మీడియా వాచ్ : తెలుగులో ఏబీపీ డిజిటల్..! పెరుగుతున్న ఉత్తరాది ప్రాబల్యం..!

తెలుగు మీడియా రంగంలో ఉత్తరాది ప్రాబల్యం పెరుగుతోంది. గతంలో తెలుగు మీడియాకు సంబంధించి పత్రికలైనా.. టీవీ చానళ్లు అయినా తెలుగు వారే ప్రారంభించేవారు. గతంలో ఉత్తదారికి చెందిన పెద్ద పెద్ద సంస్థలు మీడియా రంగంలోకి రావాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పత్రికలకు.. టీవీలకు భారీ పెట్టుబడి కావాల్సి రావడం ఓ కారణం అయితే.. నిర్వహించడం కష్టమని భావించడం మరో కారణం. అయితే ఇప్పుడు కొత్త తరం మీడియా.. డిజిటల్ రూపంలో దూసుకు వస్తోంది. తెలుగు సంప్రదాయ మీడియా ఈ విభాగంలో వెనుకబడిపోతోంది.

ఉత్తరాది యాజమాన్యాల చేతుల్లోని సంస్థలు డిజిటల్ మీడియాపై ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాయి. ఈ క్రమంలో తెలుగులోకి కొత్తగా ఆనందబజార్ పత్రిక గ్రూప్.. ఏబీపీ గ్రూప్‌ ఎంటరయింది. డిజిటల్ విభాగంలోకి అడుగు పెట్టింది. సైలెంట్‌గా పనులు చేసి.. యాప్‌ను .. వెబ్ సైట్‌ను ఆవిష్కరించేసింది. ఇరవై నాలుగు గంటల న్యూస్ చానల్ పెట్టే ఉద్దేశం లేదు కానీ.. రిలయన్స్‌కు చెందిన నెట్ వర్క్ 18, టైమ్స్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన సమయం వంటి డిజిటల్ మీడియాతో పోటీ పడి తెలుగు మార్కెట్ సాధించుకునేందుకు ఏబీపీ శక్తియుక్తులను కేంద్రీకరించడం ఖాయంగా కనిపిస్తోంది. పెద్దగా పెట్టుబడి అవసరం లేకపోవడం… పరిమిత మ్యాన్ పవర్‌తో నడిపించుకునే సామర్థ్యం… కావాల్సినంత టెక్నాలజీ సపోర్ట్ ఉండటం ఏబీపీకి ప్లాస్ పాయింట్లుగా చెప్పుకోవచ్చు.

ఓ రకంగా భవిష్యత్ మీడియా అంతా డిజిటలేనని నమ్ముతున్న సమయంలో… తెలుగు వార్తా పారిశ్రామికవేత్తలు డిజిటల్ విభాగంలో వెనుకబడిపోతున్నారు. ఉత్తరాది వారు.. దూసుకెళ్తున్నారు. వారిది పెట్టుబడి మాత్రమే… అక్కడ పని చేసేవారంతా తెలుగువారే ఉంటారు. వారంతా ఆయా చానళ్లు.. టీవీల నుంచి వచ్చిన వారే. అందుకే ఇక్కడ పెట్టుబడి కోణంలో కాకుండా… పూర్తి స్థాయిలో న్యూస్ విషయంలా చూస్తే… కొత్త తరానికి ఆదరణ లభిస్తుందని అనుకోవాలి. తెలుగు డిజిటల్ మీడియాలో ఏబీపీ ఎంత షేర్ రాబట్టుకుంటుందో వేచి చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close