క‌థానాయిక‌లూ మేల్కొంటున్నారు!

క‌రోనా వ‌ల్ల జ‌న జీవితాలు అత‌లాకుత‌లం అయిపోయాయి. ఈ స‌మ‌యంలో నిరు పేద‌ల‌కు చేయూత నివ్వ‌డానికి సినీ రంగం ముందుకొచ్చింది. ఎవ‌రికి తోచిన రీతిలో వాళ్లు స‌హాయం చేస్తున్నారు. టాప్ హీరోల ద‌గ్గ‌ర్నుంచి, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల వ‌ర‌కూ త‌మ వంతు స‌హాయం అందించారు. అయితే హీరోయిన్లు మాత్రం ముందుకు రాలేదు. టాప్ హీరోయిన్లంతా క‌రోనా స‌హాయం విష‌యంలో మౌనంగా ఉన్నారు. అనుష్క‌, స‌మంత‌, త‌మ‌న్నా… వీళ్లంతా ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి స‌హాయం అందించ‌లేదు. దాంతో క‌థానాయిక‌ల‌కు సామాజిక బాధ్య‌త లేదా? అంటూ విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి. ఇప్పుడు క‌థానాయిక‌లు ఒకొక్క‌రుగా ముందుకొస్తున్నారు. కాస్త ఆల‌స్యంగానైనా స్పందించ‌డం మొద‌లెట్టారు. న‌య‌న‌తార 20 ల‌క్ష‌ల ఆర్థిక స‌హాయం ప్ర‌క‌టించింది. తమిళ సినీ కార్మికుల కోసం ఈ మొత్తం వెచ్చిస్తారు. ఇప్పుడు ర‌కుల్ కూడా ముందుకొచ్చింది. గుర్‌గావ్‌లోని త‌న ఇంటికి స‌మీపాన ఉన్న ఓ మురికివాడ‌లోని నిరు పేద‌ల‌కు ర‌కుల్ భోజ‌న స‌దుపాయం క‌ల్పిస్తోంది. ఈ రోజు నుంచి లాక్ డౌన్ ఎత్తేసే వ‌ర‌కూ అంటే… ఏప్రిల్ 14 వ‌ర‌కూ తాను వాళ్ల‌కు భోజ‌నం అందిస్తాన‌ని మాటిచ్చింది ర‌కుల్‌. వీళ్లంద‌రికంటే ముందు ప్ర‌ణీత రూ.1 ల‌క్ష విత‌ర‌ణ ప్ర‌క‌టించింది. చేతిలో సినిమాలు లేక‌పోయినా.. త‌న‌ని ఇప్పుడు ఎవ్వ‌రూ ప‌ట్టించుకోక‌పోయినా త‌న వంతు బాధ్య‌త‌గా, త‌న‌కు తోచిన స‌హాయం చేసింది ప్ర‌ణీత‌. మ‌రి కోట్ల‌కు కోట్లు సంపాదిస్తున్న స్టార్ హీరోయిన్ల‌కు మాత్రం ఆ మ‌న‌సు రాలేక‌పోయింది. ఇప్పుడైనా వాళ్ల స‌హాయం ప్ర‌క‌టిస్తే అంత‌కంటే కావ‌ల్సిందేముంది?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సుప్రీంకోర్టులోనూ ఏపీ సర్కార్‌కు మళ్లీ “రంగు పడింది”..!

ప్రభుత్వ కార్యాలయాలపై రంగుల విషయంలో ఎక్కడా లేని పట్టుదలకు పోయిన ఏపీ సర్కార్‌కు.. రెండో సారి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. నాలుగు వారాల్లో ప్రభుత్వ కార్యాలయాలపై రంగులు తొలగించకపోతే.. కోర్టు ధిక్కరణ చర్యలు...

డాక్టర్ సుధాకర్‌పైనా సీబీఐ కేసు..!

నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కేసు దర్యాప్తులో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. సీబీఐ ఆయనపైనా కేసు నమోదు చేసింది. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు, బాధ్యత కలిగిన ఓ ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ప్రభుత్వ...

మ‌రో బ‌యోపిక్ మిస్ చేసుకున్న నిత్య‌మీన‌న్‌

ఒక‌ప్పుడు తెలుగు నాట నిత్య‌మీన‌న్ హ‌వా బాగా న‌డిచింది. కాస్త ప్ర‌త్యేక‌మైన క‌థానాయిక పాత్ర‌లు ఆమె చుట్టూ చేరిపోయాయి. గ్లామ‌ర్ మాటెలా ఉన్నా, స‌ర‌దా న‌ట‌న‌తో ఆక‌ట్టుకునేది. అయితే ఇప్పుడు త‌న‌ని అంతా...

ప్ర‌భాస్ సినిమా: దేవుడు Vs సైన్స్‌

ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధాకృష్ణ‌తో ఓ సినిమా చేస్తున్నాడు. 'జాన్‌', 'రాధే శ్యామ్‌' పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. న‌వంబ‌రు నుంచి వైజ‌యంతీ మూవీస్‌కి డేట్లు ఇచ్చాడు. ఈ చిత్రానికి నాగ అశ్విన్ నిర్మాత‌. పాన్...

HOT NEWS

[X] Close
[X] Close