జాతీయ మీడియాలో రవిప్రకాష్ సంతకం “టీవీ 9 భారత్‌వర్ష”

జాతీయ మీడియాలో తనదైన ముద్ర వేసేందుకు టీవీ9 రవిప్రకాష్ సిద్దమయ్యారు. ఓ జాతీయ చానల్‌ను ప్రారంభించబోతున్న తొలి తెలుగు జర్నలిస్ట్‌గా.. చరిత్ర సృష్టించబోతున్నారు. తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో… బుడిబుడి అడుగులతో ప్రారభించిన “టీవీ 9” అంచెలు అంచెలుగా… సంచలనాత్మక రీతిలో ఎదిగింది. ఆరు భాషల ప్రాంతీయ న్యూస్ చానళ్లలో.. ఇప్పుడు “టీవీ 9” గ్రూప్ చానళ్లు నెంబర్ వన్‌గా ఉన్నాయి. రవిప్రకాష్ నేతృత్వంలో.. “టీవీ 9” .. దేశ మీడియా రంగంలో తనదైన ముద్ర వేసింది. ఇప్పుడు జాతీయ మీడియా రంగంలోనూ… కాలు మోపబోతోంది. “టీవీ 9 భారత్‌వర్ష” పేరుతో హిందీ చానల్‌ను ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఆధునాతనమైన ఏఆర్, వీఆర్ టెక్నాలజీని సమకూర్చుని.. వార్తలను… కళ్లకు కట్టినట్లు అందించడానికి… కృషి చేస్తున్నారు.

ఢిల్లీ కేంద్రంగా నడిచే ఈ హిందీ చానల్.. “టీవీ 9 భారత్‌వర్ష”లో ప్రముఖ జర్నలిస్టులను రిక్రూట్ చేసుకున్నారు. ప్రజల ఆసక్తికి అనుగుణంగా వార్తలను అందించడమే… టీవీ 9 గ్రూప్ పెట్టుకున్న ప్రథమ ప్రాధాన్యత. వచ్చే నెల నుంచి.. అన్ని రకాల ఫ్లాట్‌ఫామ్స్‌లో.. “టీవీ 9 భారత్‌వర్ష” ప్రసారాలు లభ్యమవుతాయని.. “టీవీ 9” చానళ్ల యాజమాన్య సంస్థ ఏబీసీఎల్ అధికారికంగా ప్రకటించింది. ప్రాంతీయ భాషల్లాగే హిందీలోనూ ఈ చానల్ సంచనాత్మకమైన ముద్ర వేయబోతోందనే అంచనాలు… మీడియా రంగంలో వస్తున్నాయి. టీవీ 9 గ్రూప్ ఇటీవలి కాలంలో… చేతులు మారింది. తెలుగువారైన ఇద్దరు ప్రముఖ పారిశ్రామికవేత్తలు మెజార్టీ వాటాను… ఏబీసీఎల్ ప్రమోటర్ అయిన శ్రీనిరాజు నుంచి కొనుగోలు చేశారు. అంతకు ముందు నుంచే..”టీవీ 9 భారత్‌వర్ష”కు సంబంధించిన ప్రణాళికలు సిద్ధమైనప్పటికీ.. కొత్త యజమాన్యం కింద… చానల్ ప్రారంభం కాబోతోంది.

“టీవీ 9” బ్రాండ్‌కు .. దేశవ్యాప్తంగా… ఓ గుర్తింపు తీసుకు రావడంలో..ఈ సంస్థ సీఈవో రవిప్రకాష్‌ది పాత్రే ప్రాముఖ్యమైనది. ఇప్పుడు “టీవీ 9 భారత్‌వర్ష” విషయంలోనూ.. మొత్తం ఆయనే చూసుకుంటున్నారు. ఆ చానల్‌ను.. హిందీ చానళ్లలోనూ అగ్రగామిగా తీర్చిదిద్దాలనే పట్టుదలతో ఉన్నారు. ఇప్పటి వరకూ.. జాతీయ మీడియా రంగంలో… దక్షిణాది వారికి పెద్దగా… ప్రాముఖ్యత లేదు. హిందీ భాషతోనే.. ఎక్కువగా జాతీయ మీడియా ముడి పడి ఉండటం.. దక్షిణాదిలో ప్రాంతీయ మీడియా బలంగా ఉండటంతో… ఎవరికీ అక్కడ పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. రామోజీ గ్రూప్… వివిధ ప్రాంతీయ చానళ్లను ప్రారంభించినప‌్పటికీ.. వివిధ కారణాలతో.. వాటిని అమ్ముకోక తప్పలేదు. ఇప్పుడు.. మరో తెలుగు జర్నలిస్ట్.. జాతీయ స్థాయిలో తన ముద్ర వేయడానికి రంగం సిద్దం చేసుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తనను వేరే ఆస్పత్రికి రిఫర్ చేయాలని డాక్టర్ సుధాకర్ లేఖ..!

విశాఖ మానసిక ఆస్పత్రిలో తనకు వాడుతున్న మందులపై అనుమానం వ్యక్తం చేస్తూ.. డాక్టర్ సుధాకర్... ఆ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు సంచలన లేఖ రాశారు. తనకు వాడుతున్న మెడిసిన్స్ వల్ల.. తనకు సైడ్ ఎఫెక్ట్స్...

ప‌ర‌శురామ్ క‌థ మార్చేశాడా?

మ‌హేష్‌బాబు - ప‌ర‌శురామ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతోంది. లాక్ డౌన్ ఎత్తేశాక‌... మ‌హేష్ చేయ‌బోయే సినిమా ఇదే. క‌థ పూర్త‌య్యింది. ఈ సినిమా కోసం `స‌ర్కారు వాటి పాట‌` అనే టైటిల్...

లాక్‌డౌన్ టైమ్‌లో ఫిట్‌నెస్‌ గోల్స్ సాధించిన లోకేష్..!

నారా లోకేష్ లాక్ డౌన్ సమయాన్ని చాలా పకడ్బందీగా ఉపయోగించుకున్నారు. వ్యక్తిగత గోల్స్ సాధించారు. తన బరువును రెండు నెలల్లో కనీసం ఇరవై కిలోల మేర తగ్గించుకున్నారు. మంగళగిరిలోని టీడీపీ ఆఫీసులో మహానాడు...

కన్నా మళ్లీ చంద్రబాబుకు అమ్ముడు పోయారట..!

బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణకు కౌంటర్ ఇచ్చే బాధ్యతను వైసీపీ దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు అప్పగించింది. ఆయన వైసీపీ స్టైల్లో... దూకుడైన ఆరోపణలు.. విమర్శలతో ఎదురుదాడి చేస్తున్నారు. దేవుడి ఆస్తులపై...

HOT NEWS

[X] Close
[X] Close