చేసిన మొదటి సినిమాకే ఫాలోయింగ్ రావడం అంత ఈజీ కాదు. భాగ్యశ్రీ బోర్సేకు అలాంటి ఫాలోయింగ్ వచ్చింది. మిస్టర్ బచ్చన్ లో ఆమె గ్లామర్‌కు యూత్ ఫిదా అయ్యింది. కమర్షియల్ హీరోయిన్‌కి ఉండాల్సిన అన్ని లక్షణాలు భాగ్యశ్రీలో కనిపించాయి. ఇక తనలోని నటన కాంత సినిమాలో నిరూపించుకునే అవకాశం వచ్చింది. నిజంగా కుమారి పాత్రలో సర్ప్రైజ్ చేసింది.
కుమారి క్యారెక్టర్‌కి వచ్చిన రెస్పాన్స్‌పై ఆనందాన్ని వ్యక్తం చేసింది భాగ్యశ్రీ. “నన్ను నేను నిరూపించుకోవడానికి అవకాశం ఇచ్చిన సినిమా కాంత. ప్రేక్షకులు నా గ్లామర్ మాత్రమే కాదు, యాక్టింగ్‌నే కూడా ఇష్టపడటం చాలా ఆనందంగా ఉంది. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. అనుష్క నా ఫేవరెట్. అరుంధతి లాంటి పాత్రలు నాకు రావాలి” అని కోరుకుంది.
కాంతలో కుమారి గా భాగ్య నటన చూసిన తర్వాత ఆమె యాక్టింగ్ స్కిల్స్‌పై ఉన్న అనుమానాలు తొలిగాయి. అనుష్క కూడా సూపర్ లాంటి యాక్షన్ మాస్ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చింది. అయితే బిగినింగ్‌లోనే ఆమెకు అరుంధతి లాంటి హిట్ దొరికింది. భాగ్యకు ఫాలోయింగ్ ఉంది, యాక్టింగ్‌లో కూడా పాస్ అయ్యింది. అయితే కావాల్సింది హిట్. ఇప్పటివరకు చేసిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ముందు పల్టీ కొట్టేశాయి. ఇండస్ట్రీలో ‘హిట్ హీరోయిన్’ అనిపించుకోవడం చాలా ముఖ్యం. మరా హిట్ ఆంధ్ర కింగ్ తో వస్తుందేమో చూడాలి.

