వెంక‌టేష్ – త్రివిక్ర‌మ్ సినిమా ఫిక్స్‌

త్రివిక్ర‌మ్ మాట‌ల‌కు, వెంకీ ఎక్స్‌ప్రెష‌న్స్ జోడిస్తే ఎలా ఉంటుంది? అదిరిపోతుంది క‌దూ. అందుకే నువ్వు నాకు న‌చ్చావ్‌, మ‌ల్లీశ్వ‌రి సినిమాలు అలా ఆడేశాయి. ఇప్ప‌టికీ టీవీల్లో ఆడేస్తూనే ఉన్నాయి. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఓ సినిమా ఎప్పుడొస్తుందా అని తెలుగు ప్రేక్ష‌కులంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అజ్ఞాత‌వాసిలో అతిథి లాంటి పాత్ర చేస్తున్నాడు. ఇప్పుడు ఎట్ట‌కేల‌కు త్రివిక్ర‌మ్ – వెంక‌టేష్‌ల సినిమా ఫిక్స‌య్యింది. ఇందుకు సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది. వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా హారిక హాసిని కాంబినేష‌న్‌లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రేపు (బుధ‌వారం) వెంకీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది చిత్ర‌బృందం. అజ్ఞాత‌వాసి త‌ర‌వాత ఎన్టీఆర్‌తో ఓ సినిమా రూపొందిస్తాడు త్రివిక్ర‌మ్‌. ఆ త‌ర‌వాతే.. ఈ సినిమా ప‌ట్టాలెక్కుతుంది. ఈలోగా వెంక‌టేష్ తేజ సినిమాని పూర్తి చేస్తారు. దాంతో పాటు నాగచైత‌న్య‌తో ఓ మ‌ల్టీస్టార‌ర్‌నీ ముగించే అవ‌కాశాలున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.