కొత్తపలుకు : అవినీతిని ప్రజలు పరిగణనలోకి తీసుకోవడం లేదంటున్న ఆర్కే..!

రాజకీయాల్లో అవినీతి కామన్ అయిపోయిందా..? రాజకీయాల్లో ఉంటే అవినీతికి పాల్పడకుండా ఉండరన్న నమ్మకం ప్రజల్లో ఏర్పడిపోయిందా..? అవినీతి చేసినా ప్రజలు పట్టించుకోకుండా.. ఆదరించే పరిస్థితి వచ్చిందా..?… అంటే.. అవుననే అంటున్నారు… ఆంధ్రజ్యోతి పత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణ. ఆయన వారం.. వారం రాసే కొత్త పలుకు ఆర్టికల్‌లో.. ఈ వారం.. ఈ రాజకీయాల్లో అవినీతి ఎలా రూపాంతరం చెందిందో వివరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. తన పార్టీతో పాటు.. తన పార్టీతో సన్నిహితంగా వారి జోలికి దర్యాప్తు సంస్థలు వెళ్లనీయరు. కానీ బీజేపీని వ్యతిరేకించిన వారిపై మాత్రం విరుచుకుపడుతున్నారు. అందుకే తాను తప్ప అంతా అవినీతిపరులే అన్న భావనలో మోడీ ఉన్నారనేది ఆర్కే విశ్లేషిస్తున్నారు.

ఆర్కే పత్రికాధిపతి కాక ముందు నుంచి జర్నలిస్టు. రాజకీయంగా ఎన్నో కీలక ఘట్టాలను చూసిన వ్యక్తి. అందుకే.. అవినీతి విషయంలో ఉదాహరణలను… ఎవరికీ తెలియనివి వివరించారు. అవినీతిని అడ్డుకున్నందుకు… ఎన్‌టీఆర్, బిజూ పట్నాయక్‌లకు గతంలో చేదు అనుభవాలు ఎదురయ్యాయట. ఎన్‌టీఆర్‌ రెండోసారి సీఎం అయ్యాక ఏసీబీ దాడులు, ఉద్యోగుల సమయపాలనపై కొత్తగా ఎన్నో నిబంధనలు పెట్టడంతో.. ఆయనపై… సచివాలయ ఉద్యోగులు దాడికి ప్రయత్నించారట. నాటి ఒడిశా సీఎం బిజూ పట్నాయక్‌కీ ఇదే అనుభవం ఎదురయిందట. ఆయనపై ఉద్యోగులు ఆయనపై భౌతికదాడికి పాల్పడ్డారని తన వ్యాసంలో ఆర్కే గుర్తు చేసారు. ఆయన చొక్కాలు కూడా చించేశారని.. అప్పటి నుంచి ఏ ముఖ్యమంత్రి కూడా.. ఉద్యోగుల జోలికి వెళ్లడంలేదని విశ్లేషించారు. ప్రజల్లోనూ.. అవినీతికి “సానుకూల ముద్ర” పడినట్లుగా ఆయన రాసుకొచ్చారు.

మోడీ వ్యవహారశైలిపై.. ఆయన కొన్ని… కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఓటుకు నోటు ఈడీ వరుసగా..విపక్ష నేతలనే టార్గెట్‌ చేస్తోంది. కర్ణాటకలో ఎమ్మెల్యేలకు యడ్యూరప్ప రూ.కోట్లు ఆఫర్‌ చేశారు. అది నిజమని యడ్యూరప్ప అంగీకరించినా కనీసం కేకూడా పెట్టలేదని.. ఆర్కే గుర్తు చేశారు. అవినీతి పరులనును ప్రజలు ఎన్నికల్లో ఆదరిస్తున్నారనే.. ఆవేదన ఆర్కే తన వ్యాసంలో వ్యక్తీకరించారు. స్థానిక పరిస్థితులు, కులమతాల ఆధారంగానే ఎన్నికలు జరుగుతున్నాయని… ఇప్పుడు మోదీ అవినీతి వ్యతిరేక నినాదం బీజేపీకి ఓట్లు తేవడం అసాధ్యమంటున్నారు. మోదీని చౌకీదారుగా ప్రజలు నమ్ముడంలేదని.. తేల్చి చెప్పేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీ సర్కార్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయనున్న నిమ్మగడ్డ..!

ప్రభుత్వం ఎంత పట్టుదలకు పోతోందో... నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా.. అంతే పట్టుదలగా న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. హైకోర్టు తీర్పు తర్వాత ఆయన తాను బాధ్యతలు చేపట్టినట్లుగా ప్రకటించారు. ఆ తర్వాత విజయవాడ...

పార్టీ మారడం లేదని తేల్చేసిన పర్చూరు ఎమ్మెల్యే..!

వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారని ప్రచారం జరిగిన పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఎట్టకేలకు స్పందించారు. తన నియోజకవర్గంలోని క్యాంప్ ఆఫీసులో కార్యకర్తలతో సమావేశం అయిన ఆయన.. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు....

జుంబారే… మ‌న‌వ‌డు వాడేశాడురోయ్

సూప‌ర్ హిట్ పాట‌ల్ని రీమిక్స్ చేసి వినిపించ‌డం మ‌న ఇండ‌స్ట్రీకి కొత్తేం కాదు. అయితే ఎక్కువ‌గా స్టార్ల వార‌సుల సినిమాల కోస‌మే ఆ ప్ర‌య‌త్నాలు జ‌రుగుతుంటాయి. సినిమాల ప్ర‌మోష‌న్‌కి ఆ...

బాలయ్య కోసం చిన్నికృష్ణ

నే‌టి ట్రెండ్‌ని... నేటి ప్రేక్ష‌కుల నాడిని ప‌ట్ట‌లేక కెప్టెన్ కుర్చీకి దూర‌మైన సీనియ‌ర్ ద‌ర్శ‌కులు చాలామందే. ఒక‌ప్పుడు అగ్ర ద‌ర్శ‌కులుగా వెలిగిన వాళ్లంతా కూడా ఆ త‌ర్వాత ప్రాభవాన్ని కోల్పోయారు....

HOT NEWS

[X] Close
[X] Close