బాధ్యులపై చర్యలు పుష్కరాల తర్వాతే!

ప్రతిపక్షమై పదేళ్ళు ఎదురీదిన చంద్రబాబునాయుడు సేనానిగా రాటుదేలి వుండవచ్చునేమోగానీ, దళాలవారీగా అధిపతులను తీర్చిదిద్దుకోలేకపోయారు. “అన్నీతానై” వ్యవహారాలు చక్కదిద్దుకునే ఆయన వ్యవహారశైలి  ఊడలు దిగనివ్వని లేదా ”ఎవరినీ ఎదగనివ్వని”మర్రిచెట్టయిపోయింది. ఈడొల్లతనం ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా 27 మందిని చంపేసిన తొక్కిసలాటలో బయట పడింది.

లాభదాయకమైన విద్యాసంస్ధల వ్యాపారిగా ప్రాచుర్యం వున్న నారాయణ ప్రజాజీవితంతో ఏమాత్రం సంబంధం లేకపోయినా ముఖ్యమంత్రి అభీష్టం మేరకు మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి అయ్యారు. పుష్కరాలనిర్వహణ కమిటీకి ఆయన్ని చైర్మన్ గా నియమించారు. స్వచ్చంద సంస్ధలతో, పౌరప్రముఖులతో, ఆధ్యాత్మిక సాంస్కృతిక సంస్ధల ప్రతినిధులతో కమీటీలు వేశారు. అయితే ఏ కమిటీ ఒక్కసారి కూడా సమావేశమవ్వలేదు. సంస్ధల ప్రతినిధులు స్వయంగా వెళ్ళి కలసినపుడు హేళనా పూరితంగా మాట్లాడిన సబ్ కలెక్టర్ అహంకార వైఖరికి గాయపడిన పౌరసమాజం నాయకులు, ప్రతినిధులు రెండోసారి వెళ్ళలేదు. మఠాధిపతులు, సాధుప్రముఖుల కోసం కార్యకర్తలు పాస్ లు అడిగినపుడు అసలు ఎంతమంది స్వామీజీలు వున్నారు అందరూ ఒకకారులో రాలేరా అని విసుక్కున్న మహారాజు ఈ సబ్ కలెక్టర్. ముఖ్యమంత్రో డిజినో వుంటేతప్ప ఏ అధికార సమావేశానికీ యూనీఫారం వేసుకునే అలవాటు లేని కమిటెడ్ ఆఫీసర్ రాజమండ్రి ఎస్ పి. మంత్రి నారాయణ తన సహచర స్ధానిక నాయకులకంటే అధికారుల మీదనే ప్రధానంగా ఆధారపడ్డారు. ఎన్ని చర్చలు జరిగినా తుదినిర్ణయం అధికారుల అభీష్టం మేరకే జరిగింది. బ్యూటిఫికేషన్ లో అవినీతి పై కమీషనర్ కు ఓ ఫిర్యాదు అందితే అందులో దోషికే పదిరెట్లు పెద్ద బ్యూటిపికేషన్ పని అప్పగించి లాలూచీ అధికారి అన్న పేరుతో ఊరేగుతున్న మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ కమిటీలో ఒక సభ్యుడు.
గత పుష్కరాలను దిగ్విజయంగా నిర్వహించిన అప్పటి, ఇప్పటి ఆర్ధిక మంత్రి యనమల రామకృష్టుడు అంటీముట్టనట్టుగానే వున్నారు. అత్యంత సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పిచెప్పి విసుగెత్తి మౌనం పాటించారు. రామభక్త హనుమాన్ అన్నట్టు చంద్రబాబు పట్ల విధేయతే తప్ప తాను ఉపముఖ్యమంత్రిననీ, హోం మంత్రిననీ చాలాసార్లు గుర్తుండని నిమ్మకాయల చిన్నరాజప్ప కూడా కమిటీలో సభ్యుడే!
అనుభవాల్ని, స్ధానిక సామరా్ధ్యల్నీ, స్వచ్చంద సంస్ధల్నీ భాగస్వాములు గా చేయని  పుష్కర సన్నాహాలు అధికారుల ఈవెంటుగా మిగిలిపోయాయి. నాయకులకు, ప్రజలకు లింకు లేకుండాపోయింది. గతంలో మాదిరిగా, స్వచ్చంద సంస్ధలే క్యూల వద్ద సహాయకారులుగా వుండివుంటే క్యూ పేరిగిపోతున్న రద్దీగురించి అంచెలు అంచెలుగా నాయకులకు తెలిసి వుండేది. అలాంటి లింకేలేదు. ముందే చెప్పుకున్నట్టు  కమిటీ చైర్మన్ నారాయణకు అధికార,హోదాలు తప్ప ప్రజాసంబంధాలు లేవు. సంఘటనతో షాక్ అయి ఏంచేయాలో తోచని స్ధితిలో ఆయన వున్నపుడు వైద్య సహాయక బృదాలు ఏసందుల్లోంచి త్వరగా రాగలవో సూచించింది స్ధానిక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరే!
ఏమైతేనేమి కమిటీలన్నీ నామమాత్రంగా కూడా మిగలలేదు. నవ్వు పులుముకుని పలకరించుకుంటూనే వున్నా కలెక్టర్ తమరాజ్యంలోకి మాటిమాటికీ చొరబడిపోతున్నారని పోలీసుఅధికారులు, వాళ్ళు ఏదీ వినిపించుకోవడం లేదని కలెక్టరూ అంతరాలు పెంచుకుంటూనే పనిచేశారు.
అనూహ్యమైన విషాదం తలఎత్తడం వల్లే ఇదంతా బయట పడింది. చంద్రబాబు టీమ్ ఎంత బలహీనమో తేటతెల్లమయ్యింది. సాఫల్యాల కీర్తి ప్రతిష్టలు అందుకున్న చంద్రబాబే వైఫల్యాల అపకీర్తిని కూడా నెత్తికెత్తుకోవలసి వుంది. ఇది కేవలం పుష్కరాల్లో ప్రాణనష్టానికి సంబందించిన సమస్య మాత్రమే కాదు. అధికారాల్ని వికేంద్రీకరరించి, బాధ్యతలు కేటాయించి జవాబుదారీతనం అప్పగించవలసిన నాయకత్వం సమస్య.
తాను లీడరో, ఆర్గనైజరో మరోసారి చంద్రబాబు ఆలోచించుకోవలసినంత పెద్ద సంఘటన ఇది. క్రైసిస్ ట్రబుల్ షూటర్ గా ఆయనకు సాటి రాగల వారు లేకపోవచ్చు. మరణాలకు చలించిపోయి కంటతడి పెట్టిన అరుదైన ముఖ్యమంత్రి కావచ్చు. అయితే నాయకుడినుంచి ప్రజలు ఎదురు చూసేది సత్వర నిర్ణయాలు, తక్షణం అమలు చేసే చర్యలు.
గ్రౌండ్ రియాలిటీస్ ని స్వయంగా తెలునుకునే అవకాశం ఈ విషాదం ద్వారా ముఖ్యమంత్రికి ఏర్పడిందని ఈ సంఘటన తరువాత ముఖ్యమంత్రి ఆలోచనల్లో పెద్దమార్పు కనబడుతోందని ఒక అధికారి చెప్పారు. ఆయన అంచనాల ప్రకారం  శాఖల మార్పుద్వారా కొందరు నాయకులకు ”పనిష్మెంట్” వుంటుంది. కొందరు అధికారులకు ”మరణశాసనాలు” సిద్ధమయ్యాయి. ”వారి తలల తెగడానికి” పుష్కరాలు ముగియడమే ఆలస్యం!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీలో “వన్ ఇయర్” మార్పు..! సజ్జలే నెంబర్ టూ..!?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ టూ ఎవరు అంటే.. అందరూ.. ఎంపీ విజయసాయిరెడ్డి పేరును మొదటి ఆప్షన్‌గా పెడతారు. ఎందుకంటే.. అంత క్రియాశీలకంగా ఉంటారు ఆయన. అటు ఢిల్లీలో పరిస్థితుల్ని...

బీజేపీ గవర్నరేగా సంతకం పెట్టింది..! ఎలా స్వాగతిస్తున్నారు..?

ఎస్‌ఈసీగా రమేష్‌కుమార్‌ను తొలగిస్తూ.. తీసుకు వచ్చిన ఆర్డినెన్స్ చెల్లదని..హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ నేతలు కూడా.. పోటీలు పడి స్వాగతించారు. ఢిల్లీలో జీవీఎల్ నరసింహారావు దగ్గర నుంచి...

ఫిరాయించిన ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీలపై అనర్హతా వేటు..!?

మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లు విషయంలో మండలిలో టీడీపీకి అనుకూలంగా ఓటు వేయకుండా.. వైసీపీ గూటికి చేరిపోయిన ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథరెడ్డిలపై అనర్హతా వేటు వేయడానికి టీడీపీ రంగం సిద్ధం చేసుకుంది....

ఏడాది యాత్ర 11 : అంచనాలు ఎక్కువ… ఆచరణ తక్కువ..!

ఇంత ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ తట్టులేకపోతున్నాను భయ్యా..! .. అంటాడు ఓ సినిమాలో హీరో. నిజంగానే ఆ సినిమాకు హైప్ ఓ రేంజ్‌లో వచ్చింది. ఎంతగా అంటే.. సినిమా ఎంత అద్భుతంగా తీసినా .....

HOT NEWS

[X] Close
[X] Close