హైకోర్టు తీర్పుకే వక్రభాష్యం..! ప్రభుత్వం తప్పు మీద తప్పు చేస్తోందా..?

నిమ్మగడ్డ రమేష్‌కుమార్ విషయంలో ప్రభుత్వం తప్పు మీద తప్పు చేస్తోందా.. అన్న అభిప్రాయం న్యాయనిపుణుల్లో వినిపిస్తోంది. ఇప్పటి వరకూ వివిధ కేసుల్లో హైకోర్టు తీర్పును అమలు చేయకుండా.. దొడ్డిదారి ప్రయత్నాలు చేశారు… కానీ మొదటి సారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో నేరుగా హైకోర్టు తీర్పునకే వక్రభాష్యం చెప్పి.. ఆయన కొనసాగింపు చెల్లదని డిక్లేర్ చేసి.. ఆయనను బాధ్యతలు తీసుకోకుండా.. కొత్త వివాదం సృష్టించేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా… హైకోర్టు తీర్పుపై ఓ అడ్వకేట్ జనరల్ ప్రెస్‌మీట్ పెట్టారు. తాను ఫలానా న్యాయసలహా ఇచ్చానని చెప్పారు. ఆ తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతలు తీసుకున్నట్లుగా వచ్చిన సర్క్యూలర్‌ను ప్రభుత్వం వెనక్కి తీసుకున్నట్లుగా ప్రకటించింది. అంతా ఓ వ్యూహం ప్రకారం జరిగిందన్న చర్చ జరుగుతోంది.

తొలగింపు జీవో చెల్లనప్పుడు రమేష్‌కుమార్ పదవిలో ఉన్నట్లే కదా..!?

నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను పునర్నియమించలేదనే వాదన ప్రభుత్వం తెరపైకి తెస్తోంది. అ‌డ్వకేట్ జనరల్ కూడా అదే చెబుతున్నారు. అసలు ఆయన పదవి కోల్పోతే కదా.. మళ్లీ నియమించడానకి అనే మౌలికమైన సందేహం.. న్యాయనిపుణుల నుంచి వస్తోంది. ఆయనను తొలగించేలా తీసుకు వచ్చిన ఆర్డినెన్స్.. దానికి సంబంధించిన జీవోలను హైకోర్టు కొట్టి వేసింది. చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. అందులో ఆయన పదవీ కాలం ముగిసిందని ఇచ్చిన జీవో కూడా ఉంది. అంటే.. ఆయన పదవిలో కొనసాగుతున్నట్లే అవుతుంది. ఈ విషయం తెలియడానికి న్యాయశాస్త్రంలో నిపుణులు కూడా కానక్కర్లేదు.. కాస్త కామన్‌సెన్స్ ఉంటే చాలని అంటున్నారు. అయితే.. ఏజీ మాత్రం ఎప్పుడూ లేని విధంగా ప్రెస్‌మీట్ పెట్టి… ఆయన ఆదేశాలు జారీ చేయడం చెల్లదని న్యాయసలహా ఇచ్చినట్లుగా ప్రకటించేశారు.

తీర్పుపై స్టే తెచ్చుకుని నిమ్మగడ్డను ఆపకుండా తీర్పునకే వక్రభాష్యం ఎందుకు..?

హైకోర్టు ఇచ్చిన తీర్పు స్పష్టంగా ఉంది. సుప్రీంకోర్టుకు వెళ్లినా.. ప్రభుత్వానికి ఊరట దక్కదని.. ఇక్కడితో ఈ వివాదం ముగిస్తే.. మంచిదని పలువురు నిపుణులు ప్రభుత్వానికి సలహాలు కూడా ఇచ్చారు. అయితే.. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలనే నిర్ణయించుకుంది. శరవేగంగా వెళ్లి స్టే తెచ్చుకుంటే.. ఈ వివాదానికి ఆస్కారం ఉండేది కాదు. కానీ.. అటు హైకోర్టు అవకాశం ఇవ్వకుండా.. ఇటు సుప్రీంకోర్టులో స్టే తెచ్చుకోకుండా.. తీర్పునకు వక్రభాష్యం చెప్పి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి చేపట్టకుండా చేయడం వల్లనే విమర్శలు ఎదురవుతున్నాయి. తెలిసి మరీ కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

“న్యాయసలహా” వ్యూహంతో ప్రభుత్వానికి కోర్టు ధిక్కరణ భయం లేకుండా వ్యూహం ..!?

అయితే ఈ విషయంలో.. ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను బాధ్యతలు చేపట్టకుండా ఆపడంపై తర్వాత హైకోర్టు కోర్టు ధిక్కరణగా పరిగణించే అవకాశం ఉంది. అందుకే.. తమ తప్పేమీ లేదని ప్రభుత్వం వాదించేందుకు.. “న్యాయసలహా” పేరుతో కొత్త వ్యూహంలో వెళ్తోంది. ఆయన విధులు చేపట్టడం చట్ట విరుద్ధమని.. తాను న్యాయసలహా ఇచ్చానని.. స్వయంగా ఏజీ మీడియాకు చెప్పారు. న్యాయసలహా మేరకే నిమ్మగడ్డను అడ్డుకున్నామని.. తమకేం సంబంధం లేదని.. ప్రభుత్వం కోర్టులో వాదించే అవకాశం ఉంది. ఏం జరిగినా.. అది ఏజీ భరించాల్సి ఉంటుంది. హైకోర్టు ఆగ్రహం ప్రభుత్వం వైపు రాకుండా.. జాగ్రత్తలు తీసుకున్నారన్నమాట. అంటే.. కోర్టుధిక్కరణ అవుతుందని తెలిసి మరీ.. కొత్త రాజకీయం నడుపుతున్నట్లు భావించాల్సి వస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏడున్న‌ర ఎక‌రాల్లో అల్లు స్టూడియోస్‌

తెలుగు చిత్ర‌సీమ‌కు స్టూడియోల కొద‌వ లేదు. అన్న‌పూర్ణ, రామానాయుడు, ప‌ద్మాల‌యా, సార‌ధి.. ఇలా హైద‌రాబాద్ న‌గ‌రంలోనే నాలుగు స్టూడియోలున్నాయి. ఇక రామోజీ ఫిల్మ్ సిటీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. దాదాపు స‌గం షూటింగులు...

టీడీపీ పొలిట్ బ్యూరో పదవికి గల్లా రాజీనామా..! అసంతృప్తేనా..?

తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యురాలి పదవికి గల్లా అరుణ కుమారి రాజీనామా చేశారు. లేఖను చంద్రబాబుకు పంపారు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో సంస్థాగత...

గంటా కూడా కుమారుడికే వైసీపీ కండువా కప్పించబోతున్నారు..!

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమయింది. గతంలో చాలా సార్లు ముహుర్తం పెట్టుకున్నారు కానీ... వైసీపీ నేతల్ని బుజ్జగించడం ఆలస్యమయింది. వారం రోజుల్లోఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని...

నితిన్‌కి ‘చెక్’ పెట్టేశారు

నితిన్ - చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి కాంబినేష‌న్ లో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. ర‌కుల్‌, ప్రియా వారియ‌ర్ క‌థానాయిక‌లు. ఈ సినిమాకి `చెక్‌` అనే టైటిల్ పెట్ట‌నున్నార‌ని ముందు నుంచీ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్పుడు...

HOT NEWS

[X] Close
[X] Close