ఏపీలో మరో మంత్రికి పాజిటివ్.. ఎప్పట్లానే హైదరాబాద్‌లో చికిత్స..!

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో జాయినయి చికిత్స పొందుతున్నారు. ఏపీలో మంత్రులకు వరుసగా కరోనా సోకుతోంది. మొదటగా డిప్యూటీ సీఎం ఆంజాద్ భాషాకు.. సోకింది. ఆ తర్వాత బాలినేనిని కూడా సోకింది. వీరిద్దరూ హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందారు. అధికారికంగా ప్రకటించకపోయినా వ్యవసాయ మంత్రి కన్నబాబుకు కూడా కరోనా సోకిందన్న ప్రచారం జరుగుతోంది. ఆయన కేబినెట్ భేటీకి హాజరు కాలేదు. అలాగే.. ఇప్పుడు మంత్రి ఆదిమూలపు సురేష్‌కు పాజిటివ్‌గా తేలింది. ఆయన లైట్ సింప్టమ్స్ ఉండటంతో కరోనా టెస్టు చేయించుకున్నారు. పాజిటివ్‌గా తేలడంతో చికిత్సకోసం హైదరాబాద్ వెళ్లారు.

ఓ వైపు వచ్చే నెల ఐదో తేదీ నుంచి బడులు ఎట్టి పరిస్థితుల్లో తెరవాలని సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎప్పుడో ఓ చోట కరోనాను అధిగమించి పనులు ప్రారంభించాల్సి ఉందని.. ఇప్పటికే నాలుగు నెలల విద్యాసంవత్సరం వృధా అయిందని కేబినెట్ భేటీలో వ్యాఖ్యానించారు. స్కూళ్లు ప్రారంభమయ్యే నాటికి నాడు – నేడు పనులతో పాటు పిల్లలకు ఇవ్వాల్సిన విద్యా కిట్‌ను రెడీ చేస్తున్నారు. అయితే ఏపీలో కరోనా పరిస్థితి ప్రమాదకరంగా ఉంది.రోజుకు పదివేల వరకూ కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో… స్కూళ్లు తెరవడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వం కూడా విద్యాసంస్థల ప్రారంభం పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చిన్నారుల ఆరోగ్యంపై ఎక్కువ ఆలోచించాల్సి ఉంటుంది. అందుకే.. కాలేజీలు ప్రారంభించినా.. స్కూళ్లు ప్రారంభిస్తారా లేదా అన్న దానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ లోపే.. నేరుగా విద్యామంత్రికే కరోనా సోకింది. ఓ వైపు అందరూ… కరోనా కోసం హైదరాబాద్‌కు పరుగులు పెట్టడం..మరో వైపు.. అందరికీ కరోనా వస్తుందన్న ప్రభుత్వ పాలసీ ప్రకారం.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూండటం.. ఏపీ సర్కార్ పై విమర్శలు పెరగడానికి కారణంఅవుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లోకేష్ యువగళం – మరో సారి బ్లాక్ బస్టర్ !

నారా లోకేష్ మంగళగిరిలో సైలెంట్ గా ప్రచారం చేసుకుంటే .. నారా లోకేష్ ఎక్కడ అని వైసీపీ నేతలు ఆరా తీస్తూ ఉంటారు. నారా లోకేష్ బయటకు వస్తే ప్రచారం ప్రారంభిస్తే...

ట్యాపింగ్ కేసులో కీలక పత్రాలు బయటపెట్టిన బండి సంజయ్ – ఎలా ?

ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరును రాధాకిషన్ రావు అనేక సార్లు చెప్పినప్పటికీ ఆయన కోసమే తాము ట్యాపింగ్ చేశామని నిర్దారించినప్పటికీ కేసీఆర్ కు ఇంత వరకూ నోటీసులు ఇవ్వకపోవడానికి కారణం ఏమిటని...

మీడియా వాచ్ : “స్టడీ”గా రవిప్రకాష్ ఈజ్ బ్యాక్ !

సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ చాలా వస్తాయి. కానీ స్టడీలు మాత్రం కొన్నే ఉంటాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో రవిప్రకాష్ స్టడీ హాట్ టాపిక్ అవుతోంది. RTV స్టడీ...

వృద్ధుల ప్రాణాలతో రాజకీయం – ఇంత క్రూరమా ?

ఏపీ ప్రభుత్వానికి వృద్ధులను ఎంత హింసిస్తే అంత మంచి రాజకీయం అనుకుంటున్నారు. వాళ్లు ఎంత బాధపడితే అంతగా చంద్రబాబును తిట్టుకుంటారని ఊహించుకుంటూ వాళ్లను రాచి రంపాన పెడుతున్నారు. ఇంటింటికి పంపిణీ చేసేందుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close