడికీ అంతే. ఓర‌కంగా పెద్ద నిర్మాత నుంచి వ‌స్తున్న చిన్న సినిమా ఇది. 15న ఉన్న విప‌రీత‌మైన కాంపిటీష‌న్ దృష్ట్యా ఈ సినిమాని వాయిదా వేస్తారనుకొన్నారంతా. కానీ ‘ఆయ్‌’ పోటీ నుంచి వెనుక‌డుగు వేయ‌ట్లేదు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ 15నే వ‌ద్దామ‌ని ఫిక్స‌యిపోయింది. అందుకే ప్ర‌మోష‌న్లు కూడా మొద‌లెట్టేశారు. మీడియా ఇంట‌ర్వ్యూలు కూడా శ‌నివారం నుంచే మొద‌లైపోయాయి.

గీతా ఆర్ట్స్ చేతిలో కొన్ని థియేట‌ర్లు ఉన్నాయి. కాబ‌ట్టి ఎంత పోటీ ఉన్నా ‘ఆయ్‌’కంటూ కొన్ని థియేట‌ర్లు ఉంటాయి. అన్నింటికంటే ముఖ్యంగా ‘ఆయ్‌’ ఓ స‌ర‌దా సినిమా. గోదావ‌రి ప‌ల్లెటూరు, ఆ విజువ‌ల్స్‌, మంచి పాట‌లూ, కామెడీ ఇవ‌న్నీ మిక్స్ చేసిన మిక్చ‌ర్ పొట్లాం. కాబ‌ట్టి ఆయ్‌ ఈ సినిమాల మధ్య ప్ర‌త్యేకంగా నిల‌బ‌డే ఛాన్సుంది. కానీ ఎంత చెప్పుకొన్నా.. మాస్ ఆడియ‌న్ అనేవాడు ‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌’, ‘డ‌బుల్ ఇస్మార్ట్’ వైపే చూస్తుంటాడు. ఆ త‌ర‌వాతే ‘ఆయ్‌’ వ‌ర‌కూ వ‌స్తాడు. మ‌ధ్య‌లో విక్ర‌మ్ సినిమా ‘తంగలాన్‌’ ఉంది. సిరియ‌స్ సినీ గోయ‌ర్స్ ‘తంగ‌లాన్’ వైపు ప్ర‌త్యేక‌మైన దృష్టి పెట్టే అవ‌కాశం ఉంది. అయిన‌ప్పటికీ బ‌న్నీ వాస్ ఈ విష‌యంలో రిస్క్ చేయ‌డానికే సిద్ధ ప‌డ్డాడు. చూడాలి మ‌రి ఏం అవుతుందో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close