సంక్రాంతి సీజన్ అనేది రాను రాను.. హాట్ కేక్ అయిపోతోంది. ఏడాది ముందే కర్చీఫ్లు రెడీ చేసుకొంటున్నారు. 2026 సంక్రాంతి సీజన్ ముగిసిందో లేదో.. అప్పుడే 2027 సంక్రాంతి గురించిన ప్రణాళికల్లో పడిపోయారు దర్శక నిర్మాతలు. 2027 సంక్రాంతికి చిరంజీవి – బాబీ సినిమా ఫిక్సయిపోయింది. సంక్రాంతి లక్ష్యంగానే ఈ సినిమా మొదలు పెట్టి, పూర్తి చేయనున్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ సినిమా కూడా సంక్రాంతికే గురి పెట్టింది.
పవన్ కల్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఓ సినిమా రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ఉగాదికి ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది. సంక్రాంతి కి విడుదల చేయాలన్నది ప్లాన్. అందుకు తగ్గట్టుగానే షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. `ఓజీ` తరవాత పవన్ చేయబోయే సినిమా ఇదే. ఇప్పటికే కథ సిద్ధమైంది. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. రామ్ తాళ్లూరి నిర్మాత. చిరు, పవన్ సినిమాలు ఒకే సీజన్లో బరిలో దిగితే మెగా ఫ్యాన్స్ సంబరాలకు అడ్డేముంది? ఇలా.. ఇద్దరి సినిమాలూ ఒకే సీజన్ లో రావడం ఇదే తొలిసారి అవుతుంది. మరోవైపు వెంకటేష్, బాలకృష్ణ సినిమాలు సైతం సంక్రాంతికే గురి పెట్టిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి సినిమా అనగానే సంక్రాంతి స్పెషల్. బాలయ్య కు కూడా సంక్రాంతి సెంటిమెంట్ ఎక్కువ. కాబట్టి ఆయన కూడా తన సినిమాని పొంగల్ బరిలోనే దింపుతున్నారు.
చిరు సినిమాకు సంబంధించిన స్క్రిప్టు పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ చిత్రంలో మోహన్ లాల్ ఓ కీలక పాత్ర పోషించనున్నారు. ప్రియమణి కథానాయిక. మార్చి నుంచి చిత్రీకరణ మొదలయ్యే అవకాశం వుంది
