ఎడిటర్స్ కామెంట్ : స్వతంత్ర భారతంలో ” సేవ” కూడ పాపమే !

మదర్ థెరిస్సా గురించి చిన్నప్పుడు పాఠాల్లో గొప్పగా చెప్పుకున్నాం. ఎక్కడో నార్త్ మాసిడోనియా అనే దేశంలో పుట్టి.. ఇండియాలో కుష్టురోగులకు ఆమె అందించిన సేవల గురించి తెలిసి.. బాల్యంలో కన్నీరు పెట్టుకున్న జ్ఞాపకాలు అందరికీ ఉంటాయి. కానీ ఇప్పుడు ఆమె గురించి కొత్తగా చెబుతోంది వేరు. ఆమె సేవ ముసుగులో మత మార్పిళ్లకు పాల్పడ్డారని.. ఆమె ఏర్పాటు చేసిన మిషనరీస్ ఆఫ్ చారిటీస్ విదేశీ విరాళాలను సేకరించి .. దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ కారణంమతోనే ఆ సంస్థ విదేశాల నుంచి విరాళాలు సేకరించకూడదని కేంద్రం ఆదేశించింది. ఒక్క మదర్ థెరిసా సంస్థకే కాదు.. దేశంలో స్వచ్చందంగా సేవ చేస్తున్న కొన్ని వేల సంస్థలది అదే పరిస్థితి.

12వేల సంస్థలకు విదేశీ విరాళాల లైసెన్స్ రద్దు !

కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ దాదాపు 12 వేలకు పైగా ఎన్జీవోలకు సంబంధించి విదేశాల నుంచి విరాళాలు పొందడానికి అవసరమయ్యే ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్సును రద్దుచేసింది. ఏడు దశాబ్దాల క్రితమే నోబుల్‌ బహుమతి గ్రహిత మదర్‌ థెరిస్సా స్థాపించిన ‘మిషనరీ ఆఫ్‌ చారిటీ’ కూడా ఈ జాబితాలో ఉంది. ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్సు కోల్పోయిన సంస్థలలో కోవిడ్‌ సంక్షోభ సమయంలో ప్రజలకు స్వచ్ఛందంగా సేవలు అందించిన సంస్థలే ఎక్కువగా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా గతంలో 23వేల వరకూ ఎఫ్‌సీఆర్‌ఏ నమోదిత ఎన్జీవోలు ఉండగా ఇప్పుడు అది పదహారు వేలకు తగ్గిందని కేంద్రం ప్రకటించింది. విదేశీ విరాళాలు ఆర్థిక వనరుగా కార్యకలాపాలు సాగిస్తున్న వేలాది స్వచ్ఛంద సంస్థల అనుమతులను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం .. ఇంకొన్నిటిని రెన్యూవల్‌ చేయకపోవడం వివాదాస్పదంగా మారుతోదంి. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం ప్రకారమే వాటిని రద్దు చేశామని చెప్పి ప్రభుత్వం సమర్థించుకుంటంది కానీ ప్రభుత్వ చర్య మూలంగా ధార్మిక, స్వచ్ఛంద సంస్థలు చేపడుతున్న ప్రజా సేవా కార్యక్రమాలు అర్ధంతరంగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది.

ఫేక్ సంస్థలపై చర్యలు తీసుకోవాల్సిందే !

దేశంలో దాదాపు 31 లక్షల స్వచ్ఛంద సంస్థలున్నాయి. అంటే దాదాపు ప్రతి 400మందికి ఒక ఎన్జీవో ఉంది. అయితే వీటిలో అత్యధికం ఫేక్. పన్ను మినహాయింపుల కోసం.. లేకపోతే వివిధ రకాల కారణాలతో ప్రజల్లో చీలికలు తెచ్చేందుకు ఏర్పాట్టాయి. అలాంటి వాటి మీద కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. దేశంలో ఎన్నో స్వచ్ఛంద సంస్థలు పేదల్లో చిచ్చుపెట్టేవే. కార్మిక సంఘాలు ముసుగు వేసుకున్నవి కొన్ని. గిరిజనుల ఐక్యతను దెబ్బతీసేవి మరికొన్ని ఉన్నాయి. కానీ ఇలాంటి సంస్థలు ఎన్నింటిపై కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నదానిపై ఎవరికీ స్పష్టత లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా పేరున్న సంస్థల విషయంలో మాత్రం కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు ఎప్పటికప్పుడు సంచలనం అవుతున్నాయి। ఎందుకంటే అవి ఎంతో మంది అభాగ్యులను ఆకలికి గురి చేస్తున్నాయి. ఎంతో మంది సేవలు పొందలేకపోతున్నారు.

దేశంపు కుట్ర పేరుతో కొన్ని సంస్థలపై దాడి !

మారుమూల ప్రాంతాలకు సైతం వెళ్లి పేదలకు, అన్నార్తులకు అవసరమైన సహాయం అందించడం మొదలు అధునాతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో సహాయం చేయడం వరకూ స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాల్లో ఉన్నాయి. అనేక సంస్థలకు పర్యావరణ పరిరక్షణ ప్రధానాంశంగా ఉంది. స్వచ్ఛంద సంస్థల సాధారణ స్వభావం సహాయపడడమే! తప్పుడు పనులు చేసేవారుంటే వారిని నిలువరించడాన్ని, అవసరమైతే శిక్షించడాన్నీ ఎవరూ తప్పుబట్టరు. ప్రజా సేవకు, సమాజ హితానికీ అంకితమై పని చేసే ఏ స్వచ్ఛంద సంస్థకైనా ఎఫ్‌సిఆర్‌ఎ నిబంధనల పేరిట ఆటంకాలు కల్పించరాదు…వాటిని వేధించరాదు. కానీ దురదృష్టవశాత్తూ అదే జరుగుతోంది. కోవిడ్‌ మహమ్మారి విజృంభించిన సమయంలో దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రాణావసర మందుల సరఫరా మొదలు ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటు వంటివి చేపట్టిన ఆక్స్‌ఫాం ఇండియా సేవలు ఇప్పుడు కొనసాగలేని దుస్థితి ఏర్పడింది. పర్యావరణ అంశాల్లో కృషి చేస్తున్న గ్రీన్‌పీస్‌ సంస్థ కార్యకలాపాలను కేంద్ర ప్రభుత్వం స్తంభింపజేసింది. ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక భారత్‌లో తమ కార్యలాపాలు నిలిపివేస్తున్నట్లు ప్రముఖ మానవహక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ 2020లోనే ప్రకటించింది. మదర్‌ థెరిసా నిర్వహించిన మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ పైన కూడా మోడీ సర్కారు వేటు వేయడం తాజా పరిణామం. వీటిపై దేశ వ్యతిరేక ముద్ర చాలా పక్కాగా వేస్తున్నారు.

టీటీడీని వదల్లేదు.. ఎందుకని !?

ఈ వివాదంలో హైలెట్ ఏమిటంటే కొన్ని హిందూ సంస్థలకూ లైసెన్స్ రావడం లేదు. తిరుపతి తిరుమల దేవస్థానానికి కూడా ఎఫ్‌సిఆర్‌ఎ గడువు 2020 డిసెంబరుతో ముగియగా ఘనత వహించిన కేంద్ర హోం శాఖ ఇప్పటికీ రెన్యూవల్‌ చేయలేదు. టిటిడి అధికారులు కనీసం ఢిల్లీ వెళ్లి హోం శాఖ ఉన్నతాధికారుల దర్శనం చేసుకుని వారు అడిగిన వివరాలన్నీ సమర్పించినప్పటికీ ఈ ఏడాదంతా ఎఫ్‌సిఆర్‌ఎ అనుమతి రాలేదు. కోవిడ్‌ కష్ట కాలంలో ఆదాయం తగ్గిపోయిన నేపథ్యంలో విదేశీ ఆదాయం వస్తే కొంత ఊరట లభించేదని టిటిడి అధికారులకు ఆవేదన మిగిలిపోయిందితప్ప కేంద్రం మాత్రం అంగీకరించడం లేదు. సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వ చట్టాలు, నిబంధనలకు లోబడి నడుచుకునే టిటిడికి ఒక ఏడాదికిపైగా ఎఫ్‌సిఆర్‌ఎ లైసెన్సు రెన్యూవల్‌ చేయకపోవడానికి కారణాలేమిటో స్పష్టతలేదు. కేంద్రం కూడా ప్రకటించలేదు. అయితే బీజేపీ పట్టు బిగించాలనుకున్న హిందూ సంస్థలపై కూడా ఎఫ్‌సిఆర్‌ఎ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారని అందుకే టీటీడీ విషయంలో అనుమతులు ఇవ్వడం లేదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

గ్రీన్ పీస్, ఆమ్నెస్టి, ఆక్స్ ఫామ్ హక్కులకు వాయిస్ !

విదేశీ విరాళాల చట్టాన్నే ఆయుధంగా వాడుతూ గ్రీన్‌ పీస్‌, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌, ఆక్స్ ఫామ్ అంతర్జాతీయ సంస్థల లైసెన్సులను రద్దు చేసింది. ఆస్ట్రేలియాలో ఆదానీ కంపెనీకి బొగ్గు తవ్వకాలను అనుమతులకు అడ్డుపడిన గ్రీన్‌పీస్‌పై ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్న అనుమానాలున్నాయి. ఆమ్నెస్టి ఇంటర్నేషన్ ఇండియాలో మానవ హక్కుల పరిస్థితిని ఎప్పటికిప్పుడు బయటపెడుతూ ఉంటుంది. నిజానికి ఇప్పటి వరకూ చర్యలు తీసుకున్న ఒక్క సంస్థపైనా నిర్దిష్టమైన అభియోగం చూపించలేకపోయారు. అంతర్జాతీయ సంస్థ మీద కఠిన చర్య తీసుకున్నప్పుడు కారణాలు వివరించడం ప్రభుత్వ కనీస బాధ్యత. ఆయా సంస్థల ఆడిట్‌లో గోల్‌ మాల్‌ ఉంటే పరిమితులకు లోబడే ఆ గుట్టు విప్పవచ్చు. ప్రజలు నిజం తెలుసుకుంటారు. ఎక్కడైన నిధులు దుర్వినియోగం జరిగిన చోట, అక్రమాలను గుర్తించిన చోట చర్యలు తీసుకుంటే ఎవరూ తప్పు పట్టారు. కానీ ఇప్పుడు జరుగుతోంది వేరు. దాని పర్యవసానాలు ఏమిటో అనుభవించే నిర్భాగ్యులకే తెలుస్తుంది. కానీ మన దేశంలో అలాంటి వారికి అసలు విలువలేదు కదా మరి !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వాడిన 9 ఫోన్లు ఈడీకి సమర్పించిన కవిత !

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత 9 ఫోన్లను మార్చారని చేశారని ... డిల్స్ మాట్లాడుకున్న ఆధారాలను ధ్వంసం చేశారని ఈడీ చేస్తున్న ఆరోపణలకు ఆమె స్ట్రెయిట్ కౌంటర్ ఇచ్చారు. తాను ఫోన్లు...

మ‌నిషి ప్రాణాల‌తో ఆడుకోవ‌ద్దు: కోట శ్రీ‌నివాస‌రావు ఆవేద‌న‌

ఈరోజు ఉద‌య‌మే ఓ దుర్వార్త‌. కోట శ్రీ‌నివాస‌రావు మ‌ర‌ణించార‌ని. సోష‌ల్ మీడియాలో ఇదే.. హాట్ టాపిక్‌. అయితే ఇది అచ్చంగా ఫేక్ వార్త‌. కోట ఆరోగ్యంగానే ఉన్నారు. ఇప్పుడు ఓ వీడియో కూడా...

మోసగాళ్లకు ఏపీ ప్రభుత్వం అంత ఈజీగా కనిపిస్తోందా ?

ఏకంగా సీఎం జగన్ ఫోటోను వాట్సాప్ డీపీగా పెట్టుకుని ఇతర రాష్ట్రాల్లో తాను జగన్ పీఏనని చెప్పి పారిశ్రామికవేత్తల్ని కోట్లలో ముంచాడు బుడమూరు నాగరాజు అనే మోసగాడు. ఈయన ఇలా మోసాలు...

రివ్యూ : రంగమార్తాండ

Rangamarthanda review రేటింగ్‌: 2.75/5 గులాబి నుంచి నక్షత్రం వరకూ 20 సినిమాలు చేశారు కృష్ణ వంశీ. ఇందులో కొన్ని క్లాసిక్స్, కొన్ని విజయాలు, ఇంకొన్ని అపజయాలు వున్నాయి. అయితే ఇవన్నీ కూడా ఆయన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close