ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా ఎదిగిన విశాఖలో సొంత నివాసం ఏర్పాటు చేసుకునేవారికి సంఖ్య పెరుగుతోంది. క్రమంగా సిటీ విస్తరిస్తోంది. ఈ క్రమంలో శివారు ప్రాంతాల్లో రియల్ బూత్ కనిపిస్తోంది. పలు ప్రాంతాల్లో ఇళ్లు, అపార్టుమెంట్లు నిర్మాణం అవుతున్నాయి. వాటిలో అగనంపూడి ఏరియా కూడా హాట్ ప్రాపర్టీగా మారింది.
కొన్ని సంవత్సరాలలో విశాఖపట్నం శివారు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ స్థిరంగా వృద్ధి చెందుతోంది. కొన్ని ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి.సిటీకి కాస్త దూరంగా ప్రశాంతంగా ఉండాలనుకునేవారికి అగనంపూడి మంచి చాయిస్. స్కూళ్లు, ఆసుపత్రులు, షాపింగ్ సెంటర్లు వంటి వాటికి లోటు లేదు. అగనంపూడి ప్రశాంతమైన ప్రాంతం, ఇది నగర జీవన ఒత్తిడి నుండి దూరంగా ఉండాలనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది.
ఇంకా పూర్తి స్థాయిలో రియల్ వ్యాపారుల దృష్టి పడలేదు. అందుకే ధరలు తక్కువగానే ఉన్నాయి. కొన్ని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలు వెంచర్లు వేస్తున్నాయి. అపార్టుమెంట్ల నిర్మాం పెరుగుతోంది. అగనంపూడిలో స్థలం లేదా ఇల్లు కొనడం దీర్ఘకాలిక పెట్టుబడిగా లాభదాయకంగా ఉంటుంది. ఈ ప్రాంతం అభివృద్ధి దశలో ఉన్నందున ఐదేళ్లలో ధరలు రెట్టింపు అయ్యే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణుల అంచనా.