హిండెన్‌బర్గ్ రిపోర్ట్ దేశంపై దాడేనంటున్న అదానీ !

అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రిపోర్టుపై అదానీ గ్రూప్ చాలా ఆలస్యంగా అయినా ఎదురుదాడి ప్రారంభించింది. తాము వెల్లడించిన విషయాలు తప్పు అయితే తమపై దావా వేయాలని సవాల్ చేస్తున్నా… మూడు, నాలుగు రోజులుగా పైపై వివరణలకే సర్దుకుపోయిన అదానీ గ్రూప్ తాజాగా ఆరు పేజీల వివరణతో ఎదురుదాడి చేసింది. ఇందులో అంతిమంగా చెప్పొచ్చిందేమిటంటే… హిండెన్ బెర్గ్ రిపోర్ట్ దేశంపై దాడి అని చెప్పడమే.

దేశంలో ఓ పద్దతి ప్రకారం.. లెక్క చూసుకుని మరీ దాడి చేస్తున్నారని అదానీ సంస్థ చెబుతోంది. ఇండియా వ్యవస్థల్ని తక్కువ చేయడంతో పాటు భారత్ వృద్ధిని తగ్గించడం లక్ష్యంగా ఈ దాడి జరుగుతోందని విశ్లేషించింది. ఇప్పటి వరకూ దేశంలో ఏం జరిగినా … దేశం కోసం … ధర్మం కోసం అని బీజేపీ జాతీయవాదాన్ని అడ్డు పెట్టుకునేది . ఇప్పుడు ఈ వ్యూహం అదానీ కూడా అందుకుంది. తమపై వస్తున్న ఆరోపణలను దేశంపై దాడిగా చిత్రీకరిస్తోంది.

గతంలో అమెరికాలో కూడా ఎన్నో కంపెనీలు తప్పుడు విధానాలకు పాల్పడి మూతపడ్డాయి. హిండెన్ బర్గ్ రీసెర్చ్ కూడా అలాంటికంపెనీల జాబితాలను వెల్లడించింది. అప్పుడెవరూ ఆ సంస్థ అమెరికాపై దాడి చేసిందని ఎవరూ అనలేదు. కానీ ఇండియాలో ఉన్న అడ్వాంటేజ్ ని అదానీ పక్కాగా ఉపయోగించుకంటున్నారు. అదానీ వ్యాపార సంస్థల లావాదేవీల గురించి ఇండియాలో ప్రతీ ఒక్కరికీ తెలుసు. అది గాలి బుడగ అని ఎప్పుడైనా పేలిపోవచ్చన్న అంచనాలున్నాయి.

కానీ రాజకీయ పరిస్థితులే అదానీ సంస్థల్ని నిలబడుతున్నాయని కార్పొరేట్ వర్గాలు కూడా అంచనా వేస్తాయి. ఇప్పుడు తన సంస్థలు.. లోపాలు.. మోసాలను .. అదానీ మరింత పకడ్బందీ చట్రంలో దాచేసుకుంటున్నారు. అదే జాతీయ వాదం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స‌మంత ఏమైనా దిల్ రాజు కూతురా..?

సినిమాపై ప్యాష‌న్ ఉన్న నిర్మాత దిల్ రాజు. ఓ స‌బ్జెక్ట్ న‌చ్చితే ఎంతైనా ఖ‌ర్చు పెడ‌తారు. గుణ‌శేఖ‌ర్ కూడా అంతే. త‌న క‌ల‌ల చిత్రాన్ని తెర‌పైకి తీసుకురావ‌డానికి ఏం చేయ‌డానికైనా సిద్ద‌మే. అందుకే...

ఈ సారి రాజమండ్రిలో టీడీపీ మహానాడు !

ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అతి పెద్ద సభను నిర్వహించేందుకు సిద్ధమయింది. ఒంగోలు మహానాడు నుంచి ఆ పార్టీలో జోష్ పెరగ్గా ఈ సారి ఎన్నికలకు ముందు రాజమండ్రిలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించుకుంది....

హెచ్‌ఎండీఏ కంటే సీఆర్డీఏ పెద్దది…కానీ : కేటీఆర్

హైదరాబాద్ కంటే అమరావతి పెద్దది. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేసిన హెచ్‌ఎండీఏ కంటే... ఏపీ కొత్త రాజధాని సీఆర్డీఏ విస్తీర్ణం చాలా పెద్దది. ఈ విషయాన్ని స్వయంగా చెప్పింది తెలంగాణ మంత్రి...

అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ కావాలట !

వైఎస్ వివేకానందరెడ్డి కేసులో విచారణ ఎదుర్కొంటున్న కడప వైఎస్ఆర్‌సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనను సీబీఐ అధికారులు అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close