`క్యాస్టింగ్ కౌచ్`పై లయ మాటేంటి?

`క్యాస్టింగ్ కౌచ్`పై కొత్తగా చెప్పేది ఏముంది? కొన్ని నెలలుగా భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలకు కారణమైంది. ప్రముఖ పత్రికకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో తెలుగమ్మాయి… కథానాయిక లయ స్పందించారు. “అప్పట్లో కూడా క్యాస్టింగ్ కౌచ్ వుండేదని, చిన్నస్థాయిలో జరిగేదని విన్నాను. సాఫ్ట్‌వేర్‌, కార్పొరేట్, హాస్పిటల్… ఇలా అన్ని రంగాల్లో అమ్మాయిలను లోబరుచుకోవాలనుకుంటారు. గ్లామర్ ఫీల్డ్ కాబట్టి సినిమా ఇండస్ట్రీ గురించి ఎక్కువ మాట్లాడుతుతార అనేది“ లయ మాట. సినిమా ఇండస్ట్రీని ఎందుకు టార్గెట్ చేస్తారో నాకు అర్థం కావడం లేదన్నారు.

యూట్యూబ్ మీడియాపై లయ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు హీరోయిన్ బయటకు వెళితే ఎవరు షూట్ చేస్తారో, ఏ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఏమని రాస్తారో తెలియదన్నారు. లయ మాట్లాడుతూ “ఈ మధ్య ఓ ఇంటర్వ్యూ ఇస్తే నా తెలుగు బాలేదని రాశారు. నా మాట తీరే అంత. కొన్నేళ్లు వేరే ప్రాంతంలో వున్నప్పుడు యాస కాస్త మారడం సహజం. అసలు తెలుగు ఎంతమంది స్పష్టంగా మాట్లాడుతున్నారు? ఆడియో, సినిమా ఫంక్షన్లలో ఎంతోమంది ఎన్నో బూతులు మాట్లాడుతున్నారు. వాళ్ళను ఎందుకు నిలదీయరు? అమ్మాయిలంటే అంత లోకువా? ఎంతోమంది అమ్మాయిలను ఇలాగే అల్లరి చేస్తున్నారు. ఫేస్‌బుక్‌లో ఫ్యామిలీ ఫొటో పోస్ట్ చేయాలన్నా భయంగా ఉంటుంది. సోషల్ మీడియా వల్లే ఇదంతా. వ్యక్తిగతంగా ఎవరినీ టార్గెట్ చేయకూడదని నా అభిప్రాయం“ అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలుగు రాష్ట్రాల సీఎంలకు షెకావత్ మళ్లీ మళ్లీ చెబుతున్నారు..!

తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త ప్రాజెక్టుల అంశం కేంద్రానికి చిరాకు తెప్పిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. అపెక్స్ కౌన్సిల్ భేటీ జరిగే వరకూ..కొత్త ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని జలశక్తి మంత్రి...

‘ఈగ’ కాన్సెప్టులో ‘ఆకాశవాణి’?

రాజ‌మౌళి ద‌గ్గ‌ర శిష్యుడిగా ప‌నిచేసిన అశ్విన్ గంగ‌రాజు ఇప్పుడు మెగా ఫోన్ ప‌ట్టాడు. 'ఆకాశ‌వాణి' సినిమాతో. స‌ముద్ర‌ఖ‌ని కీల‌క పాత్ర పోషించిన ఈ చిత్రానికి కీర‌వాణి త‌న‌యుడు కాల‌భైర‌వ సంగీతం అందిస్తున్నారు. ఇటీవ‌లే...

పుస్త‌క రూపంలో ‘పూరీఇజం’

పూరి సినిమాల్లో డైలాగులు ఎంత ప‌వ‌ర్‌ఫుల్ గా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. సూటిగా, గుండెని తాకేలా రాయ‌గ‌ల‌డు. అవ‌న్నీ సినిమాల‌కే ప‌రిమితం కాదు. త‌న జీవ‌న శైలే అలా ఉంటుంది....

పోలీస్ స్టేష‌న్‌లో న‌గ్నంగా `రాడ్‌ గోపాల్ వ‌ర్మ‌`

టాలీవుడ్ లో ఇప్పుడు రెండు ర‌కాల సినిమాలే త‌యార‌వుతున్నాయి. ఓటీటీలో అవే విడుద‌ల అవుతున్నాయి. ఒక‌టి రాంగోపాల్ వ‌ర్మ తీస్తున్న సినిమాలు, రెండోది రాంగోపాల్ వ‌ర్మ‌పై తీస్తున్న సినిమాలు. బ‌యోపిక్‌ల పేరుతో.. వాస్త‌వ...

HOT NEWS

[X] Close
[X] Close