కొత్తపలుకు : ఆధునిక గడీలో.. పాతకాలం దొర కేసీఆర్..!

ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరక్టర్ వేమూరి రాధాకృష్ణ.. ఈ వారి.. తెలంగాణ సీఎం కేసీఆర్ పై … ఘాటు మాటలతో కాకుండా… సున్నితమైన అంశాలతో పోల్చుతూ.. ఆయనపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. గడీల పాలన చేస్తూ.. ప్రజల్ని బానిసలుగా చూస్తున్నారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ రోజుల్లో గడీల పాలన ఉన్న పల్లెల్లో “బాంచన్ దొర.. కాల్మొక్తా” అన్నవారికే బతికే అవకాశం ఉండేదని.. ఇప్పుడు ఆ పరిస్థితి.. తెలంగాణ ప్రజలకు వచ్చిందంన్నారు. దొరలు తమను ధిక్కరించేవారికి ఉపాధి లేకుండా చేసి.. దారికి తెచ్చుకునేవారట. అచ్చంగా.. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరించిన వైఖరి కూడా నాటి దొరల కాలంనాటి పరిస్థితిని గుర్తుకు తెచ్చిందని.. ఆర్కే తేల్చేశారు.

ఉద్యోగాలు దక్కాయి చాలనుకున్న కార్మికులు.. 52 రోజుల కష్టాలను మర్చిపోయి.. కేసీఆర్ జిందాబాద్ అన్నారని.. ఆర్కే గుర్తు చేసి.. కేసీఆర్ రాజకీయ నాయకుడిగా సక్సెస్ అయినట్లేనని తేల్చారు. ఆర్టీసీ సమ్మెపై కఠిన వైఖరితో ఒకే దెబ్బకు ఎన్నో పిట్టలను కేసీఆర్ కొట్టారు. ఇక తెలంగాణలో “అడుక్కోవాలే గానీ డిమాండ్ చేయకూడదు” అని తెలంగాణ సమాజానికి కేసీఆర్ స్పష్టం చేశారని ఆర్కే విశ్లేషించారు. గిట్టని వారు కేసీఆర్‌ను నియంత అనవచ్చు కానీ.. అనేక విషయాల్లో.. తానే రైట్ అనిపించుకున్నారని.. జై కేసీఆర్ అని నినదిస్తే హాయిగా బతకవచ్చని.. ఆర్కే ప్రకటించి.. తాను.. .. కేసీఆర్ గ్రేట్ అని ఒప్పుకున్నారు.

జగన్మోహన్ రెడ్డి ఆరు నెలల పాలనపై.. విశ్లేషణకు ఆర్కే ద్వితీయ ప్రాధాన్యమే ఇచ్చారు. ఆ రాష్ట్రంలో మంత్రులు చేస్తున్న ప్రకటనలు.. పెట్టుబడిదారులు వెళ్లిపోవడం వంటి అంశాలు, ఆర్థిక పరిస్థితిపై విశ్లేషించారు. ఏపీకి భవిష్యత్ లేదనే అభిప్రాయాన్ని ఆర్కే అంతర్లీనంగా.. తన ఆర్టికల్‌లో వెల్లడించారు. అమరావతిపై అడ్డగోలు ప్రకటనలు చేసి.. పొరుగు రాష్ట్రాల ముందు చులకన అవుతున్నామన్న విషయం ప్రభుత్వం.. మంత్రులు మర్చిపోతుందని… ఆర్కే గుర్తు చేశారు. తాము ఇలా చేయడం వల్ల మాజీ ముఖ్యమంత్రిని హింసిస్తున్నామని మంత్రులు మానసిక ఆనందం పొందుతున్నారని… కానీ అమరావతినో.. పెట్టుబడులను.. వెనక్కి పంపేస్తే నష్టం జరిగేది రాష్ట్ర ప్రజలకేనని.. ఆర్కే గుర్తు చేసారు. చంద్రబాబుపై జరిగిన దాడిని.. సమర్థించిన డీజీపీపై.. ఆర్కే సెటైర్లు వేశారు. ” హత్య చేసినవాడు కూడా తనకు ఏదో నష్టంచేశాడన్న భావనతోనే ఎదుటివాడిని హతమారుస్తాడు. అప్పుడు కూడా నష్టం చేశానే హత్య చేసారు..? హంతకులపై కేసు పెట్టరా? ..అని సెటైర్ వేశారు. మొత్తానికి రాను.. రాను ఇక ఏపీ గురించి పెద్దగా ఆలోచించాల్సిన పరిస్థితి.. పరిగణనలోకి తీసుకోవాల్సిన రావడం రాదన్నట్లుగా.. ఆర్కే విశ్లేషణ ఉంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రమేష్ హాస్పిటల్ తరఫున హీరో రామ్ వకాల్తా, సోనూసూద్ ని చూసి నేర్చుకోమంటున్న నెటిజన్లు

హీరో రామ్ పోతినేని, "ఇది స్వాతంత్ర దినోత్సవమా లేక స్వర్ణా ప్యాలెస్ సంఘటనకు సంబంధించిన దినమా" అంటూ ప్రశ్నించడమే కాకుండా ఈ ఘటన విషయంలో ముఖ్యమంత్రి జగన్ ని అప్రతిష్టపాలు చేసే కుట్ర...

రాజ్యాంగం, చట్ట ప్రకారం నడుచుకుంటేనే అభివృద్ధి : జగన్

రాజ్యాంగం, చట్ట ప్రకారం నడుచుకుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వాతంత్య్ర దినోత్సవ సందేశం ఇచ్చారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి... ప్రసంగించారు. ఈ సందర్భంగా...
video

మ‌రో అవార్డు ఖాయ‌మా కీర్తి.??

https://youtu.be/rjBv3K5FMoU మ‌హాన‌టితో జాతీయ ఉత్త‌మ న‌టిగా అవార్డు అందుకుంది కీర్తి సురేష్. ఆ అవార్డుకి కీర్తి అర్హురాలు కూడా. అప్ప‌టి నుంచీ.. ప్రాధాన్య‌త ఉన్న పాత్ర‌ల‌నే ఎంచుకుంటోంది. అందులో భాగంగా కీర్తి న‌టించిన మ‌రో...

కోలుకుంటున్న బాలు

ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్‌.పి. బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఆరోగ్యం క్షీణించింద‌న్న వార్త‌లు రావ‌డంతో.. యావ‌త్ చిత్ర‌సీమ ఉలిక్కిప‌డింది. ఆయ‌న ఆరోగ్యం బాగుండాల‌ని, క్షేమంగా తిరిగిరావాల‌ని అభిమానులంతా ప్రార్థించారు. ఆ ప్రార్థ‌న‌లు ఫ‌లిస్తున్నాయి. బాలు ఆరోగ్యం క్ర‌మంగా...

HOT NEWS

[X] Close
[X] Close