ఆర్కే పలుకు : వచ్చే ఎన్నికలు జగన్ వర్సెస్ ప్రజలు !

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ వారం ఆంధ్రప్రదేశ్ లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వారిని గంగిరెద్దులతో పోల్చారు. ఇంకా చెప్పాలంటే పోలిక కోసమే కానీ ఆ గంగిరెద్దులు ఎంతో గౌరవనీయమన్నారు. సివిల్ సర్వీస్ అధికారులపై ఆర్కేకు ఇంత కోపం రావడానికి కారణం… నిబంధనలు పాటించకుండా… పార్టీ కార్యక్రమాల్లో అధికారులు పాల్గొనడం. ప్రభుత్వ కార్యాలయాల్లో వైసీపీ జెండాలు ఎగురవేయడం వంటి పనులు చేయడమే కాకుండా నేరుగా ఎన్నికల అధికారిని కూడా మద్యం కేసులో ఇరికిస్తామని బెదిరించి ఓటర్ల జాబితాలో అవకతవకలు సరి చేయకుండా చూసుకుంటున్నారు., పెద్ద ఎత్తున అనుకున్నట్లుగా దొంగ ఓట్లు చేరుస్తున్నారు. ఇదంతా తెలిసి ఆర్కేకు కోపం వచ్చింది.

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిస్థితుల్ని చూసి న్యాయవ్యవస్థ కూడా నిస్సహాయంగా ఉండిపోయింది.. చట్టం రాజ్యాంగం ఏమీ లేదని ఆయన ఫీలయ్యారు. నిజానికి ఇది నాలుగున్నరేళ్లుగా సాగుతోంది. కానీ ఏపీలో ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ప్రభుత్వం చెప్పినట్లుగా చేయడం లేదు. 90 శాతం మంది నిబంధనల ప్రకారమే పని చేస్తున్నారు. కానీ తమ అడుగులకు మడుగులు ఒత్తే అధికారుల్ని మాత్రమే తమకు కావాల్సిన చోట పెట్టుకుని పని నడిపించేస్తున్నారు ఏపీ పెద్దలు. మిగిలిన వారు నోరు తెరవలేకపోతున్నారు. దానికి సీఐడీ అనే ఓ మాఫియాను తయారు చేశారు., ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే.. ఆధారాలతో పని లేదు.. ఏదో ఓ కేసు పెట్టి బొక్కలో వేస్తారు. పరువు తీస్తారు. కోర్టుల్లో ఎప్పటికో ఊరట లభిస్తుంది. తప్పు చేయకుండానే శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఈ బాధ ఎందుకని వారంతా సైలెంట్ గా ఉంటున్నారు. కానీ బరి తెగించిన వారికి తెడ్డే లింగం అన్నట్లుగా కొంత మంది అధికారులు మాఫియా రూల్ లో భాగం అయి…. తోటి అధికారుల్నే బెదిరిస్తున్నారు.

ఎన్నికల అధికారిని సీఐడీ కేసులో ఇరికిస్తామని బెదిరించడం చిన్న విషయం కాదు. చంద్రబాబుపై ఇటీవల మద్యం కేసును పెట్టారు. ఆ ఎక్సైజ్ శాఖలో గతంలో … ప్రస్తుత సీఈవో మీనా పని చేశారు. మద్యం కేసులోనే ఎలాంటి ఆధారాలు లేవు అంటే ఆయననూ ఇరికిస్తామని చెప్పి బెదిరింపులకు దిగారు. చివరికి ఆయన ఓటర్ల జాబితాలో అవకతవకలపై మిన్నకుండిపోతున్నారు. ఇటీవల కొంత మందిపై చర్యలు తీసుకున్నా తర్వాత సైలెంట్ అయిపోయారు. ఇలాంటి పరిస్థితుల నడుమ ఏపీకి జగన్ రెడ్డి అవసరమా ? మరోసారి జగన్ రెడ్డి సీఎం అయితే ప్రజల బతుకులు.. ఏపీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే. అందుకే వచ్చే ఎన్నికల్లో ప్రజలు గెలవాలని ఆర్కే చెప్పుకొచ్చారు.

వచ్చే ఎన్నికల్లో ప్రజలు వర్సెస్ జగన్ అన్నట్లుగా ఎన్నికలు జరగబోతున్నాయి. దీన్నే ఆర్కే విశ్లేషించారు. పోలీసులు, రౌడీలు, దొంగ ఓటర్లు వంటి ఆయుధాలతో జగన్ రెడ్డి ఎన్నికలయుద్ధం చేయబోతున్నారు. దాన్ని ఎదుర్కొని ప్రజలు… తమ రాష్ట్రాన్ని గెలిపించుకుంటే సరే.. లేకపోతే ఇక రాష్ట్రాన్ని మర్చిపోవచ్చని ఆర్కే చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గెలిపించకపోతే చచ్చిపోతా : బీఆర్ఎస్ అభ్యర్థి

ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులు చివరి ప్రయత్నంగా ఆత్మహత్య చేసుకుంటామని ఓటర్లను బెదిరిస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ పై పోటీ చేస్తున్న కౌశిక్ రెడ్డి చివరి ప్రయత్నంగా ఓటర్లను బెదిరించడం...

యానిమ‌ల్ మిషన్ గ‌న్ @ రూ.50 ల‌క్ష‌లు

ఈమ‌ధ్య యాక్ష‌న్ సినిమాల్లో పెద్ద పెద్ద మిష‌న్ గ‌న్‌ల‌తో హీరోలు శ‌త్రు శంహారానికి పూనుకొంటున్న సీన్లు చూస్తూనే ఉన్నాం. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, ఖైదీ, విక్ర‌మ్, మార్క్ ఆంటోనీ చిత్రాల్లో హీరోలు...
video

క‌థంతా దాచేసి.. ట్రైల‌ర్ క‌ట్ చేశారు!

https://www.youtube.com/watch?v=GnO4cOx_wFQ నితిన్ - వ‌క్కంతం వంశీ సినిమా `ఎక్ట్రా ఆర్డిన‌రీ మెన్‌` ట్రైల‌ర్ వ‌చ్చింది. ట్రైల‌ర్ అంతా స‌ర‌దా స‌ర‌దాగా సాగిపోయింది. నితిన్ లుక్ క్లాస్ గా ఉన్నా, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివ‌రీ...

కొత్త కొత్త హామీలతో బీఆర్ఎస్ ప్రయత్నాలు

బీఆర్ఎస్ ప్రజల్ని ఆకట్టుకునేందుకు మేనిఫెస్టోలో లేని హామీలు ఇస్తోంది. వివిధ వర్గాలతో సమావేశమై.. వారికి హామీలు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్యాసింజర్ ఆటోలకు పర్మిట్ ఫీజు మాఫీ అని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close