బాబాకు బట్టల్లేని మహిళలూ అందంగా కనిపిస్తారట!

బాబా రాందేవ్ గురించి చాలా వివాదాలు ఉన్నాయి కానీ.. ఆయన మహిళల గురించి అనుచితంగా మాట్లాడుతూ వివాదాస్పదం అయిన సందర్భాలు తక్కువ. కానీ ఈ సారి మాత్రం ఆయన చాలా దారుణమైన వ్యాఖ్యలు చేసి మీడియాలో హైలెట్ అవుతున్నారు. ఆయనపై తీవ్రమైన నిరసన వ్యక్తమవుతోంది. మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మహారాష్ట్రలోని ఠానే నగరంలో పతంజలి యోగా పీఠ్‌ ఆధ్వర్యంలో యోగా శిబిరం ఏర్పాటు చేశారు. యోగాకు అందరూ వివిధ రకాల డ్రెస్సుల్లో హాజరయ్యారు.

ఈ సందర్భంగానే ఆయన వారి డ్రెస్సింగ్‌పై వివాదాస్పద వ్యాక్యలు చేశారు. ‘మహిళలు చీరల్లో బాగుంటారు. సల్వార్‌ సూట్స్‌లోనూ బాగుంటారు. నా కంటికైతే వారేం ధరించకపోయినా అందంగానే ఉంటారు” అని మహారాష్ట్రలోని ఓ యోగా శిబిరంలో ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఆయన అలా అన్న కార్యక్రమం స్టేజి మీద మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ భార్య అమృతా ఫడణవీస్‌ కూడా ఉన్నారు. ఆమె ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు.

రామ్‌దేవ్‌ బాబా వ్యాఖ్యలపై బీజేపీ నేతలు సైలెంట్‌గా ఉన్నా.. ఇతర పార్టీలు ఊరుకుంటాయా… ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా రామ్‌దేవ్‌ బాబా తన అసలు మనస్తత్వం బయటపెట్టారంటూ మండిపడుతున్నారు. మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలతో వారిని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. బాబా రాందేవ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close