బుల్లితెర కమెడియన్ సుడిగాలి సుదీర్ హీరో అయ్యాడు. ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ‘గోట్’ అనే సినిమా చేశాడు. తేజ సజ్జాతో అద్భుతం సినిమా తీసిన చంద్రశేఖర్ రెడ్డి ఈ సినిమాకు నిర్మాత. విశ్వక్ తో పాగల్ తీసిన నరేష్ దర్శకుడు. అయితే మధ్యలో నిర్మాత, డైరెక్టర్ కి పొసగలేదు. మొదట చెప్పిన బడ్జెట్ కంటే నాలుగింతలు అయింది గాని ప్రాజెక్టు పూర్తి కావడం లేదు. దీంతో నిర్మాత, డైరెక్టర్ ని తప్పించేశారు. ఎప్పుడైతే డైరెక్టర్ ని తప్పించారో హీరో నుంచి కూడా సహాయ నిరాకరణ మొదలైంది.
ఈ ప్రాజెక్టు నుంచి బయటికి వచ్చిన డైరెక్టర్ సినిమా గురించి సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్లు చేయడం మొదలుపెట్టాడు. ఇటీవలే హీరోయిన్ దివ్యభారతి ని కించపరుస్తూ కొన్ని కామెంట్లు చేయడం ఆమె రియాక్ట్ అవ్వడం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఈ మొత్తం వివాదం వెనుకున్న అసలు కారణాన్ని స్వయంగా హీరోయిన్ చెప్పింది. డైరెక్టర్, హీరో కలిసి తనని బుల్లింగ్ చేసే విధంగా ప్రవర్తించారని స్వయంగా హీరోయిన్ దివ్యభారతి చెప్పింది.
సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ ప్రవర్తన నాకు నచ్చలేదు. చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. దానికి హీరో కూడా ఎప్పుడు ఎదురు సమాధానం చెప్పలేదు. ఆయన ఏం చేస్తున్నా చూసి చూడనట్టుగా ఊరుకున్నారు. సినిమా పూర్తి అయిన తర్వాత కూడా నాకు అనేక రకాలుగా కామెంట్స్ చేశాడు. సుధీర్ ఒక ప్యాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో ఒక ఐటం సాంగ్ ఉంది. నివ్వు చేస్తావా అన్నట్టుగా ఆ యూనిట్ నాకు మెసేజ్ వచ్చింది. ఐటెం సాంగ్ చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ అక్కడ సందర్భం మీరందరూ గమనించాలి. సుధీర్ కూడా బుల్లింగ్ చేస్తున్నట్టుగానే ప్రవర్తిస్తున్నారు. ఇది మంచిది కాదు’ అని చెప్పుకొచ్చింది దివ్యభారతి.
అన్నట్టు..ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది.ఈ ఈవెంట్ కి సుదీర్ రాలేదు. నిర్మాత ఛాంబర్ లో కేసు పెట్టారు. ఛాంబర్ నిర్ణయం ప్రకారం ఈ సినిమా ప్రమోషన్స్ లో సుదీర్ పాల్గొనడం లేనిది తేలుతుంది. ఈ మొత్తం వివాదం చూసుకుంటే డైరెక్టర్ హీరో ఒక జట్టుగా వున్నారు. నిర్మాత కిందమీద పడి ఏదో రకంగా సినిమాని పూర్తి చేసుకున్నారు. సుధీర్ ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటే అదనపు బజ్ వస్తుంది. మరి చాంబర్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.