దెబ్బ‌తింటున్న హీరోయిన్ల సైడ్ బిజినెస్‌

నాలుగు చేతులా సంపాదించ‌డం ఎలాగో ఈత‌రం క‌థానాయిక‌ల‌కు బాగా తెలుసు. ఓ వైపు సినిమాలు చేస్తూనే, మ‌రోవైపు ఆదాయాన్ని రాబ‌ట్టే అనేక మార్గాల్ని అన్వేషిస్తుంటారు. ఉదాహ‌ర‌ణ‌కు షాపింగ్ మాల్స్ లో సంద‌డి చేయ‌డం లాంటివి. మెట్రో సిటీస్‌లో షాపింగ్ మాల్స్ కి, అందులో జ‌రిగే ఆడంబ‌ర‌మైన వేడుక‌ల‌కు కొద‌వ ఉండ‌దు. ఆర్‌.ఎస్‌.బ్ర‌ద‌ర్స్‌, సౌత్ ఇండియా… ఇలాంటి మాల్స్‌… హైద‌రాబాద్ లో ఏరియాకి ఒక‌టి వెలుస్తుంటుంది. అందులో… హీరోయిన్లు రిబ్బ‌న్ క‌టింగులు చేయ‌డానికి, బోలెడంత ఛార్జ్ చేస్తారు. ఓ అగ్ర హీరోయిన్ షాపింగ్ మాల్ లో అడుగుపెట్ట‌డానికి క‌నీసం 5 నుంచి 7 ల‌క్ష‌ల వ‌ర‌కూ వ‌సూలు చేస్తుంటుంది. ఇదంతా గంట‌లో జ‌రిగే వ్య‌వహారం. ఈ త‌ర‌హా బేరాలు క‌నీసం నెల‌కు నాలుగైనా త‌గిలేవి. సినిమాల్లేక ఖాళీగా ఉన్న‌వాళ్ల‌కు సైతం… నెల‌వారీ ఖ‌ర్చుల‌కు కావ‌ల్సినంత మొత్తం వ‌చ్చేసేది. కనీసం ల‌క్ష రూపాయ‌లు చేతిలో ప‌డితే గానీ, కాంప్లెక్స్‌లో అడుగుపెట్ట‌రెవ‌రూ..! ఒక‌టీ, అరా సినిమా చేస్తే చాలు. ఆ సినిమా హిట్ట‌వ్వ‌క‌పోయినా ఫ‌ర్వాలేదు. ఆ త‌ర‌హా క‌థానాయిక‌లంతా షాపింగ్ మాల్స్ పుణ్య‌మా అని బాగానే సొమ్ము చేసుకోగ‌లిగారు.

అయితే ఇది కరోనా కాలం. మార్కెట్లో స‌రైన బేరాలే లేవు. కొత్త షాపింగ్ మాల్స్ తెరుస్తున్నా – సెల‌బ్రెటీల్ని పిలుచుకుని రిబ్బ‌న్ క‌ట్ చేయించుకునేంత ఓపిక ఎవ‌రికీ ఉండ‌డం లేదు. పైగా… సోష‌ల్ డిస్టెన్స్ పాటించ‌డం ఇప్పుడు అంద‌రి ముందున్న నైతిక బాధ్య‌త‌. సెల‌బ్రెటీలు వ‌స్తున్నారంటే… గుంపులు గుంపులుగా జ‌నం వ‌చ్చిప‌డిపోతారు. వాళ్ల‌ని కంట్రోల్ చేయ‌డం ఎవ‌రి త‌ర‌మూ కాదు. అందుకే… ఈ త‌ర‌హా కార్య‌క్ర‌మాల‌కు స్వ‌స్తి ప‌లికారంతా. పైగా.. సెల‌బ్రెటీలు వ‌చ్చినంత మాత్ర‌న బిజినెస్ పెర‌గ‌ద‌న్న విష‌యం… ఇప్పుడిప్పుడే వాళ్ల‌కూ అర్థ‌మ‌వుతోంది. వాళ్ల కోసం హంగు, ఆర్భాటాల కోసం ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్ట‌డం వృధా ప్ర‌యాస అని తెలిసిపోయింది. అందుకే….ఈ బాప‌తు హంగామాకు చెక్ పెట్టారంతా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మళ్లీ తెలంగాణలో డ్రగ్స్ కేసుల కలకలం !

హైదరాబాద్, సైబరాబాద్‌కు ఇప్పుడు ఉన్న కమిషనర్ల నేరస్తును ఓ ఆట ఆడిస్తున్నారు. సైబరాబాద్ కమిషనర్ సైబర్ ఫ్రాడ్‌ల మీద దృష్టి పెడితే.. హైదరాబాద్ కమిషన్ సీవీ ఆనంద్ డ్రగ్స్ కేసుల్ని వెలికి తీస్తున్నారు....

ఎన్నికల జిమ్మిక్ అనుకున్నా సరే.. ప్రధాని స్టైల్ అదే !

ప్రధానమంత్రి నరేంద్రమోడీ రిపబ్లిక్ డే వేడుకల్లో భిన్నంగా కనిపించారు. భగత్ సింగ్ తరహా టోపీ..  ఓ విభిన్నమైన కండువాతో వేడుకల్లో పాల్గొన్నారు. టోపీపై బ్రహ్మకమలం ముద్ర ఉంది. కాసేపటికే నెటిజన్లు అవి ఎక్కడివో...

అదే నరసింహన్ గవర్నర్ అయితే ఇలా జరిగేదా !?

రిపబ్లిక్ డే రోజున కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానించారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైరయ్యారు. కారణం ఏమిటంటే రాజ్‌భవన్‌లో జరిగే రిపబ్లిక్ డే వేడుక.. జెండా పండుగకు కేసీఆర్ వెళ్లలేదు. కనీసం సీనియర్...

“కొత్త జిల్లాల పని” చేస్తామంటున్న ఉద్యోగ సంఘాలు !

ఉద్యోగులంతా ఉద్యమంలో ఉన్న సమయంలో ప్రజల దృష్టి మరల్చేందుకే కొత్త జిల్లాలంటూ ప్రభుత్వం ప్రకటనలు చేసిందని ఆరోపణలు వస్తున్న సమయంలో ఉద్యోగ సంఘాలు భిన్నంగా స్పందించాయి. ఐఏఎస్‌లు మినహా ఉద్యోగలంతా సమ్మెలోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close