పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో ముష్కరమూకల స్థావరాలపై భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్ పై పాకిస్థాన్ ఎందుకు ఉలిక్కిపడుతుంది? పాక్ ప్రజలు ఎందుకు విమర్శలు చేస్తున్నారు? అని ప్రశ్నిస్తున్నాడు సింగర్ అద్నాన్ సమీ! ఇప్పటికే భారత్ సైన్యం సాహసానికి, మోడీ నిర్ణయానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంజల జల్లులు కురుస్తోన్న నేపథ్యంలో బై బర్త్ పాకీస్థానీ అయిన సింగర్ అద్నాన్ సమీ స్పందించాడు.. తన ట్వీట్లతో పాక్ కు షాకిచ్చినంత పనిచేశాడు.
ప్రస్తుతం ప్రపంచం అంతా పాక్ పై భారత్ చేసిన సర్జికల్ స్ట్రయిక్స్ గురించే మాట్లాడుతోన్న క్రమంలో… భారత ప్రధాని మోడీకి, సైన్యానికి కంగ్రాట్స్ చెప్పాడు అద్నాన్ సమీ. పూర్తి పరిపక్వతతోనూ, సాహసంతోనూ, ఇంటిలిజెన్స్ తోనూ ఉగ్రవాదులపై సకెస్ ఫుల్ గా ఈ సర్జికల్ స్ట్రైక్ చేశారని పొగడ్తతలో ముంచెత్తే ప్రయత్నం చేశాడు. అయితే ఈ విషయాలపై పాకిస్థానీలు తీవ్రంగా స్పందిస్తున్నారు. అద్నాన్ పై విమర్శలు చేస్తున్నారు.
ఈ క్రమంలో తనపై విమర్శలు చేస్తున్న పాకీస్థానీలపై అద్నాన్ స్పందించాడు. “నా ట్వీట్లపై పాకీస్థానీలు తీవ్రంగా స్పందిస్తున్నారు… ఇలా అనాలోచితంగా తనపై విమర్శలు చేయడం ద్వారా పాకిస్థాన్ – టెర్రరిజం రెండూ ఒకటే అనే భావన ఇస్తున్నారు” అని లాజికల్ క్లారిటీ ఇచ్చాడు అధాన్ సమీ. కాగా పుట్టుకతో పాక్ దేశస్థుడైన అద్నాన్, సింగర్ గా ఘనవిజయాలు సాధించింది మాత్రం భారత్ లోనే! అందుకో ఏమో కానీ భారత పౌరసత్వం తీసుకున్న అద్నాన్, ఇక ఇక్కడే సెటిల్ అయ్యాడు.