ఏపీ సచివాలయ ఉద్యోగులకే అగ్నిపరీక్షలు – ఫెయిలయితే ?

ఏపీ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల్ని వర్గ శత్రువులుగా భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఏ విభాగ ఉద్యోగికి లేనన్ని ఆంక్షలు పెడుతోంది. నిబంధనలు అమలు చేస్తోంది. సచివాలయ ఉద్యోగాలన్నీ కార్యాలయంలో కూర్చుని చేసేవి కావని తెలిసినా ఇప్పటికే ఫేస్ అటెండెన్స్ అని అదనీ..ఇదనీ ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు.. ప్రజల్ని మెప్పించేలా పని చేయాలని… వారు రాకపోయినా అవసరం లేకపోయినా సేవలు చేయాల్సిందేనని ఒత్తిడి చేస్తోంది. ఇందు కోసం ప్రత్యేకంగా పనితీరు మదింపు చేపట్టింది.

ఏ ఉద్యోగి ఏ సేవ చేశాడు.. ఏ పని చేశాడు అనే లెక్కలు తీస్తోంది. ఇందు కోసం ప్రత్యేక వ్యవస్థను సిద్ధం చేసింది. చాలా సచివాయాలకు జనం రావడం లేదు. ఎలాంటి సేవలు అందించడం లేదు. వచ్చే కొద్ది మందికి సేవలు అందిస్తున్నారు. ఎవరినీ వెనక్కి పంపడం లేదు. అయితే అక్కడ ఉన్న ఉద్యోగులకు.. చేస్తున్న సేవలకు పొంతన లేదని… రోజుకు ఇంత మందికి సేవ చేయాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. రేపు ఎలా పని చేస్తున్నారన్నదాన్ని ఇదే ప్రాతిపదికగా తీసుకోనున్నారు. ఏదో ఓ చర్యతీసుకోవడానికి ఇలాంటివి అవకాశంగా వాడుకుంటారని .. సచివాలయ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

ఇప్పటికే ఉద్యోగులు సరిగా ఆఫీసుకొస్తున్నారా? ఆఫీసు వేళల్లో బయటకు వెళ్తున్నారా? ఇంకేదైనా కార్యక్రమాల కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నారా? అనే విషయాలను తనిఖీ చేసేందుకు ఒక్కో రెవెన్యూ డివిజన్‌కు ఒక్కో స్పెషల్‌ స్క్వాడ్‌ పెట్టారు. ఉద్యోగులను పూర్తిస్థాయిలో తమ అదుపులో పెట్టుకోవడంతోపాటు వారిని ఆత్మరక్షణలోకి నెట్టేందుకు ఇలా చేస్తోందని.. భయ పెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని ఉద్యోగులు భావిస్తున్నారు. ఇప్పటికీ కొన్ని వేల మందికి ప్రొబేషన్ రావాల్సి ఉంది. ఆ ఊసు ప్రభుత్వం ఎత్తడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స‌మంత ఏమైనా దిల్ రాజు కూతురా..?

సినిమాపై ప్యాష‌న్ ఉన్న నిర్మాత దిల్ రాజు. ఓ స‌బ్జెక్ట్ న‌చ్చితే ఎంతైనా ఖ‌ర్చు పెడ‌తారు. గుణ‌శేఖ‌ర్ కూడా అంతే. త‌న క‌ల‌ల చిత్రాన్ని తెర‌పైకి తీసుకురావ‌డానికి ఏం చేయ‌డానికైనా సిద్ద‌మే. అందుకే...

ఈ సారి రాజమండ్రిలో టీడీపీ మహానాడు !

ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అతి పెద్ద సభను నిర్వహించేందుకు సిద్ధమయింది. ఒంగోలు మహానాడు నుంచి ఆ పార్టీలో జోష్ పెరగ్గా ఈ సారి ఎన్నికలకు ముందు రాజమండ్రిలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించుకుంది....

హెచ్‌ఎండీఏ కంటే సీఆర్డీఏ పెద్దది…కానీ : కేటీఆర్

హైదరాబాద్ కంటే అమరావతి పెద్దది. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేసిన హెచ్‌ఎండీఏ కంటే... ఏపీ కొత్త రాజధాని సీఆర్డీఏ విస్తీర్ణం చాలా పెద్దది. ఈ విషయాన్ని స్వయంగా చెప్పింది తెలంగాణ మంత్రి...

అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ కావాలట !

వైఎస్ వివేకానందరెడ్డి కేసులో విచారణ ఎదుర్కొంటున్న కడప వైఎస్ఆర్‌సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనను సీబీఐ అధికారులు అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close