గోరంట్ల మాధవ్ పై రూ. పది కోట్ల పరువు నష్టం దావా వేయాలని ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్ణయించుకున్నారు. ముందుగా క్షమాపణ చెప్పాలని ఆయన నోటీసు పంపనున్నారు. గడువులోపు స్పందన రాకోపతే పది కోట్లకు దావా వేయనున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన న్యూడ్ వీడియో వ్యవహారంలో ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను ఎంపీ గోరంట్ మాధవ్ బూతులు తిట్టాడు. సభ్య సమాజం తలదించుకునేలా మాధవ్ మాటలు ఉన్నాయి. దీంతో ఆయనను ఉపేక్షించకూడదని ఆర్కే నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.
ఇప్పటికే ఆ వీడియో ఫేక్ అంటూ కొంత మంది టీడీపీ నేతలపై గోరంట్ల మాదవ్ ఆరోపణలు చేశారు. ఆయన చింతకాయల విజయ్ పేరు చెప్పడంతో రూ. యాభై లక్షల పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఆర్కే కూడా ఈ జాబితాలో చేరుతున్నారు. ఆ వీడియో ఎంపీ మాధవ్‌ది కాదని ఎవరూ అనుకోవడం లేదు. అందరూ నమ్ముతున్నారు. అియతే అలాంటి వీడియోను కూడా తప్పు అని పోలీసులతో చెప్పించి.. మాధవ్‌ను వెనకేసుకు రావడం.. ఆయన మరింత దారుణంగా బూతులతో రెచ్చిపోవడంపై ఎలా స్పందించాలో కూడా అర్థం కాని పరిస్థితికి ప్రజలు వెళ్లిపోతున్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి బూతులే అస్త్రంగా బతికేస్తోంది. ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపై బూతులతో విరుచుకుపడుతున్నారు. మానసికంగా బలహీనంగా ఉన్న వారు కుంగిపోతున్నారు. మిగిలిన వారు తిరిగి తిడుతున్నారు. తమను తిట్టిన వారిపై కేసులు పెడుతున్నారు.. కానీ తాము మాత్రం దారుణంగా తిట్టించడానికి వెనుకాడటం లేదు. ఇప్పుడు న్యాయస్థానాలకు ఆ తిట్ల వ్యవహారం చేరబోతోంది.