‘ఆచార్య’ ప్లేస్‌లో ‘ల‌వ్ స్టోరీ’

క‌రోనా సెకండ్ వేవ్ ప్ర‌భావం సినిమా ప‌రిశ్ర‌మ‌పై గట్టిగా ప‌డింది. వ‌రుస‌గా సినిమాల‌న్నీ వాయిదా ప‌డుతూ వ‌స్తున్నాయి. అన్నీ బాగుంటే.. ఈపాటికి `ల‌వ్ స్టోరీ` విడుద‌ల కావాల్సింది. కానీ.. నిర‌వ‌ధికంగా ఈ సినిమాని వాయిదా వేశారు. ఇప్పుడు కొత్త డేట్ ఫిక్స్ చేసిన‌ట్టు టాక్. మే 13న `ల‌వ్ స్టోరీ`ని తీసుకురావాల‌న్న‌ది ద‌ర్శ‌క నిర్మాత‌ల ప్ర‌య‌త్నం.

నిజానికి మే 13న `ఆచార్య‌` ఫిక్స‌య్యింది. అయితే.. ఆచార్య వాయిదా ప‌డే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉండ‌డంతో… ఆ డేట్ ని వాడుకోవాల‌ని `ల‌వ్ స్టోరీ` టీమ్ చూస్తోంది. అప్ప‌టికి క‌రోనా వేవ్ కాస్త త‌గ్గుతుంద‌న్న ఆశాభావం ఉండడం, 50 శాతం ఆక్యుపెన్సీలాంటి ప్ర‌మాదాలు ఉండ‌వ‌న్న సంకేతాలు రావ‌డంతో… `ఆచార్య‌` డేట్ లో ల‌వ్ స్టోరీ తీసుకురావాల‌ని చిత్ర‌బృందం భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. దాదాపు ఈ డేట్ ఫిక్స‌య్యే ఛాన్సులు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. కాక‌పోతే.. అధికారిక ప్ర‌క‌ట‌న మాత్ర రావాలంతే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close