‘ఆర్‌.ఆర్‌.ఆర్’ త‌ర‌వాతే ‘ఆచార్య‌’!

ఆర్‌.ఆర్‌.ఆర్ వాయిదా ప‌డ‌డం వ‌ల్ల‌… టాలీవుడ్ షెడ్యూల్ అంతా తారు మారు అయ్యింది. ముఖ్యంగా.. దీని ఎఫెక్ట్ `ఆచార్య‌`పై ప‌డింది. ఎందుకంటే… ఈ రెండు సినిమాల‌కూ ఓ ఇంట‌ర్ లింకు ఉంది. `ఆర్‌.ఆర్‌.ఆర్‌` త‌ర‌వాతే… `ఆచార్య‌`ని విడుద‌ల చేయాల‌న్న‌ది లోపాయికారిగా జ‌రిగిన ఒప్పందం. ఎందుకంటే ఈ రెండు సినిమాల్లోనూ రామ్ చ‌ర‌ణ్ ఉన్నాడు. `ఆర్‌.ఆర్‌.ఆర్‌` షూటింగ్ ద‌శ‌లో ఉండ‌గా `ఆచార్య‌`లో రామ్‌చ‌ర‌ణ్ తో ఓ పాత్ర చేయించాల‌న్న ఆలోచ‌న వ‌చ్చింది. ఆర్‌.ఆర్‌.ఆర్‌తో ఆచార్య‌కు క్లాష్ రాకుండా ఉండాల‌న్న ఉద్దేశ్యంతో.. ఈ సినిమాలో చ‌ర‌ణ్ న‌టించాలా, వ‌ద్దా అనే విష‌యంలో రాజ‌మౌళి నిర్ణ‌యం కీల‌క‌మైంది. `ఆచార్య‌`లో చ‌ర‌ణ్ న‌టిస్తే త‌న‌కు ఎలాంటి ఇబ్బంది లేద‌ని, అయితే.. `ఆర్‌.ఆర్‌.ఆర్‌` విడుద‌ల అయిన త‌ర‌వాతే.. `ఆచార్య‌`ని విడుద‌ల చేయాల‌ని రాజ‌మౌళి ష‌ర‌తు విధించాడు. దానికి ఆచార్య టీమ్ కూడా ఓకే అంది. జ‌న‌వ‌రి 7న ఆర్‌.ఆర్‌.ఆర్ విడుద‌లైతే.. ఎలాంటి స‌మ‌స్య ఉండేది కాదు. ముందే అనుకున్న‌ట్టు ఫిబ్ర‌వ‌రి 4న ఆచార్య వ‌చ్చేసేది. ఇప్పుడు ఆ అవ‌కాశం లేదు. ఆర్‌.ఆర్‌.ఆర్ విడుద‌లైన త‌ర‌వాతే.. ఆచార్య రావాలి. ఈ యేడాది వేస‌విలో ఆర్‌.ఆర్‌.ఆర్ విడుద‌ల చేస్తే.. ఆ త‌ర‌వాత 15 రోజుల‌కో, నెల‌కో ఆచార్య‌ని విడుద‌ల చేస్తారు. నిజానికి… ఆర్‌.ఆర్‌.ఆర్ విడుద‌ల అయినా, కాక‌పోయినా ఆచార్య విడుద‌ల‌కు స‌రైన వాతావ‌ర‌ణం ఇప్పుడు లేదు. ఎందుకంటే.. ఏపీలో టికెట్ రేట్ల ర‌గ‌డ ఇప్పుడు కూడా కొన‌సాగుతోంది. ఈ ఇష్యూ ప్ర‌స్తుతం కోర్టులో ఉంది. ఫిబ్ర‌వ‌రి 10న ఈ పిటీష‌న్ పై విచార‌ణ జ‌ర‌గ‌బోతోంది. ఆ త‌ర‌వాతే.. టికెట్ రేట్ల వ్య‌వ‌హారం తేలుతుంది. అప్ప‌టి వ‌ర‌కూ ఆచార్య‌నీ హోల్డ్ లో పెట్ట‌క త‌ప్ప‌దు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అయితే హైకోర్టు.. లేకపోతే సుప్రీంకోర్టు – తెలంగాణ సర్కార్ తంటాలు !

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకి వెళ్లకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సీబీఐకే ఇవ్వాలని హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇవ్వడంతో ఈ రోజు మళ్లీ సింగిల్ బెంచ్ మీద .. అత్యవసరంగా...

విజయసాయిరెడ్డి అసలు క్యారెక్టర్ మళ్లీ బయటకు !

లోపల క్యారెక్టర్ అలాగే ఉంది.. బయటకే మంచిగా కనిపిస్తున్నా అని విజయసాయిరెడ్డి మరోసారి నిరూపించారు. కొన్నాళ్లుగా ఆయన తాను మారిపోయినట్లుగా.. పెద్ద మనిషినన్నట్లుగా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ పార్లమెంట్‌లో అసలు...

జగన్ జైలుకుపోతే షర్మిలే సీఎం !

తెలంగాణలో రాజకీయాలు చేస్తున్న వైఎస్ఆర్ బిడ్డ షర్మిల కష్టాన్ని బీఆర్ఎస్ నేతలు తేలికగా తీసుకుంటున్నారు. ఓట్లు రాని ఇంత కష్టం ఎందుకని.. కాస్త కష్టపడితే పదవి వచ్చే మార్గాన్ని బీఆర్ఎస్ నేతలు విశ్లేషించి...

జగన్‌కు “అప్పు రత్న” బిరుదిచ్చిన పవన్ !

సీఎం జగన్ చేస్తున్న అప్పులపై జనసేనాని పవన్ కల్యాణ్ సెటైర్ వేశారు. ఆయనకు అప్పు రత్న అవార్డు వచ్చినట్లుగా అధికారులు ఆయనకు ఓ మెమెంటోను తెచ్చి ఇస్తున్నట్లుగా కర్టూన్ తన సోషల్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close