జనవరి 1 నుంచి అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం

హైదరాబాద్: జనవరి 1 నుంచి అగ్రిగోల్డ్ గ్రూప్ ఆస్తులను వేలం వేయాలని ఈ కుంభకోణంపై ఏర్పాటైన రిటైర్డ్ జడ్జి సూర్యారావు కమిటీ హైకోర్ట్‌కు సూచించింది. ఈ కేసు ఇవాళ హైకోర్ట్‌లో విచారణకు వచ్చింది. సూర్యారావు కమిటీ సిఫార్సులను కోర్ట్ స్వీకరించింది. అగ్రిగోల్డ్‌పై మీడియాలో కథనాలను నిరోధించాలని సంస్థ తరపున న్యాయవాదులు హైకోర్ట్‌ను కోరారు. దీనికి కోర్ట్ నిరాకరించింది. ఈ కేసులో బాధితుల తరపున పిటిషన్ దాఖలు చేసిన రమేష్‌బాబు కూడా ఆ ప్రతిపాదనను వ్యతిరేకించారు. మీడియా కథనాలవలనే ప్రజలలో చైతన్యం వచ్చిందని, ఆత్మహత్యలు ఆగాయని, బాధితులకు ఊరట కలిగిందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం బినామీల పేరిట పెట్టిన ఆస్తుల వివరాలను తాము జడ్జికి తెలియజేశామని, వాటి విలువ రు.2,000 కోట్ల వరకు ఉంటుందని పిటిషనర్ చెప్పారు. అగ్రిగోల్డ్ యజమాని వెంకట్రామారావు – తన భార్య, పనివారు, డ్రైవర్‌లు తదితరుల పేరిట బినామీ ఆస్తులను రాశారని, వాటిని ఇప్పుడు విక్రయించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

మరోవైపు అగ్రిగోల్డ్ గ్రూప్ బినామీ ఆస్తుల రెండో జాబితాను మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజి విడుదల చేశారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం 147 సూట్ కేస్ కంపెనీలను పెట్టిందని ఆరోపించారు. రు.25,000 కోట్ల ఈ కుంభకోణం కారణంగా 80 మంది చనిపోయారని, 46 లక్షలమంది బాధితులు రోడ్డున పడ్డారని తెలిపారు. నిందితుల్ని అరెస్ట్ చేయాలని సుప్రీంకోర్ట్ ఆదేశించినా ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవటంలేదని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు కూడా దీనిపై నోరుమెదపకపోవటాన్ని తప్పుబట్టారు. అగ్రిగోల్డ్ గ్రూప్ యజమానులను ఉరితీయాలని, దీనిపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంగ్లిష్ మీడియం కోసమూ సుప్రీంకోర్టుకు ఏపీ సర్కార్..!

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీలో ఇంగ్లిష్ మీడియం మాత్రమే ఉండాలనే పట్టుదలను ప్రదర్శిస్తున్న ఏపీ సర్కార్.. సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఇంగ్లీష్ మీడియంపై హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో...

కృష్ణా బోర్డు భేటీలో ఎప్పటి వాదనలే.. ఎప్పటి వాటాలే..!

కృష్ణా నద యాజమాన్య బోర్డు భేటీలో ఆరు గంటలు వాదోపవాదాలు చేసుకున్నా..చివరికి మొదటికే వచ్చారు రెండు రాష్ట్రాల అధికారులు. ఇద్దరి వాదనలుక..కేఆర్ఎంబీ బోర్డు.. డీపీఆర్‌లు సమర్పించాలనే సూచనతో ముగింపునిచ్చింది. డీపీఆర్‌లు...

తూచ్.. విజయ్‌ మాల్యాను అప్పగించరట..!

విజయ్ మాల్యాను అప్పగించడం లేదని బ్రిటన్ ప్రభుత్వం తేల్చేసింది. న్యాయపరమైన ప్రక్రియ పూర్తి కాలేదని.. చట్ట లాంచనాలు పూర్తి చేయాల్సి ఉందని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. అవి ఏమిటో..ఎప్పుడు పూర్తవుతాయో..మాత్రం చెప్పడం లేదు....

బాల‌య్య ఇంట్లో విందు… చిరు వ‌స్తాడా?

జూన్ 10... బాల‌కృష్ణ పుట్టిన రోజు. ఈసారి పుట్టిన రోజు ప్ర‌త్యేక‌త ఏమిటంటే.. ఇది ఆయ‌న ష‌ష్టి పూర్తి మ‌హోత్స‌వ సంవ‌త్స‌రం. అందుకే ఈ పుట్టిన రోజుని కాస్త ప్ర‌త్యేకంగా జ‌రుపుకోవాల‌ని బాల‌య్య...

HOT NEWS

[X] Close
[X] Close