మళ్లీ మోదీతో భేటీకి చంద్రబాబుకు ఆహ్వానం !

ఓ సారి చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అందరితో కలిసి మోదీతో ఓ సమావేశంలో పాల్గొంటే.. ఇప్పటికీ పొత్తుల చర్చలను విశ్లేషకులు చేస్తూనే ఉన్నారు. మరోసారి చంద్రబాబుకు మోదీ నుంచి ఆహ్వానం అందింది. ఈ సారి మరో కీలకమైన అంశంపై సలహాలు, సూచనలు తీసుకు రావాలని చంద్రబాబును కోరారు. జీ-20 దేశాల కూటమికి భారతదేశం అధ్యక్షత వహించే అవకాశం భారత్‌కు లభించింది. ప్రపంచంలో మన దేశం తనదైన ముద్ర వేసేలా.. ఈ కూటమి నేతృత్వం ఉండాలని మోదీ అనుకుంటున్నారు.

అందుకే ఈ సదస్సు నిర్వహణపై రాజకీయ పార్టీల అధ్యక్షులతో ప్రధాని మోడీ చర్చించి.. సలహాలు తీసుకోనున్నారు. డిసెంబర్ 5న రాష్ట్రపతి భవన్‌లో సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి ప్రహ్లాద్ జోషి చంద్రబాబుకు ఆహ్వానం పంపడమే కాదు.. స్వయంగా ఫోన్ చేశారు. చంద్రబాబు కూడా అంగీకరించారు. అయితే ప్రధానమంత్రితో సమావేశానికి ఏపీ ప్రతిపక్ష నేతకు పిలుపు అంటే.. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరమైన చర్యలు కూడా సాగుతాయి. ఎదుకంటే ఏపీలో రాజకీయాలు డైనమిక్‌గా మారిపోతున్నాయి. పొత్తుల గురించి చర్చలు నడుస్తున్నాయి. అందుకే.. సమావేశం కూడా హాట్ టాపిక్ అయ్యే అవకాశం ఉంది.

2014లో ఎన్డీఏలో టీడీపీ ఉంది. 2018లో బయటకు వచ్చింది. ఆ తర్వాత మోదీని చంద్రబాబు ఒక్క సారిగా మాత్రమే కలిశారు. అది కూడా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సమావేశంలో మాత్రమే కలిశారు. తాజాగా మరోసారి ప్రధాని సమావేశానికి చంద్రబాబు హాజరు కానుండటంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశం ఉత్కంఠ రేపుతోంది. గతంలో చంద్రబాబుతో మాట్లాడటానికి మోదీ ఆసక్తి చూపేవారు కాదు.. కరోనా సమయంలో అన్ని రాజకీయ పార్టీల నేతలతో మాట్లాడారు కానీ.. చంద్రబాబుతో మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మాత్రం.. కీలకమైన అంశాల్లో చంద్రబాబును సమావేశానికి పిలుపుస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్ : బాలకృష్ణ

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై సినీ పరిశ్రమ స్పందన తీరుపై చాలా విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు పాలనలో ఎంతో అభివృద్ధి సాధించిన సినీ పరిశ్రమ, అలాగే లబ్దిపొందిన చాలా...

జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్లేది నిజం – మోదీ, షాలతో భేటీ డౌట్ !

లండన్ లో ఉండి చంద్రబాబును అరెస్టు చేయించి ఇండియాకు రాక ముందే ఢిల్లీ పర్యటన పేరుతో ప్రచారం చేసుకుని మోడీ , షాలతో భేటీ అవుతారని ప్రచారం చేయించుకున్న జగన్ రెడ్డి తాపత్రయం...

చంద్రబాబుకు డబ్బు ముట్టినట్లు ఆధారాలున్నాయా ?: ఏసీబీ కోర్టు జడ్జి

చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్, అలాగే బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్లపై విచారణ ఏసీబీ కోర్టులో జరిగింది. ఉదయం చంద్రబాబు తరపు లాయర్ దూబే, మధ్యాహ్నం...

సుధీర్ బాబుకి ‘హంట్’ నేర్పిన గుణపాఠం

సుధీర్ బాబు 'హంట్' సినిమా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ అయ్యింది. కెరీర్ లో పలు ప్రయోగాలు చేసిన సుధీర్ బాబు.. హంట్ కూడా తనకు మరో ప్రయోగాత్మక చిత్రం అవుతుందని బలంగా నమ్మాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close