అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్క సారిగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాహుల్ రామకృష్ణ. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటారు. హఠాత్తుగా ఆయన వరుసగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్లు పెడుతున్నారు. అయితే ప్రభుత్వం మాట కానీ. కాంగ్రెస్ మాట కానీ తన ట్వీట్లలో లేదు. కేవలం కేసీఆర్, కేటీఆర్‌లకు మాత్రమే విజ్ఞప్తులు ఉన్నాయి. మొత్తం రెండు ట్వీట్లు ఆయన పెట్టారు .
మనం చాలా భయంకరమైన కాలంలో జీవిస్తున్నాము. వేచి ఉండలేను వచ్చి పరిస్థితుల్ని చక్కదిద్దాలని ఓ ట్వీట్లో కేటీఆర్ ను కోరారు. అలాగే మరో ట్వీట్లో హైదరాబాద్ మునిగిపోయింది. మీ వాగ్దానాలన్నీ విఫలమయ్యాయి. ప్రతిదీ క్రమబద్ధీకరించమని ప్రజలు మిమ్మల్ని పిలుస్తున్నారని కేసీఆర్ ట్విట్టర్ అకౌంట్ కు ట్వీట్ చేశారు. పండగపూట బీఆర్ఎస్ సోషల్ మీడియాకు ఇంత మంచి ట్వీట్లు గుర్తింపు ఉన్న నటుడు సోషల్ మీడియా అకౌంట్ నుంచి వస్తే అంతకు మించిన పండగ ఏముంటుంది?. వైరల్ చేసేసుకుంటున్నారు.
మరో ట్వీట్లో ఈ ప్రపంచంలో ద్వేషం ఉండకూడదని మనం మునుషులమేనని..కేవలం ప్రేమతో జీవించాలని చెప్పుకొచ్చింది. హైదరాబాద్ మునిగిపోయి తేరుకుని కూడా చాలా రోజులు అయింది. ఇప్పుడు రాహుల్ రామకృష్ణకు ఎందుకు గుర్తుకొచ్చిందో కానీ రాజకీయంగా టార్గెట్ చేయడంతో వైరల్ అవుతున్నారు. ఆయనకు వచ్చిన సమస్యేమిటో చెప్పాలని కాంగ్రెస్ కార్యకర్తలు కామెంట్ల రూపంలో డిమాండ్ చేస్తున్నారు.