ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మరోసారి పది రోజుల్లో ప్రత్యేక సమావేశం కానుంది. అమరావతిపై తీర్మానం చేసిన కొద్దిరోజులకే మళ్లీ సభను పిలవడం వెనుక ఏదో బలమైన కారణం ఉందనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో గుప్పుమంటున్నాయి. పైకి మాత్రం పార్లమెంట్లో వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చిస్తాం.. మహిళా సాధికారతే మా లక్ష్యం అని చెబుతున్నప్పటికీ, అసలు ఉద్దేశం అది కాదని భావిస్తున్నారు. అమరావతి రాజధానిగా కేంద్రం నుంచి చట్టబద్ధత లభించిన వేళ, మళ్లీ ప్రత్యేక సమావేశం అంటే చంద్రబాబు ఏదో పెద్ద స్కెచ్చే వేసి ఉంటారని అంతా అనుకుంటున్నారు.
సచివాలయ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం.. ప్రభుత్వం కొన్ని అత్యంత కీలకమైన బిల్లులను తీసుకురావాలని చూస్తోంది. మహిళా బిల్లును కేవలం ఒక షీల్డ్ లాగా వాడుకుని, సభలో అసలు అజెండాను చివరి నిమిషంలో బయటపెడతారని టాక్. ముఖ్యంగా రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు సంబంధించిన నిర్ణయాల కోసమే ఈ హడావుడి అని కొందరు అంటున్నారు. చంద్రబాబు ఈ విషయంలో తన కేబినెట్ సహచరులకు కూడా స్పష్టమైన క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్స్‌ను మెయింటెన్ చేస్తున్నారు.
ఎమ్మెల్యేలతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో కూడా కేవలం మహిళా బిల్లు గురించి మాత్రమే మాట్లాడిన బాబు, అదనంగా ఉండే బిల్లుల గురించి చిన్న లీక్ కూడా ఇవ్వలేదు. విశేషం లేనిదే చంద్రబాబు స్పెషల్ సెషన్ పిలవరు అనేది పొలిటికల్ సర్కిల్స్‌లో వినబడుతున్న మాట. ఆ విశేషం ఏంటో తెలియాలంటే సభ గంట మోగే వరకు వెయిట్ చేయాల్సిందే. కానీ మహిళా బిల్లు విషయంలో విపక్షాలు చేసిన ద్రోహానని మహిళలకు తెలిసేలా చేయడానికే సమావేశమన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది.
