వైసీపీ అధినేత జగన్ కు వీక్ డేస్ మంగళవారంతో ప్రారంభమవుతుంది..వీకెండ్ గురువారంతో స్టార్టవుతుంది. ప్రతి మంగళవారం ఆయన ఏపీకి వస్తారు. గత వారం మూడు రోజులు పులివెందులకు కేటాయించారు కాబట్టి తాడేపల్లికి రాలేదు. ఈ వారం వచ్చారు. వచ్చారన్న సంగతి తెలియడానికి.. ఆయనను సోషల్ మీడియాలో వైరల్ చేయడానికి ఓ స్కిట్ కూడా వేశారు.
జగన్ ఎప్పుడు విజయవాడకు వచ్చినా ..స్వాగతం చెప్పడానికి వంద మందిని తోలుకొచ్చే బాధ్యత దేవినేని అవినాష్ దే. ఈ సారి కూడా ఆయన తన వంతు ప్రయత్నం చేశారు. ఇద రొటీన్ గా ఉంటోందని మీడియా, సోషల్ మీడియా పట్టించుకోవడం మావేసింది. అందుకే ఈ సారి ఓ కొత్త ప్లాన్ చేశారు.అదేమిటంటే.. జగన్ రెడ్డి బయటకు వస్తున్న సమయంలో స్వాగతం చెప్పడానికి ఓ మహిళ పాపతో ఎదురు చూస్తూంటారు. ఆ పాప చెప్పు కిందపడిపోయి ఉంటుంది. జగన్ వెళ్తూ వెళ్తూ ఆ చెప్పు పడిపోయిందని చూసి .. తీసి ఇచ్చి వెళ్లడం. అలాగే చేశారు.
ఇప్పుడా వీడియోను వైసీపీ ఫ్యాన్స్.. జన హృదయనేత అని తిప్పుకుంటున్నారు అలాంటి కంటెంట్ కోసమే వారు ఎదురు చూస్తున్నారు. జగన్ కు ఎలివేషన్లు వేయడానికి ఇటీవల సరైన కంటెంట్ లేదు. ఆయనను రప్పా రప్పా రెడ్డిగా ఎంత చూపించినా కామెడీ అవుతోంది. అందుకే.. ఈ సారి సెంటిమెంట్ సీన్‌ను జోడించారు. ఎంతైనా అనుభవం బాగా ఉపయోగపడుతోందని వైసీప నేతలనుకుంటున్నారు.