కేటీఆర్‌కు పట్టాభిషేకమా..? కేబినెట్ మార్పుచేర్పులేనా..?

తెలంగాణలో అన్ని రకాల ఎన్నికలు నేటితో పూర్తవుతున్నాయి. మినీ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కూడా జరుగుతోంది. వాటిలోనూ టీఆర్ఎస్ స్వీప్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో కేసీఆర్ భవిష్యత్ రాజకీయాలకు తొలి అడుగును.. ఈటలపై వేటు రూపంలో వేసినట్లుగా కళ్ల ముందు ఉంది. తర్వాత కేసీఆర్ అడుగులేమిటన్నదానిపై టీఆర్ఎ్‌లో చర్చ జరుగుతోంది. మంత్రివర్గ పునర్‌వ్యవస్ధీకరణ అంశానికి సంబంధించి చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు కొత్త చర్చ కూడా ప్రారంభమైంది. కేటీఆర్‌కు పట్టాభిషేకం అంశం మరోసారి తెరపైకి వస్తోంది. కేటీఆర్‌ను సీఎంను చేయడానికే కేసీఆర్ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది.

కొంత మంది మంత్రుల్ని తప్పించి కొత్త వారికి చాన్సిస్తారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది.  దుబ్బాక ఉపఎన్నక, గ్రేటర్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యత మొత్తం ఆయా ప్రాంతాల్లోని మంత్రులదేనని.. గతంలోనే కేసీఆర్ పార్టీ నేతలకు స్పష్టం చేశారు. దుబ్బాక.. గ్రేటర్‌లో మంచి ఫలితాలు రాలేదు. ఆ తర్వాత ఎన్నికల్లో మంచి ఫలితాలొచ్చాయి. ఈటలతోపాటు మరికొంత మంది మంత్రులపైనా గతంలో వ్యతిరేక ప్రచారం జరిగింది. గతంలో కరీంనగర్‌కు చెందిన ఓ మంత్రిపై.. టీఆర్ఎస్ అనుకూల మీడియా విస్తృతమైన కథనాలు ప్రసారం చేసింది. మంత్రి మల్లారెడ్డిపై భూకబ్జా కేసు కూడా నమోదయింది. ఇటీవల ఓ రియల్ ఎస్టేట్ వెంచర్‌లో లంచాలు డిమాండ్ చేసిన ఆడియోవెలుగులోకి వచ్చింది. ఇలా మరో ఇద్దరు.. ముగ్గురు మంత్రులు కేసీఆర్ విశ్వాసాన్ని కోల్పోయారని అంటున్నారు. వారందరికీ… మంత్రి పదవి ఊస్ట్ అనే సూచనలని చెబుతున్నారు.

అయితే ఇప్పుడు అసలు విషయం మంత్రివర్గంలో మార్పు చేర్పులు కాదని.. మొత్తం ..  కేటీఆర్‌కు పట్టాభిషేకం చేసి.. మొత్తం టీంనే మార్చేస్తారని అంటున్నారు . కేటీఆర్ విషయంలో సానుకూలంగా లేని కొంత మంది మంత్రులను కేసీఆర్ అందుకే టార్గెట్ చేసుకున్నారని చెబుతున్నారు. కేటీఆర్ పట్టాభిషేకం అనేది.. కేసీఆర్‌ ఆలోచనల్లో ఎప్పటి నుండో ఉంది. ఆయన సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత బీజేపీ కాస్త బలహీనపడిందేనేప్రచారం జరుగుతూండటం… జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు.. మమతా బెనర్జీతో పాటుగా కీలక పాత్ర పోషించే అవకాశం రావడం.. వంటి కారణాలతో… కేసీఆర్ వేగంగా అడుగులు వేస్తున్నారని అంచనా వేస్తున్నారు.

మొత్తానికి కేసీఆర్ రాజకీయ దురంధరుడు. తాను అనుకున్న పనిని.. అనుకున్నట్లుగా చేస్తారు. ఈ సమయంలో ఈటలపై వేటును అంత కాకతాళీయంగా వేసి ఉండరు. దీని వెనుక అసలు వ్యూహం ఏమిటో.. వేగంగానే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క‌ల్కి.. క‌మ‌ల్.. కంశుడు!

ప్ర‌భాస్ అభిమానులే కాదు, ఇండియ‌న్ సినిమా మొత్తం ఆశ‌గా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్.. 'క‌ల్కి'. ప్ర‌భాస్ తో పాటు అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్ హాస‌న్ లాంటి దిగ్గ‌జాలు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. ప్ర‌భాస్‌,...

దర్శి రివ్యూ : హోరాహోరీ – కానీ బూచేపల్లికి ఎన్నో మైనస్‌లు !

మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన రెండే మున్సిపాలిటీల్లో ఒకటి దర్శి. రెండోది తాడిపత్రి. తాడిపత్రిలోనూ కష్టం మీద గెలిచారు కానీ దర్శిలో మాత్రం టీడీపీ స్వీప్ చేసింది. నిజానికి అక్కడ నాయకుడు...

గత ఎన్నికలలో వైసీపీ కోసం ప్రచారం చేసిన వాళ్లేరి ?

అధికార అహంకారం జగన్మోహన్ రెడ్డిని అందరికీ దూరం చేసింది. తాను ఎవరి సాయంతో అధికారం అందుకున్నారో .. వాళ్లందర్నీ అవమానించి , వేధించడంతో దూరమయ్యారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వైసీపీ...

గాజు గ్లాస్ గందరగోళం : తప్పు ఎవరిది ? నిర్లక్ష్యం ఎవరిది ?

రాజకీయం అంటేనే కుట్రలు, కుతంత్రాల సమాహారం. తాము గెలవాలంటే ప్రత్యర్థి ఓడాలి. అలా చేయాలంటే నేరుగా అయ్యా..బాబూ అని ప్రజల్ని ఓట్లు అడిగితేనే సరిపోదు. ఓట్లు చీల్చాలి.. తప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close