కాషాయ కండువా కప్పుకున్న ఆదినారాయణరెడ్డి..!

మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరిపోయారు. కొంత కాలంగా ఆయన బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. టీడీపీలో ఉన్న సమయంలో సీఎం రమేష్‌కు, ఆదినారాయణరెడ్డికి పడేది కాదు. ముందుగానే సీఎం రమేష్ బీజేపీలో చేరిపోయారు. దాంతో… ఆయనే ఆదినారాయణరెడ్డి బీజేపీలోకి రాకుండా అడ్డుకుంటున్నారని… అందుకే ఆలస్యం అవుతుందని చెప్పుకున్నారు. అనూహ్యంగా చడీచప్పుడు లేకుండా ఆదినారాయణ.. ఢిల్లీ వెళ్లిపోయి… బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా తో కండువా కప్పించేసుకున్నారు. గతంలో హైదరాబాద్ పర్యటనకు వచ్చిన నడ్డాను.. ఆదినారాయణరెడ్డి కలిశారు. పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపించారు. అప్పుడే చేరిక ఖరారయింది. సీఎం రమేష్ లాంటి నేతల అభ్యంతరాలతో కొంత కాలం వాయిదా పడింది.

కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో.. ఆదినారాయణరెడ్డి బలమైన నేతగా ఉన్నారు. అక్కడ పార్టీల కన్నా.. వర్గాలకే అత్యధిక ప్రాధాన్యం ఉంటుంది. ఓ వైపు ఆదినారాయణరెడ్డి, మరో వైపు రామసుబ్బారెడ్డి రెండు పార్టీల తరపున హోరాహోరీగా తలపడేవారు. అయితే.. మొన్నటి ఎన్నికల్లో ఇద్దరూ కలిసిపోయారు. అయినప్పటికీ… ఇద్దరికీ చేదు అనుభవమే ఎదురయింది. అది కూడా… ఇద్దరూ కలిసినా వైసీపీకి యాభై వేల ఓట్లకుపైగా మెజార్టీ వచ్చింది. ఈ క్రమంలో.. వైసీపీ ప్రభుత్వం నుంచి… ఆదినారాయణరెడ్డికి సెగ ప్రారంభమయిందని చెబుతున్నారు. అనుచరులపై దాడులు.. ఇతర కేసుల వ్యవహారంలో.. అంతకంతకూ ఒత్తిడి పెరిగిపోతూండటంతో.. రక్షణ కోసమైనా.. బీజేపీ వైపు చూడక తప్పలేదని ఆయన అనుచరులు చెబుతున్నారు.

భారతీయ జనతా పార్టీ కూడా.. రాయలసీమపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. వైసీపీని ఎదుర్కోవాలంటే… రక్షణ కావాల్సిందేనని.. ఆ రక్షణ తామిస్తామని.. టీడీపీ నేతలకు అభయమిస్తున్నారు. ఇప్పటికే ధర్మవరం టీడీపీ నేత గోనుగుంట్ల సూర్యనారాయణ అలియాస్ వరదాపురం సూరి బీజేపీ గూటికి చేరి.. ఊపిరి పీల్చుకున్నారు ఇప్పుడు.. ఆదినారాయణ రెడ్డి కూడా.. చేరారు. మరికొంత మంది నేతలతోనూ… బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బాల‌కృష్ణ‌తో నాకు శ‌త్రుత్వం లేదు: నాగ‌బాబు

టాలీవుడ్ Vs నంద‌మూరి బాల‌కృష్ణ కాస్తా.. నాగ‌బాబు Vs బాల‌కృష్ణ‌గా మారింది. బాల‌య్య బాబు నోరు జార‌డం ఏమో గానీ.. వెంట‌నే వాటిపై ఘాటు వ్యాఖ్య‌లు చేస్తూ.. కామెంట్లు...

టాలీవుడ్‌లో బాలకృష్ణ మాటల మంటలు..!

షూటింగ్‌లు ఎప్పుడు ప్రారంభించాలన్నదానిపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో చిరంజీవి నేతృత్వంలో బృందం సమావేశం కావడంపై.. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. షూటింగ్‌లు ఎప్పుడు ప్రారంభించాలా టాలీవుడ్ పెద్దలు..తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు...

కేంద్రం ఏపీపై ఆధారపడినప్పుడు ప్రత్యేక హోదా : జగన్

అప్పు రేపు.. తరహాలో ప్రత్యేకహోదా రేపు అంటున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా గతంలో ఆయన "హోదా యోధ"గా స్వయం ప్రకటితంగా చేసుకున్న పోరాటం ఏమయిందని.. ప్రజలు...

శ్రీవారి ఆస్తులు అమ్మేదిలేదని టీటీడీ బోర్డు తీర్మానం..!

శ్రీవారికి భక్తులు కానుకగా ఇచ్చిన వాటిని అమ్మే ప్రసక్తే లేదని... తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తాజాగా ప్రకటించింది. ఈ మేరకు పాలకమండలి భేటీలో నిర్ణయం తీసుకున్నారు. శ్రీవారి ఆస్తుల అమ్మకాన్ని పూర్తిగా...

HOT NEWS

[X] Close
[X] Close