మ‌హేష్ కి క‌రోనా.. ట్విట్ట‌ర్‌లో ప్ర‌క‌ట‌న‌

క‌రోనా విజృంభిస్తోంది. టాలీవుడ్ ని ఒణికిస్తోంది. ఈరోజు మంచు ల‌క్ష్మి, మీనాలు క‌రోనా బారీన ప‌డ్డారు. ఈ జాబితాలో ఇప్పుడు మ‌హేష్ బాబు కూడా చేరాడు. మ‌హేష్ కి క‌రోనా సోకింది. ఈ విష‌యాన్ని మ‌హేష్ స్వ‌యంగా ట్విట్ట‌ర్ లో వెల్ల‌డించారు. త‌న‌కు కోవిడ్ పాజిటీవ్ గా నిర్దారణ అయ్యింద‌ని, ప్ర‌స్తుతం తాను హోం ఐసొలేష‌న్ లో ఉన్నాన‌ని మ‌హేష్ ట్విట్ట‌ర్ లో పేర్కొన్నారు. ఇటీవ‌ల త‌న‌ని క‌లిసిన‌వాళ్లంతా కోవిడ్ ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని, టీకాలు వేయించికోనివాళ్లంతా త‌క్ష‌ణ‌మే.. వేయించుకోవాల‌ని ఆయ‌న కోరారు. మ‌హేష్ ప్ర‌స్తుతం `స‌ర్కారు వారి పాట‌`లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లో… త్రివిక్ర‌మ్‌, రాజ‌మౌళితోనూ ఓ సినిమా చేయ‌బోతున్నారు. ఇటీవ‌ల త్రివిక్ర‌మ్ దుబాయ్‌లో మ‌హేష్ ని క‌లిసొచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close