ఆర్కే పలుకు : వైసీపీ నేతలు జుట్టుకు రంగు ఎందుకు వేసుకోవడం లేదు ?

వైసీపీ నేతలు ఇటీవల వర్జినల్ లుక్‌తో కనిపిస్తున్నారు. ప్రవర్తన ఏది వర్జినలో.. ఏది నటనో చెప్పడం సాధ్యం కాదు కానీ.. బయట కనిపించే లుక్ మాత్రం వర్జినల్ లుక్‌లో కనిపిస్తున్నారు. అంటే జుట్టుకు రంగేసుకోవడం లేదు. అంబటి రాంబాబును అసలు గుర్తు పట్టడం కష్టం. ఆయన పూర్తిగా తెల్లజుట్టు, తెల్ల మీసంతో కనిపిస్తున్నారు. మల్లాది విష్ణు కూడా అంతే. గతంలో ఎప్పుడూ అలా కనిపించలేదు. మరి ఎందుకు ఇలా ఉంటున్నారు అనేది చాలా మందికి వస్తున్న సందేహం. దీనికి ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తన వారాంతపు ఆర్టికల్ కొత్త పలుకులో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అదేమిటంటే.. జగన్‌కు నలుపు అంటే ఇష్టం లేదట. అలా రంగేసుకుని ఆయనకు కనిపిస్తే కోపం వస్తుందన్న భయంతో వారు రంగేసుకోవడం మానేసారని అంటున్నారు.

ఇటీవల జగన్ సభలకు నలుపు దుస్తులతో వచ్చే వారిని రానివ్వడం లేదు. చున్నీలను కూడా తీసి వేయించి ఆ తర్వాత సభలోకి అనుమతి ఇస్తున్నారు. … చాలా చేశారు..ఇది కూడా ఓ విచిత్రమేనా అన్నట్లుగా అందరూ లైట్ తీసుకున్నారు. కానీ.. ఆ చున్నీలకు.. వైసీపీ నేతల జుట్టు రంగుకు ముడి పెట్టారు ఆర్కే. అయితే ఇది కాదని కూడా చెప్పలేం.. వైసీపీ అధినేత వ్యవహారశైలి ఎలా ఉంటుందో ఆ పార్టీ నేతలు.. ముఖ్యంగా ఆయనతో దగ్గరగా ఉండే వారందరికీ తెలుసు.

ఈ వారం ఆర్టికల్‌లో ఆర్కే.. జగన్మోహన్ రెడ్డి గురించి కొత్తగా ఏమీ చెప్పలేదు కానీ.. ప్రభుత్వంపై అసంతృప్తి పెరిగిపోతోందని… గ్రామాల్లోనూ ప్రజలు ఈసడించుకుంటున్నారన్న అభిప్రాయాన్ని బలంగా వ్యాపింపచేసేందుకు ప్రయత్నించారు. వైసీపీ నాయకులే అంటున్నారంటూ.. తాను చెప్పాలనుకున్నదంతా చెప్పేశారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి తన బాధ్యతగా చెప్పుకున్న బటన్ నొక్కడాన్ని బాద్యతగానే చేస్తున్నారని ఆర్కే అంగీకరించారు. క్రమం తప్పకుండా డబ్బులు వారి అకౌంట్లలో పడుతున్నాయన్నారు. అయితే ప్రజల అసంతృప్తి ఎందుకు బయటపడలేదంటే ఆయన టీడీపీ హయాం నాటి లాజిక్‌ను వివరించారు. బయట మాట్లాడటం లేదంటే.. అసంతృప్తి లేదని కాదని చెబుతున్నారు.

తెలంగామ రాజకీయాల్నీ ఆర్కే విశ్లేషించారు. ఈ సారి కేసీఆర్‌కు సుద్దులు చెప్పే ప్రయత్నం చేయలేదు కానీ..ఆయన ఐటీ, సీబీఐ, ఈడీ అధికారులపై ఏసీబీ తో దాడులు చేయించి.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు పెట్టబోతున్నట్లుగా హింట్ ఇచ్చారు. నిజానికి అలా పెట్టవచ్చా అనేది చెప్పడం కష్టమే. ఎందుకంటే కేంద్ర ఉద్యోగులు..సీబీఐ పరిధిలో ఉంటారు.. రాష్ట్ర పరిధిలో ఉండరు. కానీ రాజకీయ కక్థ సాధింపుల్లో ఏదైనాసాధ్యమేనని ఆర్కే మాటలు నిరూపిస్తాయేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close