జగన్ మార్క్ : ఏపీలో డిగ్రీ నాలుగేళ్లు..ఇంజినీరింగ్ ఐదేళ్లు..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. డిగ్రీని మరో ఏడాది పొడిగించారు. ఇంజినీరింగ్ చదువును కూడా మరో ఏడాది పొడిగించారు. ఇప్పుడు.. డిగ్రీ మూడేళ్లు చదవాల్సి ఉంటుంది. కానీ వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇది నాలుగేళ్లు అవుతుంది. ఇంజనీరింగ్ చదువు నాలుగేళ్లు అయితే.. వచ్చే ఏడాది నుంచి అది ఐదేళ్లకు మారుతుంది. ఇలా ఎందుకు అంటే… డిగ్రీలు, ఇంజినీరింగ్ చదువుతున్న వారందరికీ.. ఉద్యోగాలు రావడం లేదట.. అందుకే … వారందరికీ.. స్కిల్స్ నేర్పించేందుకు… ఏడాది సమయాన్ని కేటాయిస్తున్నారు. డిగ్రీ మూడేళ్లు, ఇంజినీరింగ్ నాలుగేళ్లు పూర్తయిన తర్వాత తప్పనిసరిగా ఒక ఏడాది అప్రెంటిస్ షిప్ చేయాలనే నిబంధనను ఉన్నత విద్యా మండలి తీసుకురానుంది.

డిగ్రీ, బీటెక్‌ పూర్తి చేసిన చాలా మందికి ఉద్యోగాలు రావట్లేదని డిగ్రీ, ఇంజినీరింగ్‌ చదువులను ఉపాధి, ఉద్యోగాలు కల్పించేలా తీర్చిదిద్దాలని జగన్ నిర్ణయించారు. నైపుణ్యాభివృద్ధి సంస్థతో కలిసి విద్యార్థులకు స్కిల్స్ మీద శిక్షణ ఇస్తారు. అప్రెంటిస్‌షిప్‌ చేసే ఏడాది సమయంలో విద్యార్థులకు ఫీజురీఎంబర్స్ మెంట్.. ఇతర పథకాలు పొందవచ్చు. ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన పథకం కింద కూడా ఏటా రూ.20వేలు కూడా ఇస్తారు. విద్యార్థుల్లో స్కిల్స్ పెంచాలనుకోవడం.. మంచి నిర్ణయమే కానీ.. దానికి ఏడాది సమయం కేటాయించడమే.. విద్యారంగ నిపుణుల్ని కూడా ఆశ్చర్య పరుస్తోంది.

మూడేళ్ల డిగ్రీ, ఇంజనీరింగ్ కోర్సుల్లో భాగంగానే లైఫ్ స్కిల్స్‌ను ఎందుకు పెట్టరన్న ప్రశ్న వస్తోంది. పరుగులు పెడుతున్న కాలంలో.. ఏడాది అత్యంత విలువైన సమయం. ఉద్యోగాలు పొందే వయసు కూడా.. క్రమం తగ్గుతూ వస్తోంది. పాతికేళ్లు దాటే సరికి.. ఉద్యోగాల్లో స్థిరపడాల్సినంత వేగం.. యువత కోరుకుంటోంది. ఈ సమయంలో… మరో ఏడాది.. లైఫ్ స్కిల్స్ పేరుతో… కాలేజీలోనే ఉంచడం.. యువతకు ఇష్టం ఉండకపోవచ్చంటున్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close