మరో అంతర్జాతీయ సదస్సుకు కేటీఆర్‌కు ఆహ్వానం !

కేటీఆర్ నాయకత్వ లక్షణాలు.. ఆయన విజన్.. చేస్తున్న అభివృద్ధి అంతర్జాతీయంగా పేరు తెచ్చి పెడుతోంది. మరో అంతర్జాతీయ సమావేశాలకు ఆహ్వానం అందింది. అమెరికా హెండర్సన్‌లో జరగనున్న పర్యావరణ-జలవనరుల సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్ నీటి వనరుల సంరక్షణ, పర్యావరణ సమస్యల పరిష్కారంపై కృషి చేస్తోంది. 1852లో ఈ సొసైటీలో 177 దేశాలకు చెందిన సుమారు లక్షా 50 వేలకుపైగా సివిల్ ఇంజినీర్లు సభ్యులుగా ఉన్నారు.

మే 21 నుంచి 25 మధ్య జరిగే మీటింగ్స్‌లో ప్రసంగించాలని అమెరికా సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్ సంస్ధ కోరింది. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు సహా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలపై కేటీఆర్ ప్రసంగించనున్నారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విధివిధానాలపై మంత్రి కేటీఆర్ మాట్లాడనున్నారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పాటు ప్రాజెక్టుల త్వరగా పూర్తి చేశారంటూ తెలంగాణ ప్రభుత్వంపై అమెరికా సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్ ప్రశంసలు కురిపించింది. ప్రాజెక్ట్‌లతో తెలంగాణలో కలిగిన సామాజిక, ఆర్ధిక సమానత్వాన్ని ప్రశంసించింది.

కేటీఆర్ గతంలో కూడా పలు అంతర్జాతీయ సంఘాల నుంచి ప్రసంగించేందుకు ఆహ్వానాలు లభించాయి. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఈ సంఘాలు ఇన్ స్పయిర్ అయి… వాటిని ప్రపంచదేశాలకు .. పరిచయం చేసేందుకు ఆహ్వానిస్తున్నాయి. ఈ అనుభవాలతో ఇతర దేశాలు కూడా తమ విధానాల్లో మార్పు చేర్పులు చేసుకునే అవకాశం ఉంటుంది

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స‌మంత ఏమైనా దిల్ రాజు కూతురా..?

సినిమాపై ప్యాష‌న్ ఉన్న నిర్మాత దిల్ రాజు. ఓ స‌బ్జెక్ట్ న‌చ్చితే ఎంతైనా ఖ‌ర్చు పెడ‌తారు. గుణ‌శేఖ‌ర్ కూడా అంతే. త‌న క‌ల‌ల చిత్రాన్ని తెర‌పైకి తీసుకురావ‌డానికి ఏం చేయ‌డానికైనా సిద్ద‌మే. అందుకే...

ఈ సారి రాజమండ్రిలో టీడీపీ మహానాడు !

ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అతి పెద్ద సభను నిర్వహించేందుకు సిద్ధమయింది. ఒంగోలు మహానాడు నుంచి ఆ పార్టీలో జోష్ పెరగ్గా ఈ సారి ఎన్నికలకు ముందు రాజమండ్రిలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించుకుంది....

హెచ్‌ఎండీఏ కంటే సీఆర్డీఏ పెద్దది…కానీ : కేటీఆర్

హైదరాబాద్ కంటే అమరావతి పెద్దది. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేసిన హెచ్‌ఎండీఏ కంటే... ఏపీ కొత్త రాజధాని సీఆర్డీఏ విస్తీర్ణం చాలా పెద్దది. ఈ విషయాన్ని స్వయంగా చెప్పింది తెలంగాణ మంత్రి...

అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ కావాలట !

వైఎస్ వివేకానందరెడ్డి కేసులో విచారణ ఎదుర్కొంటున్న కడప వైఎస్ఆర్‌సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనను సీబీఐ అధికారులు అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close