‘అజ్ఞాతవాసి’ ఫిక్స్ కాలేదా గురు ?

త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఓ అలవాటు అవుతుంది. జనరల్ గా స్క్రిప్ట్ స్టేజ్ లోనే టైటిల్ అనుకుంటారు. కానీ ఆయన మాత్రం స్క్రిప్ట్ పై టైటిల్ రాయరు. అంతేకాదు తన మనసులో వుండే టైటిల్ షూటింగ్ చివరి వరకూ చెప్పారు. జులాయి, అత్తారింటికి దారేది, సన్ అఫ్ సత్యమూర్తి.. సినిమాలు జరుగుతున్నపుడు పదులు సంఖ్యలో టైటిళ్ళు వినిపించాయి. కానీ ఆయన మాత్రం సైలంట్ గా ఒక టైటిల్ ను ఫిక్స్ చేశారు.

ఇప్పుడు ఆయన కొత్త సినిమా విషయంలో కూడా ఇదే సస్పెన్స్ కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ కలయికలో ఓ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకి చాలా టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. ‘దేవుడే దిగివచ్చినా’, ‘ఇంజనీర్‌ బాబు’ ‘ గోకుల కృష్ణుడు’.. ఇలా బోలెడు టైటిల్స్, ఫ్యాన్ మేడ్ పోస్టర్లు దర్శనమిచ్చాయి. అయినా త్రివిక్రమ్ నుండి టైటిల్ ప్రకటన రాలేదు. చివరకి ‘అజ్ఞాతవాసి’ అనే టైటిల్ కి ఫిక్స్ అయిపోయారంత. ఆ టైటిల్ తోనే వార్తలు రాస్తుంది మీడియా. దానిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా మీడియా మాత్రం ఆసినిమాకి ఆ టైటిల్ ఫిక్స్ చేసేసింది. అయితే ఇప్పుడు అధికారిక ప్రకటన వచ్చే సమయం ఆసన్నమైయింది. ఈ నెల 27న ఈ సినిమా ఫస్ట్ టైటిల్ ను రివిల్ చేస్తామని నిర్మాతలు ఒక ప్రీ లుక్ ను విడుదల చేశారు. సో.. ‘అజ్ఞాతవాసి’ మారిపోయిన షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ వున్నది త్రివిక్రమ్.. ఆయనకి సర్ ప్రైజ్ లు ఇష్టం మరి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com