ఆర్కే పలుకు: వివేకా హత్యలో జగన్ దంపతుల పాత్రపై సంచలన విషయాలు !

ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే వైఎస్ వివేకానందరెడ్డి విషయంలో నలుగురు సాక్ష్లుల గురించి బహిరంగంగా తన పత్రికలో కొత్తపలుకు ద్వారా సీబీఐకి సమాచారం ఇచ్చారు. సీఎం జగన్ దంపతులకు తెల్లవారుజామున నాలుగున్నరకే వివేకా హత్య గురించి తెలుసని.. ఆ విషయం తనతో సమావేశంలో ఉన్న నలుగురికి జగన్ చెప్పారని ఆర్కే చెబుతున్నారు. ఆ నలుగురు ఎవరంటే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, దువ్వూరి కృష్ణ, పీఏ కృష్ణమోహన్ రెడ్డి, మాజీ సీఎస్ అజేయ కల్లాం. ఈ నలుగురిని సీబీఐ విచారిస్తే.. అసలు గుట్టు బయటపడుతుందని.. ఆర్కే అంటున్నారు. ఇందులో కృష్ణమోహన్ రెడ్డిని ఇప్పటికే సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఎందుకంటే ఆయన ఫోన్‌కే అవినాష్ రెడ్డి ఫోన్ చేసి మాట్లాడారు. మిగతా ముగ్గురిని కూడా ప్రశ్నించాలని ఆర్కే అంటున్నారు.

నిజంగా జగన్మోహన్ రెడ్డి అలా చెప్పి ఉంటే.. ఆ నులుగురిలో ఒకరు ఆర్కేకి చెప్పి ఉండాలి. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు టీడీపీ నుంచి వచ్చారు. అజేయకల్లాం కూడా సర్వీస్‌లో ఉన్నప్పుడు చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగారు. దువ్వూరి కృష్ణ, కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరూ మొదటి నుంచి జగన్ తో నే ఉన్నారు. ఈ నలుగురిలో ఎవరు ఈ విషయం ఆర్కేకు లీక్ చేసి ఉంటారన్నది కూడా ఇప్పుడు జగన్ క్యాంప్‌కు టెన్షన్. ఈ నలుగుర్ని సీబీఐ ప్రశ్నిస్తుందా లేదా అన్నది తర్వాత విషయం. కానీ జగన్మోహన్ రెడ్డి దంపతుల పాత్ర వివేకాహత్యలో ఉందని బలంగా నమ్మించడంలో ఆర్కే గట్టి వాదనను తన కొత్త పలుకు ద్వారా వివరించారు.

వైఎస్ వివేకాహత్య కేసులో సాక్షి మీడియా చేస్తున్న సమాంతర దర్యాప్తునకు కౌంటర్‌గా ఆర్కే ఈ ఆర్టికల్ రాసినట్లుగా ఉంది. ఆయన సీబీఐ కంటే సంచలనాత్మక విషయాలు బయటపెడుతున్నారు. మొత్తంగా ఓ క్రమ పద్దతిలో చెప్పి ఫ్లాష్ బ్యాక్‌ను.. వివేకా హత్యకు దారి తీసిన పరిస్థితుల్ని విశ్లేషించి అసలేం జరిగిందో అర్థం చేసుకోమని ప్రజలకు చెబుతున్నారు. ఇందులో ప్రత్యేకంగా అర్థం చేుకోవడానికి .. ఆలోచించడానికి కూడా అవకాశం ఇవ్వనంత సులువుగా.. వివేకా హత్య వెనుక మాస్టర్ ప్లానర్లు జగన్, భారతినేనని ఆర్కే పరోక్షంగా చెప్పేస్తున్నారు.

సీబీఐ వాళ్ల దాకా వెళ్తుందో లేదో కానీ ఓ అదృశ్య శక్తి మాత్రం వారిని ఇప్పటి వరకూ కాపాడుతోందని ఆర్కే చెబుతున్నారు. ఆ అదృశ్య శక్తి ఎవరన్నది చెప్పలేదు కానీ.. మరో వైపు అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాకనే సాక్షిలో కథనాలు రాసుకుంటున్నారని కూడా చెప్పారు. మొత్తంగా.. వైఎస్ వివేకా హత్య కేసులో జగన్ పాత్ర చాలా అనుమానాస్పదంగా ఉందన్న విషయం ఆర్కే తన కొత్త పలుకు ద్వారా చాలా గట్టిగా బయట పెట్టారని అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్ : బాలకృష్ణ

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై సినీ పరిశ్రమ స్పందన తీరుపై చాలా విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు పాలనలో ఎంతో అభివృద్ధి సాధించిన సినీ పరిశ్రమ, అలాగే లబ్దిపొందిన చాలా...

జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్లేది నిజం – మోదీ, షాలతో భేటీ డౌట్ !

లండన్ లో ఉండి చంద్రబాబును అరెస్టు చేయించి ఇండియాకు రాక ముందే ఢిల్లీ పర్యటన పేరుతో ప్రచారం చేసుకుని మోడీ , షాలతో భేటీ అవుతారని ప్రచారం చేయించుకున్న జగన్ రెడ్డి తాపత్రయం...

చంద్రబాబుకు డబ్బు ముట్టినట్లు ఆధారాలున్నాయా ?: ఏసీబీ కోర్టు జడ్జి

చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్, అలాగే బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్లపై విచారణ ఏసీబీ కోర్టులో జరిగింది. ఉదయం చంద్రబాబు తరపు లాయర్ దూబే, మధ్యాహ్నం...

సుధీర్ బాబుకి ‘హంట్’ నేర్పిన గుణపాఠం

సుధీర్ బాబు 'హంట్' సినిమా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ అయ్యింది. కెరీర్ లో పలు ప్రయోగాలు చేసిన సుధీర్ బాబు.. హంట్ కూడా తనకు మరో ప్రయోగాత్మక చిత్రం అవుతుందని బలంగా నమ్మాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close