నటుడు శివాజీ కొంతకాలం పాలిటిక్స్ లో క్రియాశీలంగా ఉన్నారు. రాష్ట్ర విభవన సమయంలో పను అంశాలపై పెద్ద ఎత్తున మాట్లాడారు. ఇప్పటికీ ఏదైనా ఒక ఇష్యూ వస్తే తన వాయిస్ వినిపిస్తారు. అయితే ఇంతకాలంలో ఆయన ఏ పార్టీలోనూ చేరలేదు. దీనికి కారణం గల కారణం తాజాగా తెలుగు 360 ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
”రాజకీయ నాయకుడిగా నేను పనికిరాని ఏమో’ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు శివాజీ. ”నేను స్వయంగా వెళ్లి ఎవరిని ఏమీ అడగలేను. ఒకవేళ ఏదైనా ఇచ్చినా ఏది పడితే అది చేయలేను. కాకపోతే ఏదైన ఏదైనా సమస్య వస్తే మాట్లాడాలని నిర్ణయించుకున్నాను”అన్నారు.
”రాజకీయ పార్టీలకు కొన్ని భయాలు ఉంటాయి. ఏ పార్టీ నన్ను అంగీకరించలేదు. ఒకవేళ నేను పార్టీలోకి వెళితే నేను ఎలా మాట్లాడుతానో ఎలా రియాక్ట్ అవుతాను అనే భయం ఉంటుంది. నాకు తప్పుని తప్పుగా చెప్పాలనే ఆవేశం వుండేది. కానీ ఇప్పుడు నాలో కొన్ని మార్పులు వచ్చాయి. ఒక విషయం చెప్పాలంటే వాళ్ళ దారిలోకి వెళ్లి వాళ్లకి ఎలా తెలియజేయాలో అర్థమైంది. గతంలో నేను కొంతమంది దగ్గర చెప్పిన విషయాలు ఇప్పుడు ఆచరణలోకి వచ్చాయి. అది కొంత ఆనందం.
‘పాలిటిక్స్ అంటే జనాల్ని దూరం చేయడం కాదు కలుపుకోవడం. వర్గాలుగా విడగొట్టడం కాదు వర్గాలుగా కలుపుకుపోవడం.. ఇలా మాట్లాడితే చాలా మందికి నచ్చదు. రాజకీయ నాయకులు సలహాలు తీసుకోరు. చాలా విషయాలు నేర్చుకునే బయటకు వచ్చాను. రాజకీయాల్లోకి దూరాలనే ఏమాత్రం అనుకోవడం లేదు’ అన్నారు.
