ఇండ్ర‌స్ట్రీని న‌డిపించాల్సిన పెద్ద దిక్కు ఎవ‌రు?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌ని నిర్వ‌హిస్తున్న తీరు, అందులో గొడ‌వ‌లు, అవ‌న్నీ మీడియాకు ఎక్కుతున్న వైనం.. ఇవ‌న్నీ టాలీవుడ్‌ని విస్మ‌య ప‌రుస్తున్నాయి. ‘మా’లో ఇది వ‌ర‌కూ గొడ‌వ‌లుండేవి. కానీ అవి నాలుగు గోడ‌ల‌కే ప‌రిమితం. ఎప్పుడూ ఏదీ బ‌య‌ట‌కు ఎక్క‌లేదు. ఇప్పుడు అలా కాదు. చిన్న విష‌యానికే… గొంతులు చించుకుంటున్నారు. మీడియాకు దొరికేస్తున్నారు. కేవ‌లం ఏడొంద‌ల మంది స‌భ్యులున్న ఈ సంఘం… ఒక్క తాటిపై లేద‌న్న విషయాన్ని ప‌దే ప‌దే… బ‌లంగా చెప్పాల‌నే ప్ర‌య‌త్నం మ‌రింత బ‌లంగా చేస్తున్నారు.

ఇది వ‌ర‌కు ‘మా’లో ఏ గొడ‌వొచ్చినా – పెద్ద‌లు అప్ప‌టిక‌ప్పుడు ఓ నిర్ణ‌యం తీసుకుని సెటిల్ చేసేసేవారు. అస‌లు ఏం జ‌రిగింద‌న్న విష‌యం మూడో కంటికి తెలిసేది కాదు. ముఖ్యంగా దాస‌రి హ‌యాంలో ఇలాంటి ఏ గొడ‌వా బ‌య‌ట‌కు పొక్కేది కాదు. ‘మా’ కమిటీలో ఓ విష‌యంపై నిర్ణ‌యానికి రాలేక‌పోతే… దాస‌రి ఇల్లు దానికి ప‌రిష్కార మార్గం చూపించేది. ఎవ‌రైనా ‘మా’ ఆంత‌రంగిక వ్య‌వ‌హారాల్ని మీడియాకు లీక్ చేస్తే… వాళ్ల‌ని దాస‌రి గ‌ట్టిగా మంద‌లించేవారు. దాస‌రికి భ‌య‌ప‌డి, ఎవ్వ‌రూ ఒక్క అడుగు కూడా ముందుకు వేసేవారు కాదు. ఇప్పుడు ఆయ‌న లేరు. ‘మా’ విష‌యాల్ని పెద్ద‌లెవ్వ‌రూ సీరియ‌స్‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. కొంత‌మందికి అధికారం చేతుల్లోకి రాగానే కోతికి కొబ్బ‌రికాయ దొరికినంత హ‌డావుడి చేస్తున్నారు. ఇంకొంత‌మంది `మా`లో ఏం జ‌రుగుతున్నా మీడియాకు ర‌హ‌స్యంగా లీక్ చేయాల‌ని చూస్తున్నారు. దాంతో… వ్య‌వ‌హారాల‌న్నీ రోడ్డుకెక్కుతున్నాయి.

చిరంజీవి, నాగార్జున‌, మోహ‌న్‌బాబు… వీళ్లంతా ‘మా’ని న‌డిపించిన‌వాళ్లే. ‘మా’లో ప్ర‌స్తుతం ఏం జ‌రుగుతోంద‌న్న విష‌యం వాళ్లకు తెలుసు. ఎవ‌రి వ‌ల్ల ఇదంతా జ‌రుగుతుందో, ‘మా’ నిధులు ఎలా దుర్వినియోగం అవుతున్నాయో, ఎవ‌రు ఇష్టం వ‌చ్చిన‌ట్టు నిర్ణ‌యాలు తీసుకుంటున్నారో.. ఇవ‌న్నీ బ‌హిరంగ ర‌హ‌స్యాలు. ఇలాంట‌ప్పుడు సినీ పెద్ద‌లు మౌనంగా ఉండ‌డం మంచిది కాదు. ‘మా’ అనేది వ్య‌క్తులు స‌మూమ‌మే కావొచ్చు. కానీ దాని వెనుక‌.. చిత్ర‌సీమ ప‌రువు, ప్ర‌తిష్ట‌లు ముడిప‌డి ఉన్నాయి. `మా`లో గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయ‌న్న విష‌యం తెలియ‌గానే, స‌ర్దుబాటు చేయ‌డానికి ప్ర‌య‌త్నించాల్సింది. కానీ ఆల‌స్య‌మైపోయింది. ఇప్ప‌టికైనా మించిపోయిందేం లేదు. రోడ్డుకెక్కి ఒక‌రిపై ఒక‌రు దూష‌ణ‌ల ప‌ర్వానికి దిగ‌క‌ముందే.. సినిమా పెద్ద‌లు కాస్త స్పందించాలి. ‘మా’ ప‌రువుని, చిత్ర‌సీమ ప్ర‌తిష్ట‌ని నిలబెట్టేందుకు న‌డుం క‌ట్టాలి. లేదంటే.. భారీ మూల్యం చెల్లించ‌క త‌ప్ప‌దు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా...మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close