మరోసారి చంద్రబాబుతో పవన్ భేటీ !

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. టీడీపీ అధినేత చంద్రబాబుతో మరోసారి సమావేశం అయ్యారు. ఏపీలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు. పవన్ కల్యాణ్ చంద్రబాబును కలవడం ఇది మూడో సారి. ఓ సారి విజయవాడ హోటల్‌లో కలిశారు. అప్పుడు చంద్రబాబే పవన్ వద్దకు వెళ్లారు. తర్వాత పవన్ కల్యాణ్.. చంద్రబాబు ఇంటికి వచ్చారు. ఇప్పుడు మరోసారి వచ్చి సమావేశం అయ్యారు. పవన్ .. చంద్రబాబు ఇంటికి వచ్చే వరకూ ఈ విషయం ఎవరికీ తెలియదు.

ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రెండు పార్టీలు కలిసి పని చేసే అంశంపై వీరిద్దరూ చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. పవన్ కల్యాణ్ ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఆ తర్వాత ఏపీలో రాజకీయ మార్పులు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో వీరి భేటీ హాట్ టాపిక్‌గా మారింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమతోనే ఉన్నారని బీజేపీ నేతలు పదే పదే ప్రకటిస్తున్నారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం బీజేపీతోనే ఉన్నామని చెబుతున్నారు కానీ కలిసి పోటీ చేస్తామన్న విషయంపైనా క్లారిటీ ఇవ్వడం లేదు. కేంద్ర బీజేపీ నేతలతో మాట్లాడుతున్నారు కానీ రాష్ట్ర నేతలతో సంప్రదించడం లేదు.

బీజేపీ … జనసేనతో మాత్రమే కలిసి పోటీ చేస్తామని చెబుతోంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని ప్రకటిస్తున్నారు. వైసీపీ విముక్త ఏపీ కోసం ప్రయత్నిస్తున్నామని ఓట్లు చీలికను అంగీకరించబోమని అంటున్నారు. ఇలాంటి సమయంలో.. జనసేన, టీడీపీ మధ్య సంప్రదింపులు పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. రెండు పార్టీలు కలిసి పని చేయడం ఖాయమన్న అభిప్రాయం ఈ వరుస భేటీతో రాజకీయవర్గాల్లో ఏర్పడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

ఇంకా “బలమైన” భ్రమల్లోనే కేటీఆర్ !

కేటీఆర్ నియోజకవర్గాల వారీ సమీక్ష సమావేశాల్లో రేవంత్ రెడ్డిని తిట్టి... ఎన్నికల్లో దున్నిపారేస్తామని ప్రసంగించి వెళ్లిపోతున్నారు. గ్రౌండ్ లెవల్లో పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడం లేదు. కనీసం ...
video

ట్రైల‌ర్ టాక్‌: ఫ్యామిలీమెన్ టూ మెంట‌ల్ మెన్‌

https://www.youtube.com/watch?v=xB7b3RzicUU విజ‌య్ దేవ‌ర‌కొండ అంటే ఎగ్రెసివ్‌నెస్ గుర్తొస్తుంది. అర్జున్ రెడ్డి నుంచి అది అల‌వాటైపోయింది. అయితే... త‌న‌లో కూల్ & కామ్ పెర్‌ఫార్మ‌ర్ ఉన్నాడు. దాన్ని బ‌య‌ట‌కు లాగే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు ప‌ర‌శురామ్. 'ఫ్యామిలీస్టార్‌'...

HOT NEWS

css.php
[X] Close
[X] Close