ఏబీఎన్, టీవీ5 చానళ్లపై ఏపీలో బ్యాన్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు నెలల్లోనే… తాము ఎలుగెత్తి చెప్పిన ప్రజాస్వామ్య సూత్రాలకు పాతరేసే ప్రయత్నం చేస్తోంది. వ్యతిరేకవార్తలు ప్రసారం చేస్తున్నాయన్న కారణంగా ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి, టీవీ 5 చానళ్ల ప్రసారాలను నిలిపి వేయాలంటూ.. కేబుల్ ఆపరేటర్లకు… మంత్రులు హెచ్చరికలు పంపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రెండు చానళ్లు ప్రసారం కావడానికి వీల్లేదని.. కాదూకూడదంటే… ఆయా ఇళ్లకు ఫైబర్‌నెట్‌ను ఉచితంగా సరఫరా చేస్తామని హెచ్చరికలు పంపారు. దాంతో కేబుల్ ఆపరేటర్లు.. మంత్రుల ఒత్తిడికి తలొగ్గారు. అత్యధిక శాతం… ఎంఎస్‌వోలు.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 చానళ్లను నిలిపివేశారు.

మీడియా కవరేజీ ప్రభుత్వ పెద్దలకు మంట పెట్టించిందా..?

తెలుగుదేశం పార్టీ చేపట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమానికి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 చానళ్లు అత్యధిక కవరేజీ ఇచ్చాయన్న అసంతృప్తి… మూడు నెలల్లోనే తమ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారన్న ఆగ్రహం ప్రభుత్వ పెద్దల్లో కనిపిస్తున్నాయని మీడియా వర్గాలు చెబుతున్నాయి. నిజానికి చలో ఆత్మకూరు కార్యక్రమం.. జాతీయ మీడియాలో కూడా హైలెట్ అయింది. అలా అవడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్బంధ చర్యలే కారణం. ఆ నిర్బంధాల వల్లే.. జాతీయ మీడియాలోనూ హైలెట్ అయింది. దీన్ని జీర్ణించుకోలేకపోతున్న ప్రభుత్వం…ఈ సారి ఏకంగా మీడియాపైన నిర్బంధానికి పాల్పడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఉచిత చానళ్లను నిలిపివేయడం చట్ట విరుద్ధం..!

నిజానికి ఇప్పుడు… చానళ్లు నిలిపివేయడం అనేది చట్ట విరుద్ధం. ఎవరైనా ఫలానా చానల్‌ను అనధికారికంగా నిలిపివేస్తే … చర్యలు తీసుకునే అధికారం.. ట్రాయ్‌కి ఉంటుంది. కొత్తగా తెచ్చిన చట్టం ప్రకారం.. చందాదారు కోరుకున్న వంద ఉచిత చానళ్లను… కచ్చితంగా ప్రసారం చేయాలి. టీవీ5, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఉచిత చానళ్లే. వాటిని కచ్చితంగా ప్రసారం చేయాల్సిన బాధ్యత.. ఆయన కేబుల్ ఆపరేటర్లపై ఉంది. అందుకే.. ప్రభుత్వ పెద్దల హెచ్చరికలను పాటించడానికి కొంత మంది కేబుల్ ఆపరేటర్లు సందేహించారు. కానీ తీవ్రమైన ఒత్తిడి రావడంతో.. ట్రాయ్ నుంచి హెచ్చరికలు వస్తే అప్పుడు చూసుకుందామన్నట్లుగా… ప్రసారాలు నిలిపివేసినట్లుగా తెలుస్తోంది.

ఏపీ ప్రభుత్వమే చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తోందా..?

పాలకవర్గాలకు మీడియాపై.. అసహనం ఉండొచ్చు కానీ… మరీ వాటి అంతు చూడాల్సిందేనన్నట్లుగా ఉండటం మంచిది కాదన్న భావన… ప్రజాస్వామ్య వర్గాల్లో వినిపిస్తోంది. గతంలో తెలంగాణ సర్కార్ టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలను.. తెలంగాణలో నిషేధించింది. దాదాపుగా ఏడాదిన్నర పాటు… కేబుల్ ఆపరేటర్లు అప్రకటిత నిషేధం కొనసాగించారు. ఆ తర్వాత ట్రాయ్ ఉత్తర్వుల కారణంగా.. మళ్లీ ప్రసారాలు ప్రారంభించారు. ఇప్పుడు ఏపీ సర్కార్ తమకు నచ్చని చానళ్లపై.. అదే విధమైన నిర్బంధానికి పాల్పడుతోంది. అప్పటితే పోలిస్తే.. ఇప్పుడు చట్టం మరింత బలంగా ఉంది. కానీ.. పాలకులు చట్ట వ్యతిరేకంగా బెదిరింపులకు పాల్పడి… కేబుల్ ఆపరేటర్లతో ఈ పని చేయిస్తూండటం… అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టాలీవుడ్‌లో బాలకృష్ణ మాటల మంటలు..!

షూటింగ్‌లు ఎప్పుడు ప్రారంభించాలన్నదానిపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో చిరంజీవి నేతృత్వంలో బృందం సమావేశం కావడంపై.. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. షూటింగ్‌లు ఎప్పుడు ప్రారంభించాలా టాలీవుడ్ పెద్దలు..తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు...

కేంద్రం ఏపీపై ఆధారపడినప్పుడు ప్రత్యేక హోదా : జగన్

అప్పు రేపు.. తరహాలో ప్రత్యేకహోదా రేపు అంటున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా గతంలో ఆయన "హోదా యోధ"గా స్వయం ప్రకటితంగా చేసుకున్న పోరాటం ఏమయిందని.. ప్రజలు...

శ్రీవారి ఆస్తులు అమ్మేదిలేదని టీటీడీ బోర్డు తీర్మానం..!

శ్రీవారికి భక్తులు కానుకగా ఇచ్చిన వాటిని అమ్మే ప్రసక్తే లేదని... తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తాజాగా ప్రకటించింది. ఈ మేరకు పాలకమండలి భేటీలో నిర్ణయం తీసుకున్నారు. శ్రీవారి ఆస్తుల అమ్మకాన్ని పూర్తిగా...

ఈ ప్రభుత్వం ఐదేళ్లు ఉండదన్న బాలకృష్ణ, విమర్శించిన మోపిదేవి

ఆంధ్రప్రదేశ్ లో 151 ఎమ్మెల్యే ల మెజారిటీ తో అధికారం లోకి వచ్చిన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఐదేళ్లపాటు అధికారంలో ఉండదని, అంతకంటే ముందే ఈ ప్రభుత్వం దిగి పోతుందని నందమూరి బాలకృష్ణ...

HOT NEWS

[X] Close
[X] Close