అధికారం ఉందని చంద్రబాబుపై కేసులు పెట్టాలని ఆరాటంతో ఏమీ లేకపోయినా కేసులు పెట్టించిన జగన్ కు ఇప్పుడు పరువు పోతోంది. ఆ కేసులకు ఎలాంటి ఆధారాలు లేవని ఇప్పుడు ఫిర్యాదు చేసిన వాళ్లే కోర్టుకు వెళ్లి లిఖితపూర్వకంగా తెలియచేస్తున్నారు. దాంతో ఆ కేసుల్ని ఏసీబీ కోర్టు మూసివేస్తోంది. గత వారం ఫైబర్ నెట్ కేసుమూసివేయగా.. ఈరోజు ఎక్సైజ్ శాఖలో అక్రమాలంటూ పెట్టిన కేసును మూసివేశారు.
జగన్ రెడ్డి అధికారంలోకి 2019 లో వచ్చారు. వచ్చినప్పటి నుండి ఇష్టారీతిన లిక్కర్ దోపిడీకి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఆధారాలతో సహా ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ప్రజల ముందు పెడుతూండటంతో.. జగన్ రెడ్డి 2023లో .. 2014-19 లిక్కర్ పాలసీలో అక్రమాలు జరిగాయని అప్పటి ఎండీ.. స్కాంలో బకరాగా వాడుకున్న వాసుదేవరెడ్డితో ఫిర్యాదు చేయించారు. తాడేపల్లి లో జరిగిన కుట్ర ప్రకారం కొల్లి రఘురామిరెడ్డి, మరికొంత మంది అధికారులు ఏ తప్పూ లేకపోయినా ఏదో జరిగిందని చెప్పి క్రియేట్ చేసి కేసు పెట్టారు.
ఈ కేసులో ఏ1 గా సుధాకర్, ఏ2 కొల్లు రవీంద్, ఏ3 చంద్రబాబు పేర్లను ఏపీ సీఐడీ నమోదు చేసింది. రెండు బేవరేజీలు, మూడు డిస్టిలరీలకు లబ్ది చేకూర్చేందుకు మద్యం పాలసీని మార్చారని ఆరోపించారు. కానీ పాలసీ మార్చడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది కానీ తగ్గలేదని సీఐడీ తేల్చింది. అదే విషయాన్ని సీఐడీ కోర్టుకు తెలిపింది. దీంతో కోర్టు కేసును మూసివేసింది.