ముంబైలో అభిరామ్ శిక్ష‌ణ‌

డి.సురేష్ బాబు త‌న‌యుడు ద‌గ్గుబాటి అభిరామ్ తెరంగేట్రంపై చాలా రోజుల నుంచీ వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. అయితే ఏదీ ఓ ప‌ట్టాన తేల‌డం లేదు. అయితే ఎట్ట‌కేల‌కు అభిరామ్ హీరోగా ఎంట్రీకి రంగం సిద్ధ‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం అభిరామ్ ముంబైలో ఉన్నాడు. అక్క‌డ న‌ట‌న‌కు సంబంధించి శిక్ష‌ణ తీసుకుంటున్నాడు. రానాకి ముంబైలో మంచి స‌ర్కిల్ ఉంది. వాళ్ల ఆధ్వ‌ర్యంలోనే అభిరామ్ కి ముంబైలో వివిధ అంశాల‌లో శిక్ష‌ణ ఇప్పిస్తున్నార్ట‌. త‌న బాడీ షేప్‌పై కూడా దృష్టి పెట్టిన అభిరామ్‌.. జిమ్‌లో గంట‌ల త‌ర‌బ‌డి చ‌మ‌టోడుస్తున్న‌ట్టు టాక్‌. ఓ యువ ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ‌ని ఇది వ‌ర‌కే సురేష్ బాబు లాక్ చేసేశాడు. ముంబై నుంచి అభిరామ్ తిరిగొచ్చాక‌… ఇక్క‌డ ఆ సినిమాకి సంబంధించిన వ‌ర్క్‌షాప్ నిర్వ‌హిస్తారు. మ‌రోవైపు ఇత‌ర న‌టీన‌టులు సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువడే అవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close