ఫ్లాష్ బ్యాక్‌: వంశీ తొలి పాట అలా పుట్టింది

వంశీ గొప్ప భావ‌కుడు. తెలుగు చిత్ర‌సీమ‌కు ల‌భించిన అరుదైన ద‌ర్శ‌కుడు. వంశీ ఓ మంచి ర‌చ‌యిత కూడా. త‌న క‌థ‌ల్లో సైతం గోదావ‌రి ప్ర‌వ‌హిస్తుంటుంది. వంశీలో ఓ సంగీత ద‌ర్శ‌కుడు కూడా ఉన్నాడు. త‌ను కొన్ని సినిమాల‌కు పాట‌లు కూడా రాశారు. కానీ తొలి సారి పాట కోసం క‌లం ప‌ట్టింది మాత్రం `అనుమానాస్పందం` సినిమాకే. అందులోని `ప్ర‌తిదినం నీ ద‌ర్శ‌నం ఇక దొర‌కునా దొర‌కునా` అనే పాట రాశారు. ఇళ‌య‌రాజా కంపోజిష‌న్ లో వ‌చ్చిన ఆ పాట సూప‌ర్ డూప‌ర్ హిట్‌. ఈ పాట రాయ‌డం వెనుక ఇళ‌య‌రాజా ప్రోత్సాహం, బ‌ల‌వంతం మొండుగా ఉన్నాయి.

‘అనుమానాస్పందం’ చిత్రానికి సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ జ‌రుగుతున్నాయి. అప్పటికి వేటూరి సుందర్రామ్మూర్తిగారు పాటలన్నీ రాసేశారు. ఓ పాట బాకీ ఉంది. ఇంతలో ప్రొడ్యూసర్లు వచ్చి.. ‘ఇప్పటికే పాటలకు బడ్జెట్ ఎక్కువైపోయింది. ఈ ఒక్క పాటకూ కనీసం రూ.50 వేలు తగ్గితే కాస్త బాగుంటుంది’ అన్నారు. ఇదే విష‌యాన్ని ఇళ‌య‌రాజాకి చెప్పారు వంశీ. కానీ అప్ప‌టికే చివ‌రి పాట‌కు సంబంధించిన నోట్స్ ఇళ‌య‌రాజా తయారు చేసేశారు. ట్యూన్ కూడా బాగా వ‌చ్చింది. దాంతో ఈ ట్యూన్‌ని వ‌దులుకోవ‌డం వంశీకి ఇష్టం లేక‌పోయింది. అలాగ‌ని వేటూరికి ఇస్తే… మ‌రో రూ.50 వేలు ఖ‌ర్చ‌వుతాయి. దాంతో ఇళ‌య‌రాజా ఓ స‌ల‌హా ఇచ్చారు. ‘ఈ పాట నువ్వే రాయ్’ అంటూ. వంశీ ద‌గ్గ‌ర ఇళ‌య‌రాజా మాట‌కు తిరుగుండ‌దు. ఖ‌ర్చు త‌గ్గించుకోవాలంటే ఆ పాట తానే రాయాలి. అందుకే కేవ‌లం 45 నిమిషాల్లో ఆ పాట‌ని రాసేశారు వంశీ. ‘గాలి కొండాపురం రైల్వే గేట్’ సినిమా కోసం ఇళ‌య‌రాజా పల్లవులు రాస్తే.. వంశీ చరణాలు రాసి ఓ పాట సిద్ధం చేశారు. ఆ పాట‌ని ల‌తా మంగేష్క‌ర్ పాడారు. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల ఆ సినిమా ఆగిపోయింది. దాంతో పాట‌లూ బ‌య‌ట‌కు రాలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close