ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే వరకూ రమేష్‌కుమార్ బాధ్యతలు తీసుకోకూడదట..!

స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్ బాధ్యతలు తీసుకున్నట్లుగా ప్రకటించుకుని.. సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం చట్ట విరుద్ధమని తాజాగా ఏపీ ప్రభుత్వం వాదన వినిపించడం ప్రారంభించింది. సోమవారం.. ఎస్‌ఈసీగా రమేష్ కుమార్ బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే.. ఆయనను బాధ్యతలు స్వీకరించకుండా ఆపాలనుకున్న ప్రభుత్వం కొత్త వ్యూహంతో ముందుకొచ్చింది. అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం శ్రీరాంను.. మీడియా ముందుకు తీసుకు వచ్చారు. పంచాయతీరాజ్ సెక్రటరీ ద్వివేదీ, సీఎంవోలో కీలక అధికారిగా చక్రం తిప్పుతున్న ప్రవీణ్ ప్రకాష్ చెరో వైపు కూర్చోగా.. ప్రభుత్వ ఏజీ.. ఎస్‌ఈసీ రమేష్ కుమార్ బాధ్యతలు తీసుకోవడం చట్ట విరుద్ధమనే వాదన వినిపించారు. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వానికి అప్పీల్ చేసుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది. అందుకే.. సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే వరకూ.. తీర్పుపై స్టే ఇవ్వాలని కోరామని.. ఆ పత్రాన్ని రమేష్ కుమార్ కి కూడా పంపామని.. ఏజీ చెప్పుకొచ్చారు.

హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఎస్‌ఈసీగా రమేష్ కుమార్ తొలగింపునకు సంబంధించిన ఆర్డినెన్స్ ను కొట్టి వేసింది. ఆ ఆర్డినెన్స్ దన్నుతో విడుదల చేసిన జీవోలనూ కొట్టి వేసింది. అంటే.. రమేష్ కుమార్ పదవిలో ఉన్నట్లే లెక్క. అదే విషయాన్ని బీజేపీ తరపున పిటిషన్ వేసిన కామినేని శ్రీనివాస్ తరపున వాదించిన జంధ్యాల రవిశంకర్ స్పష్టం చేశారు కూడా. అసలు రమేష్ కుమార్ ఎస్‌ఈసీ పోస్టే పోనప్పుడు.. ఆయనను పునర్‌నియమించడం అనే ప్రస్తావనే రాదన్న అభిప్రాయం న్యాయనిపుణుల్లో ఉంది. అయితే.. ఇప్పుడు.. ఆయన పదవి చేపట్టడానికి వీల్లేదని.. అడ్వకేట్ జనరల్ వాదిస్తూ మీడియా ముందుకు వచ్చారు. హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత తనంతట తాను ఆయన బాధ్యతలు చేపట్టినట్లుగా ప్రకటించారని.. ఇది చట్ట విరుద్ధమని ఆయన అంటున్నారు.

నిజానికి హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు స్టే ఇస్తే మాత్రమే.. తీర్పు అమలు ఆగుతుంది. లేకపోతే.. ఆ తీర్పు చెల్లుతుంది. ప్రస్తుతం.. రాష్ట్ర ప్రభుత్వం కనీసం.. సుప్రీంకోర్టులో.. స్టే కోసం పిటిషన్ కూడా వేయలేదు. అయినా సరే.. తీర్పు అమలు పై స్టే ఇవ్వాలని కోరుతూ.. లేఖ రాశామని.. అందుకే.. రమేష్ కుమార్ బాధ్యతలు తీసుకోవద్దని.. ఏజీ వాదించడం.. న్యాయవర్గాలను సైతం విస్మయ పరుస్తోంది. హైకోర్టు తీర్పు విషయంలోనే స్వయంగా ఏజీ కొత్తకొత్త అర్థాలు చెబుతూండటం..తాను అదే అంశాన్ని న్యాయ సలహాగా ప్రభుత్వానికి చెప్పానని చెబుతూండటం.. మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close