క‌ల్కి.. క‌మ‌ల్.. కంశుడు!

ప్ర‌భాస్ అభిమానులే కాదు, ఇండియ‌న్ సినిమా మొత్తం ఆశ‌గా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్.. ‘క‌ల్కి’. ప్ర‌భాస్ తో పాటు అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్ హాస‌న్ లాంటి దిగ్గ‌జాలు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. ప్ర‌భాస్‌, అమితాబ్ పాత్ర‌ల‌కు సంబంధించిన ఇంట్ర‌డ‌క్ష‌న్ అయిపోయింది. ఆయ‌న అశ్వ‌ద్ధామ‌గా క‌నిపించనున్నారు. ఇక క‌మ‌ల్ హాస‌న్ పాత్ర తీరు తెన్నుల గురించి తెలియాల్సివుంది. క‌మ‌ల్ పాత్ర‌కు సంబంధించిన గ్లింప్స్ కూడా రెడీ అయ్యింది. త్వ‌ర‌లోనే విడుద‌ల చేస్తారు.

‘క‌ల్కి’లో క‌మ‌ల్ పాత్ర ఎలా ఉండ‌బోతోంద‌న్న విష‌యంపై తెలుగు 360 ఓ ఎక్ల్‌క్లూజీవ్ విష‌యాన్ని రాబ‌ట్టింది. ఇందులో క‌మ‌ల్ పాత్ర పురాణాల్లోని కంశుడికి పోలి ఉంటుంద‌ని స‌మాచారం. కంశుడు రాజ్యం కోసం, అధికారం కోసం ఎంత‌టి నీచానికైనా దిగ‌జారిన‌వాడు. త‌న‌కు ప్రాణ గండం ఉంద‌ని తెలిసి, క‌డుపులో ఉన్న బిడ్డ‌ని కూడా చంప‌డానికి వెనుకంజ వేయ‌ని వాడు. క‌మ‌ల్ పాత్ర కంశుడ్ని రిఫ‌రెన్స్‌గా తీసుకొని డిజైన్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఆధునియ యుగంలో.. హిట్ల‌ర్ కూడా అంతేగా. రాజ్య‌కాంక్ష‌తో, అధికార దాహంతో ర‌గిలిపోయే ఓ హిట్ల‌ర్ లాంటి క్యారెక్ట‌రైజేష‌న్ క‌మ‌ల్‌లో క‌నిపించ‌నుంద‌ట‌. ఈ ప్ర‌పంచాన్ని త‌న గుప్పిట్లో ఉంచుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా చేసుకొన్న క్యారెక్ట‌ర్‌లో క‌మ‌ల్ క‌నిపించ‌నున్నార‌ని తెలుస్తోంది. గ్లింప్స్‌లో కూడా ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించే అవ‌కాశం ఉంది. జూన్‌లో `క‌ల్కి` ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ వేస‌విలో విడుద‌ల కాబోతున్న భారీ ప్రాజెక్ట్ ఇదే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భార్యా బాధితులను కామెడీగానే చూస్తున్న సమాజం !

తన భార్య నుండి తనకు , తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకుంటూ ప్రెస్ మీట్ పెట్టారు. హైదరాబాద్ లో ఘటన...

అప్పుడే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోన్న వైసీపీ..!!

ఏపీలో వైసీపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఎన్నికల ఫలితాన్ని ముందుగానే పసిగట్టారో మరేమిటో, అప్పుడే ప్రతిపక్ష పాత్రకు అలవాటుపడుతున్నట్లు కనిపిస్తోంది. అతిశయోక్తి అనిపించినా ఆ పార్టీ నేతలు చేస్తోన్న వరుస వ్యాఖ్యలు...
video

‘గం గం గణేశా’ ట్రైలర్ : నవ్వించే దొంగ

https://www.youtube.com/watch?v=wBZ7EUIM7fY బేబీతో ఓ యూత్ ఫుల్ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ ఇప్పుడు 'గం గం గణేశా' సినిమా తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఇదొక క్రైమ్ కామెడీ. తాజాగా ట్రైలర్ ని వదిలారు....

జగన్ ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేసిన వైవీ సుబ్బారెడ్డి

వైవీ సుబ్బారెడ్డి జగన్ రెండో ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేశారు. విశాఖలో ప్రమాణం చేస్తానని జగనే ప్రకటించారు కాబట్టి ఎక్కడ అనే సందేహం లేదు. తొమ్మిదో తేదీన ప్రమాణం చేస్తారని బొత్స సత్యనారాయణ ఇంతకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close